geology course
-
జియాలజీ కోర్సు- ఇన్స్టిట్యూట్లు
జియాలజీ కోర్సును అందిస్తున్న ఇన్స్టిట్యూట్ల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి? - నరేశ్, తిరుపతి విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. జియాలజీలో ఎంఎస్సీ, మూడేళ్ల వ్యవధి గల అప్లైడ్ జియాలజీలో ఎంఎస్సీ(టెక్)లను అందిస్తోంది. అర్హత: సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.andhrauniversity.edu.in రుపతిలోని శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం.. జియాలజీలో ఎంఎస్సీను అందిస్తోంది. అర్హత: జియాలజీ సబ్జెక్టుతో బీఎస్సీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.svuniversity.ac.in హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. అప్లైడ్ జియాలజీలో ఎంఎస్సీను అందిస్తోంది. అర్హత: కనీసం 40 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.osmania.ac.in వీటితోపాటు ఢిల్లీ విశ్వవిద్యాలయం (www.du.ac. in), పుణె విశ్వవిద్యాలయం (ఠీఠీఠీ.ఠజీఞఠ్ఛ.్చఛి. జీ) వంటివి కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి.ఉద్యోగావకాశాలు: యూపీఎస్సీ నిర్వహించే జియాలజిస్ట్, సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులవటం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు. మినరల్ ఎక్స్‌ప్లొరేషన్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఎక్స్ట్రాక్షన్ వంటి రంగాల్లో ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు సాధించవచ్చు. నానోఎలక్ట్రానిక్స్ కోర్సును అందిస్తున్న ఇన్స్టిట్యూట్ల వివరాలు తెలపండి? - వెంకట్, గుంటూరు హైదరాబాద్‌లోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం.. నానో ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్‌ను అందిస్తోంది.అర్హత: కెమికల్/మెకానికల్/ ఏరోనాటికల్/ఎలక్ట్రికల్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ బయోటెక్నాలజీ/ మెటీరియల్ సైన్స్‌లలో బీఈ/బీటెక్ లేదా కెమిస్ట్రీ/ఫిజిక్స్/ బయోటెక్నాలజీ/ ఎర్త్ సెన్సైస్/ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌లలో ఎంఎస్సీ లేదా తత్సమానం. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.jntuh.ac.in అనంతపురంలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం.. మైక్రో అండ్ నానో ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ కోర్సును అందిస్తోంది. అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీటెక్. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.jntua.ac.in తంజావూరులోని శాస్త్ర విశ్వవిద్యాలయం.. నానో ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది. అర్హత: ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్. ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా. వెబ్సైట్: www.sastra.edu సివిల్ సర్వీసెస్ పరీక్ష గురించి పూర్తి వివరాలు తెలపండి? - సత్యవతి, బొబ్బిలి భారతీయ సర్వీసుల్లోకెల్లా అత్యున్నత సర్వీసుగా సివిల్ సర్వీసెస్ పరీక్షను పేర్కొనవచ్చు. ఈ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తుంది. ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్,సెంట్రల్ సెక్రటేరియెట్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్), గ్రూప్-ఏ వంటి పోస్టుల్లో నియామకాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తుంది. అర్హత: ఏదైనా డిగ్రీ. అభ్యర్థి వయసు 21-30 ఏళ్ల మధ్యలో ఉండాలి. పరీక్ష విధానం: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్, సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీ-శాట్).ఈ రెండు పరీక్షలు ఒకే రోజు జరుగుతాయి. ఒక్కో పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ వర్తమాన వ్యవహారాలు, భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ, జనరల్ సైన్స్ వంటి అంశాలపై జనరల్ స్టడీస్ పేపర్లో ప్రశ్నలు అడుగుతారు. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ స్కిల్స్ వంటి వాటిపై సీ-శాట్ పేపర్లో ప్రశ్నలు అడుగుతారు. మెయిన్ పరీక్ష: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు పిలుస్తారు. ఇందులో 9 పేపర్లు ఉంటాయి. డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. అభ్యర్థి పూర్తిస్థాయి నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఇందులో పరీక్షలు ఉంటాయి. వీటిని ఇంగ్లిష్ లేదా ఎనిమిదో షెడ్యూల్లో ఉన్న ఏదైనా ఒక భాషలో రాయవచ్చు. ఇందులో తెలుగు కూడా ఉంది. ఇంటర్వ్యూ: - సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థి వ్యక్తిగత సామర్థ్యం, నాలెడ్జ్, విలువలను పరీక్షించే రీతిలో ప్రశ్నలు ఉంటాయి. సివిల్ సర్వీసెస్.. భారతదేశంలో జరిగే పరీక్షలన్నిటిలో కష్టమైంది. సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నిరంతర శ్రమ, కఠోర దీక్ష, పట్టుదల అవసరం. ప్రపంచ వ్యాప్తంగా జరిగే అంశాలన్నిటిపైనా నిరంతరం అప్డేట్ అవుతూ పట్టు సాధించాలి. నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ పెంచుకోవటం కోసం మేగజీన్లు చదవాలి. ఎక్కువ మోడల్ పేపర్ల సాధన ద్వారా స్పీడ్‌ను పెంచుకోవచ్చు. హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ వంటివి ఆప్షనల్స్‌గా తీసుకోవటం మేలని నిపుణులు సూచిస్తున్నారు. వెబ్సైట్: www.upsc.gov.in -
పరిశోధనలకు అనువైన... జియాలజీ
పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్న వారికి అనువైన కోర్సు.. జియాలజీ. భూమి, దానిలోని పదార్థాలు, వాటి చరిత్ర, శిలలు, కొండలు, పర్వతాలు, భూకంపాలు, ఖనిజాలు, ఇంధనవనరులు, అగ్ని పర్వతాలు, హిమానీ నదాలు, సముద్రాలు-వాటి వాతావరణం, తదితరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే జియాలజీ. జియాలజీ కోర్సులో కొన్ని ప్రాథమిక విభాగాలు ఉంటాయి. అవి.. పెట్రోలియం జియాలజీ, మెరైన్ జియాలజీ, హైడ్రో జియాలజీ, రిమోట్ సెన్సింగ్, ఓషియనోగ్రఫీ, మినరాలజీ, స్ట్రక్చరల్ జియాలజీ, ఎన్విరాన్మెంటల్ జియాలజీ, వోల్కానాలజీ, జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ఇంజనీరింగ్ జియాలజీ. జియాలజీ కోర్సును పూర్తి చేసిన వారిని జియాలజిస్ట్లుగా వ్యవహరిస్తారు. ఎంచుకున్న రంగాన్ని బట్టి వివిధ రకాల జియాలజిస్ట్‌లు ఉంటారు. వివరాలు.. మెరైన్ జియాలజిస్ట్, పెట్రోలజిస్ట్, మినరాలజిస్ట్, జియోహైడ్రాలజిస్ట్, హైడ్రాలజిస్ట్, సర్వేయర్, సెసిమోలజిస్ట్, పేలెంటాలజిస్ట్. ప్రవేశం ఇలా: జియాలజీకి సంబంధించిన కోర్సులను పూర్తి చేయడం ద్వారా జియాలజిస్ట్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచి మాత్రమే జియాలజీ కోర్సు అందుబాటులో ఉంది. దీని తర్వాత పీజీ స్థాయిలో ఎంఎస్సీ, ఎంఎస్సీ-టెక్ కోర్సులు ఉన్నాయి. ఆసక్తి ఉంటే పీహెచ్డీ కూడా చేయవచ్చు. మన రాష్ట్రంలో మ్యాథమెటిక్స్/బయాలజీ, ఫిజిక్స్/కెమిస్ట్రీల కాంబినేషన్స్‌తో బ్యాచిలర్ స్థాయి (బీఎస్సీ)లో జియాలజీ ఒక సబ్జెక్టుగా అందుబాటులో ఉంది. బ్యాచిలర్ తర్వాత జియాలజీ, జియో ఫిజిక్స్, మెరైన్ కెమిస్ట్రీ తదితర స్పెషలైజేషన్స్‌తో ఎంఎస్సీ కోర్సు కూడా చేయవచ్చు. మన రాష్ట్రంలోని అన్ని ప్రముఖ యూనివర్సిటీలు ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. అవకాశాలు: ప్రస్తుతం చాలా దేశాలు శక్తి వనరుల విషయంలో స్వయం సమృద్ధి సాధించాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఖనిజాలు, చమురు అన్వేషణకు పెద్ద పీట వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జియాలజిస్ట్లది కీలకపాత్ర. అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణ, భూకంపాలు- సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలను విశ్లేషించడంలోనూ జియాలజిస్ట్ల అవసరం ఎంతో. ఈ క్రమంలో రిసోర్సెస్ మేనేజ్‌మెంట్‌గా దిశగా సాగుతున్న ప్రస్తుత ప్రపంచంలో జియాలజిస్ట్‌లకు అవకాశాల పరంగా ఎటువంటి ఢోకా లేదని చెప్పొచ్చు. మౌలిక రంగంలో విస్తృతమవుతున్న నిర్మాణాలు కూడా జియాలజిస్ట్‌లకు మరింత డిమాండ్‌ను పెంచాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండూ జియాలజిస్ట్‌లకు సమానంగా అవకాశాలు కల్పిస్తుండడం విశేషం. జియాలజిస్ట్ ఎగ్జామ్: జియాలజిస్ట్‌లకు చక్కని అవకాశం.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించే జియాలజిస్ట్ ఎగ్జామ్. యూపీఎస్సీ ప్రతి ఏడాది ఈ పరీక్ష నిర్వహిస్తోం ది. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి జియాలజీ/ అప్లయిడ్ జియాలజీ/మెరైన్ జియాలజీలో మాస్టర్ డిగ్రీ. సంబంధిత నోటిఫికేషన్ ప్రతి ఏడాది ఆగస్టులో వెలువడుతుంది. విదేశాల్లో: జియాలజిస్ట్‌లకు విదేశాల్లో కూడా చక్కని అవకాశాలు ఉంటాయి. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జియాలజిస్ట్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఇండోనేషియా, మలేషియా, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, వియత్నాం, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌లు జాబ్ అవెన్యూస్‌గా నిలుస్తున్నాయి. ఆయా దేశాల్లో మౌలిక వసతుల రంగంలో విస్తృతమవుతున్న కార్యకలాపాలను (హైవేలు, ఎయిర్పోర్ట్, డ్యామ్‌లు, పైప్‌లైన్స్ నిర్మాణం) ఇందుకు కారణంగా పేర్కొనవచ్చు. బంగారం, ఆయిల్ గనులు విస్తారంగా ఉన్న మిడిల్ ఈస్ట్ దేశాల్లో కూడా జియాలజిస్ట్‌లకు మంచి అవకాశాలు ఉంటున్నాయి. వేతనాలు: వేతనాల విషయానికొస్తే.. ఆకర్షణీయమైన పే-ప్యాకేజ్‌లు జియాలజిస్ట్‌లకు లభిస్తున్నాయి. కెరీర్ ప్రారంభంలో (ఎంఎస్సీ డిగ్రీ) ఫ్రెషర్‌కు ప్రభుత్వ/ప్రైవేట్ రంగంలో నెలకు రూ. 25 వేల నుంచి రూ. 40 వేల వరకు వేతనం అందుతుంది. టాప్ రిక్రూటర్స్: జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నేషనల్ జియోఫిజికల్ ఇన్స్టిట్యూట్ వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ టాప్ ఇన్స్టిట్యూట్స్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే వెబ్సైట్: www.iitb.ac.in ఇండియన్ స్కూల్స్ ఆఫ్ మైన్స్-ధన్‌బాద్ వెబ్సైట్: www.ismdhanbad.ac.in ఢిల్లీ యూనివర్సిటీ వెబ్సైట్: www.du.ac.in బెనారస్ హిందూ యూనివర్సిటీ-వారణాసి వెబ్సైట్: www.bhu.ac.in యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వెబ్సైట్: www.unom.ac.in ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం వెబ్సైట్: www.andhrauniversity.edu.in