gayathri devi
-
శరన్నవరాత్రులు..రెండో రోజు గాయత్రీ దేవి అలంకారం
పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ శరన్నవరాత్రులు కోలహలం ప్రారంభమయ్యింది. రోజుకో అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చే అమ్మవారు శరన్నవరాత్రి రెండో రోజు గాయత్రి దేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. వేదాలకు అధిదేవత అయిన గాయత్రి మాత ఆరాధనతో సమస్త విద్యలు ఒంటబడతాయనేది భక్తుల నమ్మకం. ఈ రోజు అమ్మవారు ఆయా ప్రాంతాల వారిగా పసుపు లేదా కనకాంబరం లేదా నారింజ రంగు చీరలో దర్శనమిస్తారు. పంచముఖాలతో ఉండే గాయత్రీ దేవి స్వరూపానికి ఎంతో విశిష్టత ఉంది.సకల మంత్రాలకు మూలమైన శక్తిగా వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్తా విద్రుమ హేమనీల దవళవర్ణాలతో గాయత్రీ దేవి ప్రకాశిస్తుంది.. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా గాయత్రీ దేవి వెలుగొందుచున్న రూపాన్ని చూసి భక్తులు తరిస్తారు.. గాయత్రీ దేవి ని దర్శించుకుంటే సకల మంత్ర సిద్ధి ఫలం పొందుతారని భక్తుల విశ్వాసం.."ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్చాయైర్ముఖైస్త్రీ క్షణై:యుక్తామిందు నిబద్ధరత్నమకుటం తత్త్వార్థ వర్ణాత్మికామ్!గాయత్రీం వరదాభయాంకుశమ్ కశాశ్శుభ్రం కపాలం గదాంశంఖం చక్రమధారవింద యుగళం హసైర్వాహంతీం భజే"శ్రీశైలం వంటి పలు పుణ్యక్షేత్రాల్లో రెండో రోజు బ్రహ్మచారిణిగా భక్తులకు దర్శనమిస్తారు. బ్రహ్మచారిణి మాతను తపస్సు చేసే దేవత అంటారు. ఈ అమ్మవారిని పూజించడం వల్ల భక్తి, సిద్ధి రెండూ లభిస్తాయని పండితులు చెబుతారు. దుర్గాదేవి ఈ రూపంలో కొన్నేళ్ల పాటు తీవ్రమైన తపస్సు చేయడం కారణంగా బ్రహ్మచారిణిగా పిలవడం జరిగిందనేది పురాణ కథనం. ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల ఐశ్వర్యం, జ్ఞానం, వైరాగ్యం, సహనం, ధైర్యం వంటివి లభిస్తాయని పండితులు చెబుతారు.'ఓం హ్రీం క్లీం బ్రహ్మచారిణ్యై నమః’ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే కోరిన కోరిక సిద్ధిస్తుందని నమ్మకం.నైవేద్యం: అల్లం గారెలు, పులిహోర (చదవండి: అగ్ని స్నానమాచరించే అమ్మవారు..! సైన్సుకే అంతు చిక్కని మిస్టరీ!) -
షిఫాన్ రాణి
ధరించే దుస్తుల నుంచి అలంకరించుకునే ఆభరణాల వరకు అన్నీ భారీగానే ఉంటాయి మహారాణులకు. మహారాణులంటే ఇలాగే ఉండితీరాలి అన్నట్టుగా ఉంటారు వారు. ఈ సంప్రదాయ ఆహార్యం ఓ మహారాణికి బాగా విసుగు పుట్టించింది. దీంతో ఆమె సాదాసీదా, బరువులేని వస్త్రాలు ధరించాలను కుంది. భారీగా కాకుండా సిల్క్‌తో తయారయ్యే షిఫాన్ చీరను కట్టుకుని పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో ఇండియాలో బాగా పాపులర్ అయ్యి, షిఫాన్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు ఆ రాణీగారు. అప్పటినుంచి ఇప్పటికీ షిఫాన్ చీరలు మగువల మనసులు దోస్తూనే ఉన్నాయి. స్టైల్గానేగాక, ఎంతో సౌకర్యంగా ఉండే షిఫాన్ చీరలను ప్రపంచానికి పరిచయం చేసింది రాణి ఇందిరాదేవి. అప్పటి బరోడా రాష్ట్ర యువరాణి. కూచ్‌బెహర్ మహారాజా జితేంద్ర నారాయణ్‌ను వివాహం చేసుకున్న ఇందిరా దేవి ధరించే దుస్తులు చూపరులను అమితంగా ఆకర్షించేవి. ఎప్పుడూ భారీగా ఉండే చీరలు, నగలు ధరించే ఇందిరకు వాటిమీద మొహం మెత్తేసింది. తేలికగా ఉండే చీరలను ధరించాలనుకుంది. ఎక్కువగా యూరప్‌లో పర్యటించే ఆమె ఎంతో ఖరీదైన షిఫాన్ వస్త్రాన్ని ఫ్రాన్స్ నుంచి తెప్పించుకుని ఆరుగజాల చీరను రాజవంశానికి తగ్గట్టుగా కళాకారులతో డిజైన్ చేయించి మరీ ధరించింది. అది ఆమెకు బాగా నప్పడంతోపాటు కట్టుకుంటే చాలా సౌకర్యంగా ఉండడంతో.. అప్పటి నుంచి షిఫాన్ చీరలనే ధరించేది. ఇలా షిఫాన్ చీరలను ఇందిర ఇండియాకు పరిచయం చేసింది. తల్లికి తగ్గ వారసురాలిగా.. ఇందిర కూతురు జైపూర్ మహారాణి గాయత్రి దేవి కూడా అమ్మ షిఫాన్ చీరకట్టును అనుసరించింది. తల్లి ధరించినట్టుగానే షిఫాన్ చీర, నవరత్నాల నెక్లెస్, బాబ్డ్హెయిర్తో ప్రతి కార్యక్రమంలో పాల్గొనేది. షిఫాన్ చీరకట్టుతో అందంగా ఉండడంతో ప్రపంచంలోని పదిమంది అందమైన మహిళల్లో గాయత్రి దేవి ఒకరుగా నిలిచినట్లు 1960లో ఓ మ్యాగజీన్ పేర్కొంది. ఇందిరా, గాయత్రి షిఫాన్ చీరలు మహిళలను అమితంగా ఆకట్టుకోవడంతో.. అన్ని తరగతుల వారు వీటిని ధరించడం మొదలు పెట్టారు. అలా దేశవ్యాప్తంగా షిఫాన్ పాపులర్ అయ్యింది. బ్రిటన్ మహారాణి తల్లి నుంచి ప్రిన్సెస్ డయానా వరకు అందరూ షిఫాన్ను వాడినవారే. వారి గౌనులు షిఫాన్‌తో తయారు చేయించుకుని అనేక కార్యక్రమాల్లో మెరిసిపోయేవారు. మహారాణుల నుంచి సామాన్యులు మెచ్చిన షిఫాన్ను సిల్క్ నుంచి రూపొందించేవారు. అప్పట్లో దీనిని సంపద, ప్రతిష్టకు గౌరవసూచికగా భావించేవారు. తర్వాత నైలాన్, సింథటిక్ ఫైబర్ అందుబాటులోకి రావడంతో పాలిస్టర్ షిఫాన్ అందుబాటులోకి వచ్చి ధరకూడా తగ్గింది. ఇప్పటికీ ఫ్రెంచ్‌లో తయారయ్యే షిఫాన్ ధర లక్షల్లోనే ఉంటుంది. ఒకరి విభిన్న ఆలోచనకు ప్రతిరూపమే నేటి షిఫాన్ చీరలు. ట్రెండ్ సెట్టర్లు కావాలంటే గుంపులో గోవిందా అనకుండా..వందమందిలో ఉన్నా ఒక్కరిలా నిలిచేలా సరికొత్తగా ఆలోచించాలి. -
దేవుడు పిలుస్తున్నాడంటూ ఆత్మహత్య
-
ఏమిటీ శాపం!
మంచి జీవితాన్నివ్వు... ఒడిదొడుకులను అధిగమించే అందమైన బతుకునివ్వు... నిండా నూరేళ్ల ఆయుష్షును ప్రసాదించు... ఏ భక్తుడైనా ఆదిదేవుడి ముందు మోకరిల్లి ప్రార్థిస్తారు. ఏ దైవం కూడా తనువును చాలించి తనలో ఐక్యం కావాలని కోరదు... అలా కోరితే అది సైతానవుతుంది గానీ దైవమెలా అవుతుంది...? ఆ విషయాన్ని గ్రహించని ఓ యువతి ‘తనను దేవుడు పిలుస్తున్నా’డంటూ ఆత్మహత్యకు పాల్ప డింది. వివాహమై పట్టుమని పది రోజులే దాటింది ... అంతలోనే ఈ విషాదం. ఈ ఏడాది జూలై నెలలో కాకినాడ సమీపంలోని కరప మండలంలో ముగ్గురు మహిళలు ఇదే మాదిరిగా బలవన్మరణానికి పాల్పడిన ఘటన మరువకముందే తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామానికి చెందిన యాళ్ల గాయత్రీదేవి (20) మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాళ్లరేవు(ముమ్మిడివరం): తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామానికి చెందిన యాళ్ల గాయత్రీదేవి(20) మంగళవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లైన 11 రోజులకే తనువు చాలించింది. కోరంగి ఎస్సై వి.సుమంత్, మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..మండల పరిధిలోని జార్జిపేట గ్రామానికి చెందిన అద్దెంకి వెంకట రమణ సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అతడికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె జ్యోతికి పెళ్లై అత్తారింటికి వెళ్లిపోగా, రెండో కుమార్తె గాయత్రీదేవికి గత నెల 25న కాకినాడ సూర్యనారాయణపురం గ్రామానికి చెందిన యాళ్ల సత్యమూర్తితో వివాహమైంది. అయితే మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్ప డింది. ఇది గమనించిన గాయత్రీదేవి చిన్నమ్మ మంగాదేవి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి తలుపులు పగులగొట్టారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను స్థానికులు హుటాహుటిన యానాం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పెళ్లయ్యి రెండు వారాలు కూడా కాకముందే గాయత్రీదేవి మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. వధూవరులుగా సత్యమూర్తి, గాయత్రీదేవి(ఫైల్ ఫొటో) ఏసులో ఐక్యమవుతానని.. యానాం యూకేవీ నగర్లో నివాసం ఉండే వెంకటరమణ అక్కడ అద్దెలు ఎక్కువగా ఉండడంతో ఏడాది క్రితం జార్జిపేటలోని తన బంధువుల పక్క పోర్షన్‌ను అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. గాయత్రీదేవి యానాంలోని ఓ వస్త్ర దుకాణంలో పనిచేస్తుండేది. ఆమె తల్లి సత్యవేణి 18 ఏళ్ల క్రితం క్రైస్తవమతాన్ని స్వీకరించగా, గాయత్రీదేవి కూడా నాలుగేళ్ల క్రితం క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. వీరు తరచూ యూకేవీ నగర్‌లోని చర్చికి వెళ్లి ప్రార్థనలు చేసుకుని వస్తుంటారు. నిరంతరం ఏసుప్రభువును తలచుకుంటూ ప్రార్థనలు చేస్తుండేవారు. కొన్ని రోజులుగా గాయత్రీ దేవి వైఖరిలో తీవ్ర మార్పులు సంభవించాయి. తన జీవితం ఏసుకు అంకితమని చెబుతూ, తాను చనిపోయి ఏసులో ఐక్యమవుతాననేది. దీంతో ఆమె మాటలకు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందేవారు. ఆమెకు పెండ్లి చేస్తే మామూలుగా తయారవుతుందని భావించి క్రైస్తవ కుటుంబానికి చెందిన సత్యమూర్తితో అక్టోబర్ 30న నిశ్చితార్థం చేశారు. అయితే గాయత్రీదేవి తానెక్కడ ఏసుకు దూరమవుతానో అన్న ఆందోళనతో దిగులుగా ఉండేది. గత నెల 25 పాస్టర్ల సమక్షంలో సత్యమూర్తితో క్రైస్తవ వివాహం జరిపించారు. ఈనెల 3న సత్యమూర్తి జార్జిపేట వచ్చాడు. భార్యతో కలిసి యూకేవీ నగర్ చర్చికి వెళ్లడంతో పాటు యానాంలోని పలు పర్యాటక ప్రదేశాలను ఆసక్తిగా తిలకించారు. సోమవారం సత్యమూర్తిని గాయత్రీదేవి బాగానే సాగనంపిందని తల్లిదండ్రులు తెలిపారు. మంగళవారం ఇంట్లో ప్రార్థన చేసుకుంటుందనుకున్నామని, ఇంతలో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. తాళ్లరేవు తహసీల్దార్ లోడా జోసెఫ్, కోరంగి ఎస్సై సుమంత్‌లు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. 2017 డిసెంబర్ 05.. ‘‘నా జీవితం ఏసుకే అంకితం.. నేను చనిపోయి ఆయనలో ఐక్యమవుతా’’ అంటూ ఆమె నిరంతరం కుటుంబ సభ్యులతో చెబుతుండేది. ఆమె మాటలకు ఆమె ఎక్కడ దూరమవుతుందోననే బాధలో కుటుంబ సభ్యులు ఉండేవారు. పెళ్లి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో క్రైస్తవ కుటుంబానికి చెందిన వ్యక్తితో క్రైస్తవ సంప్రదాయంలోనే 11 రోజుల క్రితం వివాహం జరిపించారు. అయినా ఆమె వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదు. దిగులుగానే ఉండేది. ఏమైందో తెలియదు.. ఇంట్లో ప్రార్థన చేసుకుంటుందనుకుంటున్న ఆమె.. చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనతో ఆమె కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. మంగళవారం తాళ్లరేవు మండలం జార్జిపేట గ్రామంలో జరిగిన ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. 2017 జూలై తొమ్మిదో తేదీ.. ఆ మహిళలు ముగ్గురూ క్రైస్తవ మతం తీసుకున్నారు. వారిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు కాగా ఒకరు చెల్లెలి కుమార్తె. నాలుగేళ్లుగా చర్చికి వెళుతున్నారు. ఎవ్వరితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదు. వెళితే చర్చికి.. లేకపోతే ఇంటికి వెళ్లి ప్రార్థనలు చేసుకోవడమే వారి పని. మరోవైపు వారికి ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ లేవు. జీవితం సజావుగానే సాగుతోంది. 2017 జూలై తొమ్మిదో తేదీన తమ కుమారుడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాళ్ల ఇంటి వద్దే అందరికీ భోజనాలుపెట్టి, పాస్టర్‌తో ప్రార్థనలు చేయించారు. ‘‘దేవుడు వచ్చేస్తున్నాడు.. దేవుడి దగ్గరకు వెళ్లిపోవాలి’’ అంటూ మాట్లాడుకున్నారు. ఆదివారం రాత్రి ముగ్గురు మహిళలు చర్చికి వెళ్లి అక్కడే ఉండిపోయారు. ఉదయం పాస్టర్ లేచిన తర్వాత ప్రార్థన చేసి, పండ్లు పెట్టగా ఆ ముగ్గురూ ఇంటికి వచ్చేశారు. సోమవారం ‘‘ఇంటిలో దుష్టశక్తులు తిరుగుతున్నాయని అవి పోయేందుకు ప్రార్థనలు చేస్తాం’ అంటూ ఓ గదిలోకి వెళ్లి గడియపెడ్డారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో కుటుంబసభ్యులు ఇంటి వెనుక వైపు తలుపు పైకెత్తి చూడగా ఆ ముగ్గురు ఉరి వేసుకుని చనిపోయారు. కరపలోని నీలయ్యతోటవీధిలో జరిగిన ఈ సంఘటనలో కరెడ్ల చంద్రం కుమార్తెలు రాసంశెట్టి సత్యవేణి(48), సత్తి ధనలక్ష్మి(40), ధనలక్ష్మి కుమార్తె సత్తి వైష్ణవి(18) ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినా.. ఇంత వరకూ ఆ మరణాల మిస్టరీ వీడలేదు. -
గాయత్రీదేవిగా ఏడుపాయల దుర్గమ్మ
పాపన్నపేట: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏడుపాయల వన దుర్గామాత మంగళవారం శ్రీ గాయత్రిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గోకుల్‌షెడ్డులో ఏర్పాటు చేసిన అమ్మవారిని ముదురు ఆకుపచ్చ రంగు వస్త్రాలతో విశేష అలంకరణతో ప్రత్యేక పూజలు చేశారు. ఎంపీపీ సొంగ పవిత్రతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు పాల్గొన్నారు. కాగా ఘనపురం ఆనకట్ట పై నుంచి పొంగుతున్న వరదనీటితో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం ఇంకా జలదిగ్భంధంలోనే కొనసాగుతోంది. -
మనోహరం.. నేత్రపర్వం
గాయత్రీదేవిగా వర్గల్ విద్యాధరి సాక్షాత్కారం అమ్మవారి సేవలో కేంద్రమంత్రి దత్తాత్రేయ వర్గల్: సకల శక్తి స్వరూపిణి శ్రీవిద్యా సరస్వతి వెలసిన వర్గల్ క్షేత్రంలో శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు భక్తిరసం పంచుతున్నాయి. ఉత్సవాల్లో రెండోరోజైన ఆదివారం అమ్మవారు గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకలకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆయనకు ఆలయ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. కొండపై కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని, పూజలు జరిపించారు. అమ్మవారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రిని ఘనంగా సన్మానించారు. ఉదయం ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి, వేదపండితులు అనంతగిరిశర్మ, బాల ఉమామహేశ్వర శర్మ, శశిధర శర్మ, ప్రవీణ్‌శర్మ నేతృత్వంలో తెల్లవారుజామున గణపతి పూజతో రెండోరోజు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం అమ్మవారి మూలవిరాట్టుకు స్తోత్ర నామార్చనలతో పంచామృత అభిషేకం జరిపారు. అమ్మవారికి అలంకారసేవ నిర్వహించారు. పూలమాలలు, పట్టు వస్త్రాలు, సర్వాభరణాలతో అమ్మవారిని గాయత్రీ దేవీగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. తొగుట పీఠాధిపతికి పూర్ణకుంభ స్వాగతం విద్యాధరి క్షేత్రాన్ని తొగుట పీఠాధిపతి మాధవానందస్వామి ఆదివారం సందర్శించారు. ఆయనకు ఆలయ వర్గాలు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం సభా ప్రాంగణం చేరుకున్నారు. అదే వేదికపై ఆలయం తరఫున కేంద్రమంత్రి దత్తాత్రేయకు జ్ఞాపిక అందజేశారు. యోగా గురువు మధునాల శ్రీనివాస్ రచించిన ‘అలసిన మనసుకు అమృతం యోగామృతం’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఆలయ నిర్మాణం, అభివృద్ధిలో కృషి చేసిన భక్తులను రజతోత్సవ పురస్కారాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మర్పడగ క్షేత్రం వ్యవస్థాపకులు డాక్టర్ చెప్పెల హరినాథ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. భారతీయ సంస్కృతే గొప్పది: మంత్రి దత్తాత్రేయ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధార్మిక కార్యక్రమంలో మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ... భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే గొప్పదన్నారు. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్నారు. వర్గల్ క్షేత్రం తెలంగాణలోనే ఒక ప్రముఖ స్థానం సాధించనుందన్నారు. అమ్మవారిని దర్శించుకున్న తాను దేశానికి, కార్మికులకు సేవ చేసేలా ఆశీస్సులు అందజేయాలని ప్రార్థించినట్లు మంత్రి పేర్కొన్నారు. నేడు అన్నపూర్ణాదేవిగా .. విద్యాధరి మాత ఉత్సవాల్లో మూడోరోజు సోమవారం వర్గల్ అమ్మవారు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. -
గాయత్రీదేవిగా భద్రకాళీ అమ్మవారు
జిన్నారం: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బొంతపల్లిలోని భద్రకాళీ అమ్మవారు ఆదివారం గాయత్రీ దేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో ఉదయం నుంచి అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. అమ్మవారిని దర్మించుకునేందుకు భక్తులు బారులు తీరారు. బొంతపల్లిలోని దుర్గామాత సన్నిధిలో స్థానిక నాయకుల చక్రపాణి, శంకర్ల ఆద్వర్యంలో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టారు. జిన్నారంలోని దుర్గామాత సన్నిధిలో భక్తులు ఉదయం, సాయంత్రం వేళ్లల్లో ప్రత్యేక పూజలు చేపట్టారు. అమ్మవారి కృపవల్ల ప్రజలు సంతోషంగా ఉండాలని నాయకులు ఆకాంక్షించారు.