Gas pipeline leak
-
గ్యాస్ పైప్ లీకేజీ.. ఎగిసిపడ్డ మంటలు
నిజాంపేట్: అపార్ట్‌మెంట్‌కు సరఫరా అయ్యే గ్యాస్ పైప్‌లైన్‌కు లీకేజీ తలెత్తడంతో ఎగిసిపడిన మంటలతో నలుగురు గాయపడ్డారు. వివర్లాల్లోకి వెళితే.. బాచుపల్లి కౌసల్యకాలనీలోని సుఖినైన్ అపార్ట్మెంట్లో సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో 6వ ఫ్లోర్‌లోని ఫ్లాట్ నంబర్.1608లో గ్యాస్ పైపులైన్ లీకేజీ ఏర్పడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఫ్లాట్‌లో ఉంటున్న వినీత్(25), విష్ణు(20), ప్రదీప్(26), భార్గవ (25)లు గాయాలపాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పక్క ఫాట్లలో ఉండే శ్రీహరిరాజు, ప్రసన్నకుమార్, ఉమేష్, మహేష్, హేమంత్, సురేష్‌లు మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గాయపడిన వారికిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని బాచుపల్లి పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని స్థానిక కార్పొరేటర్ ఆగం రాజు సందర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. -
తైవాన్‌లో గ్యాస్ పైప్‌లైన్ పేలుళ్లు
20 మందికి పైగా మృతి.. 270 మందికి గాయాలు తైపీ: భూగర్భంలో ఏర్పాటు చేసిన గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా భారీ పేలుళ్లు సంభవించి.. తైవాన్‌లో 20 మందికిపైగా మరణించగా.. 270 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ దేశ దక్షిణ తీరప్రాంత నగరమైన కావోసియాంగ్లో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా మొదలైన ఈ పేలుళ్లు.. దాదాపు మూడు చదరపు కిలోమీటర్ల పరిధిలో అర్ధరాత్రి వరకూ జరుగుతూనే ఉన్నాయి. ఈ గ్యాస్ పైప్‌లైన్ పేలుళ్ల ధాటికి పైన ఉన్న రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి.. పెద్ద సంఖ్యలో కార్లు ఇళ్లు, దుకాణాలు పాక్షికంగా కూలిపోయాయి.. పేలుళ్లు జరిగిన ప్రాంతమంతా భీతావహంగా మారింది. తైవాన్ అధికారులు ప్రమాద ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. గ్యాస్ లీకేజీకి, పేలుళ్లకు కారణాలను పరిశీలిస్తున్నారు.