
నిజాంపేట్: అపార్ట్‌మెంట్‌కు సరఫరా అయ్యే గ్యాస్ పైప్‌లైన్‌కు లీకేజీ తలెత్తడంతో ఎగిసిపడిన మంటలతో నలుగురు గాయపడ్డారు. వివర్లాల్లోకి వెళితే.. బాచుపల్లి కౌసల్యకాలనీలోని సుఖినైన్ అపార్ట్‌మెంట్‌లో సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో 6వ ఫ్లోర్‌లోని ఫ్లాట్ నంబర్.1608లో గ్యాస్ పైపులైన్ లీకేజీ ఏర్పడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఫ్లాట్‌లో ఉంటున్న వినీత్(25), విష్ణు(20), ప్రదీప్(26), భార్గవ (25)లు గాయాలపాలయ్యాయి.
వెంటనే అప్రమత్తమైన పక్క ఫాట్లలో ఉండే శ్రీహరిరాజు, ప్రసన్నకుమార్, ఉమేష్, మహేష్, హేమంత్, సురేష్‌లు మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గాయపడిన వారికిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని బాచుపల్లి పోలీసులు తెలిపారు. ఘటనా స్థలాన్ని స్థానిక కార్పొరేటర్ ఆగం రాజు సందర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment