GD Aruna
-
ఆసరా పింఛన్లకు రూ. 38.75 కోట్లు
హైదరాబాద్: వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇచ్చే ఆసరా పింఛన్లకు అయ్యే వ్యయం కోసం రూ.38.75 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన మంజూరు ఇచ్చింది. బడ్జెట్ (2015-16) ప్రతిపాదనల్లో భాగంగా వివిధ పథకాల కింద ఈ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు గురువారం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి జి.డి.అరుణ ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. -
గిరిజన మహిళా పైలట్ బాబీ శిక్షణకు రూ. 25 లక్షలు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలోని ఫ్లోరిడా మియామీ అంతర్జాతీయ ఫ్లైయింగ్ స్కూల్లో కమర్షియల్ పైలట్ ట్రైనింగ్ లెసైన్స్ శిక్షణ పొందేందుకు ఆర్థిక సహాయం కింద కె.హరి రాం నాయక్ కుమార్తె అజ్మీరా బాబీకి రూ.25 లక్షలకు పరిపాలనా మంజూరునిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవా రం గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి జీడీ అరుణ ఉత్తర్వులు జారీచేశారు.