GAT
-
ఆ ర్యాంకు వారికి ‘గీతం’లో ఉచిత విద్య
సాక్షి, విశాఖపట్నం: గీతం యూనివర్సిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ శివరామకృష్ణ పూర్తి షెడ్యూల్ను వివరించారు. వచ్చే ఏడాది ప్రవేశాలకు అఖిల భారత స్థాయిలో గ్యాట్-2020(గీతం అడ్మిషన్ టెస్ట్) ద్వారా అడ్మిషన్లు చేపడతామని వెల్లడించారు. ఏప్రిల్ 11 నుంచి 21 వరకు ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 50 కేంద్రాలను కేటాయించారు. ఏప్రిల్ 25న ఫలితాలు ప్రకటించనున్నారు. యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ బ్రాంచెస్లో దరఖాస్తులు లభ్యమవుతాయని స్పష్టం చేశారు. ఆన్లైన్ దరఖాస్తులు www.gitam.edu వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సంవత్సరం నూతనంగా ఇంజనీరింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కోర్సు, మెషీన్ లెర్నింగ్ను, ఎంటెక్లో స్ట్రక్చరల్ ఎనాలసిస్ అండ్ డిజైన్, విత్ డాటా సైన్స్ కోర్సు, మానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ అండ్ అనాలసిస్ కోర్సులు కొత్తగా ప్రవేశపెడుతున్నారు. రూ. 30 కోట్లతో ప్రతిభ గల విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. గ్యాట్- 2020లో మెదటి 50 ర్యాంకుల్లోపు వారికి ఉచిత విద్య, 51-250 ర్యాంకు వారికి ఫీజులో 75శాతం రాయితీ, 251-1000 వరకు ర్యాంకర్లకు 50 శాతం రాయితీ, 1001-3000 ర్యాంకు వారికి ఫీజులో 25 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా శివరామకృష్ణ పేర్కొన్నారు. -
భారత టారిఫ్ల పెంపుపై డబ్ల్యూటీవోకు అమెరికా
న్యూఢిల్లీ: భారత దిగుమతులపై టారిఫ్లు పెంచేసిన అగ్రరాజ్యం... అదే పని భారత్ చేసేసరికి ప్రపంచ వాణిజ్య సంస్థను (డబ్ల్యూటీవో) ఆశ్రయించింది. గతేడాది భారత్, ఇతర దేశాల నుంచి వచ్చే అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై సుంకాలను అమెరికా పెంచేయడమే కాకుండా, జీఎస్పీ కింద భారత్కు చెందిన కొన్ని ఉత్పత్తులకు ఇస్తున్న జీరో టారిఫ్ ప్రయోజనాన్ని కూడా ఈ ఏడాది మే నుంచి నిలిపేసింది. దీంతో భారత్ అమెరికా నుంచి దిగుమతి అవుతున్న బాదం, వాల్నట్స్ తదితర 28 రకాల ఉత్పత్తులపై టారిఫ్లను ఈ నెల నుంచి పెంచింది. భారత్ చర్య అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు విరుద్ధంగా ఉందని అమెరికా ఆరోపించింది. భారత్ విధించిన అదనపు సుంకాలు 1994 నాటి ట్రేడ్, టారిఫ్ల సాధారణ ఒప్పందం (గాట్) కింద అమెరికాకు అందుతున్న ప్రయోజనాలను రద్దు చేయడం లేదా బలహీనపరచడం చేస్తున్నట్లు డబ్ల్యూటీవోకు రాసిన లేఖలో అమెరికా ఆరోపించింది. గాట్ ఒప్పందం అన్నది డబ్ల్యూటీవో పరిధిలోని సభ్య దేశాల మధ్య కస్టమ్స్ సుంకాల వంటి వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ఉద్దేశించినది. డబ్ల్యూటీవో పరిధిలోని మరే ఇతర సభ్య దేశం నుంచి సహజంగా ఉత్పత్తి అయి వచ్చే ఈ తరహా దిగుమతులపై భారత్ సుంకాలు విధించజాలదని అమెరికా పేర్కొంది. అలాగే, భారత్ రాయితీల షెడ్యూల్లో పేర్కొన్న దాని కంటే కూడా విధించిన సుంకాల రేట్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీవో వివాద పరిష్కార యంత్రాంగం కింద భారత్తో చర్చలకు వీలు కల్పించాలని, ఇరువురికీ ఆమోదయోగ్యమైన రోజు చర్చలు జరిగేలా చూడాలని అమెరికా కోరింది. -
రేపటి నుంచి శ్వేతపత్రాలు విడుదల
-
రేపటి నుంచి శ్వేతపత్రాలు విడుదల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపటి నుంచి శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు. మొదటి శ్వేతపత్రం రేపు విద్యుత్ శాఖపై విడుదల చేస్తారు. ఏపీ ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. వస్తుసేవల పన్నుపై ఈ నెల 3న జరిగే ఆర్థికమంత్రుల సదస్సులో ఆయన పాల్గొంటారు. వ్యాట్ బదులు జీఎటీ అమలుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రానికి నష్టం లేకుండా, పన్నులపై అధికారం కోల్పోకుండా ఉన్నట్లయితే అంగీకారం తెలిపేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధపడనుంది.