geological center
-
నెలలో 1,000 విస్ఫోటాలు
తూర్పు ఇండోనేషియాలో ఉత్తర మలుకు ప్రావిన్స్‌లోని మారుమూల ద్వీపం హల్మహెరాలోని ఇబూ అగ్నిపర్వతం ఈ జనవరి నెలలో కనీసం 1,000 సార్లు బద్దలైంది. గత ఆదివారం ఒక్కరోజే ఈ అగ్నిపర్వతం 17 సార్లు విస్ఫోటం చెందిందని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ అధికారులు సోమవారం ప్రకటించారు. విస్ఫోటం దాటికి అగ్నిపర్వతం సమీపంలో నివసిస్తున్న ఆరు గ్రామాల్లో మూడు వేల మంది గ్రామస్తులను అధికారులు హుటాహుటిన ఖాళీ చేయిస్తున్నారు. పండించిన పంట చేతికొచ్చే సమయం కావడంతో చాలా మంది నివాసితులు ఖాళీ చేయడానికి విముఖత చూపుతున్నారు. అలాంటివారు సురక్షిత షెల్టర్లలో ఉండాలని అధికారులు సూచించారు. గత బుధవారం విస్ఫోటనంతో నాలుగు కిలోమీటర్ల ఎత్తుకు బూడిద ఎగసిపడింది. పర్వతంలో జనవరి 1 నుంచి ఇప్పటివరకూ 1,079 విస్పోటాలు నమోదయ్యాయి. ఆదివారం జరిగిన విస్ఫోటకం తీవ్రంగా ఉందని ఏజెన్సీ తెలిపింది. ‘స్థానిక కాలమానం ప్రకారం గత ఆదివారం తెల్లవారుజామున 1.15 గంటలకు 1.5 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద మేఘం గాల్లోకి ఎగిసింది. ఈ ధూళి మేఘం నైరుతి దిశగా విస్తరిస్తోంది. మౌంట్ ఇబు అబ్జర్వేషన్ పోస్ట్ వరకు పెద్ద శబ్దం వినిపించింది’’అని ఒక ప్రకటనలో వెల్లడించింది.ఎవ్వరూ వెళ్లొద్దని హెచ్చరికలు ఇండోనేషియాలోని అత్యంత చురుకైన అగ్నిపర్వతాల్లో మౌంట్ ఇబూ ఒకటి. గత జూన్ నుంచి విస్ఫోటాలు గణనీయంగా పెరిగాయి. దీంతో అగ్ని పర్వతం శిఖరం చుట్టూ ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరం వరకు ఎవ్వరూ వెళ్లొద్దని హెచ్చరికలు జారీచేశారు. మౌంట్ ఇబు సమీపంలో నివసిస్తున్నవారు, పర్యాటకులు మాస్క్ ధరించాలని సూచించారు. అధికారిక గణాంకాల ప్రకారం 2022 నాటికి హల్మహెరా ద్వీపంలో సుమారు 7,00,000 మంది నివసిస్తున్నారు. విస్తారమైన ద్వీపసమూహమైన ఇండోనేషియా.. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉండటంతో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత పేలుళ్లకు చిరునామాగా మారింది. గత నవంబర్‌లో పర్యాటక ద్వీపం ఫ్లోర్స్‌లోని 1,703 మీటర్ల ఎత్తయిన జంట శిఖరాల అగ్నిపర్వతం మౌంట్ లెవోటోబి లాకి–లాకీ ఒక వారంలో అనేక మార్లు విస్ఫోటనం చెందింది. దీంతో తొమ్మిది మంది మరణించారు. ఉత్తర సులవేసి ప్రావిన్స్‌లోని రువాంగ్ పర్వతం గతేడాది ఆరుసార్లు విస్ఫోటనం చెందడంతో సమీప ద్వీపాల నుంచి వేలాది మందిని అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భూసార మెంతో తేలుతుందిక..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 711 మినీ భూసార పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయా లని వ్యవసాయశాఖ నిర్ణయించింది. 15 జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో వీటిని నెలకొల్పుతారు. ఎరువుల దుకాణదారులు భూ సార పరీక్షా ఫలితాలు, ఆధార్ కార్డుల ఆధారంగానే ఎరువులు విక్రయించాలన్న మార్గదర్శకాల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. భూసార కార్డులను అనుసంధానిత ఎరువుల నిర్వహణ వ్యవస్థ (ఐఎఫ్ఎమ్ఎస్)కు జత చేసేందుకు భూసార వెబ్సైట్లో రైతుల ఆధార్ నంబర్, సర్వే నంబర్లను నమోదు చేస్తారు. ప్రస్తుతం క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులు మట్టి నమూనాలు సేకరించి ఫలితాలను వెబ్సైట్లో నమోదు చేస్తున్నారు. ఇటీవల వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు సర్వే, రైతు సమన్వయ సమితులు వంటి వాటితో పని ఒత్తిడి పెరిగి, మట్టి నమూనాల సేకరణ మందగించిం ది. రాష్ట్ర వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 12, వ్యవసాయ మార్కెటింగ్‌లలో 28, సంచార భూసార కేంద్రాలు 4, మినీ భూసార పరీక్షా కేంద్రాలు 2,050 ఉన్నాయి. వాటికితోడు గ్రామస్థాయిలో మరిన్ని రాబోతున్నాయి. యువతకు ఉపాధి కేంద్రం గ్రామీణ యువతకు ఉపాధి కల్పించే పథకంలో భాగంగా 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల లోపున్న యువకులకు ఈ కేంద్రాలను మం జూరు చేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 నుంచి 40 శాతం చొప్పున నిధులు సమకూర్చుతాయి. యువతకు 75 శాతం సబ్సిడీతో మినీ భూసార కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం కల్పిస్తున్నారు. మిగతా 25 శాతం లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది. గ్రామ స్థాయిలో సాగయ్యే భూమిలో ఆరున్నర ఎకరాలకు ఒక మట్టి నమూనాను తీసుకోవాల్సి ఉంటుంది. మినీ భూసార కేంద్రాన్ని ఏర్పా టు చేయాలనుకునే వారు పదో తరగతి పాసై ఉండాలి. రైతులందరికీ భూసార కార్డులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించింది. కానీ ఆచరణలో మాత్రం అమలుకావడం లేదన్న ఆరోపణలున్నాయి. 2018–19లో 4,72,987 మట్టి నమూనాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. ఇందులో 4,70,875 ఫలితాల ను పరీక్షించి ఆన్లైన్ చేశారు. మొత్తం 23,91,395 భూసార కార్డులను పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి లో 10 లక్షల కార్డులు మాత్రమే రైతులకు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. -
ఉత్తరఖండ్‌లో పలుచోట్ల భూ ప్రకంపనలు
ఉత్తరఖండ్: ఉత్తరఖండ్‌లో పలుచోట్ల గురువారం రాత్రి భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు న్యూస్ ఏజెన్సీ నివేదిక ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉత్తరఖండ్ తోపాటు సమీప ప్రాంతాలైన నయినైతల్, చామౌలి, భిమతాల్, పిథోఘడ్ లలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు జియోలాజికల్ విభాగ కేంద్రం పేర్కొంది.