జియాలజీ కోర్సు- ఇన్‌స్టిట్యూట్లు | Geology course | Sakshi
Sakshi News home page

జియాలజీ కోర్సు- ఇన్‌స్టిట్యూట్లు

Published Thu, Nov 5 2015 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

Geology course

 జియాలజీ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు, ఉద్యోగావకాశాలను వివరించండి?
 - నరేశ్, తిరుపతి
 విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. జియాలజీలో ఎంఎస్సీ, మూడేళ్ల వ్యవధి గల అప్లైడ్ జియాలజీలో ఎంఎస్సీ(టెక్)లను అందిస్తోంది.
 అర్హత: సంబంధిత సబ్జెక్టుతో డిగ్రీ.
 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 రుపతిలోని శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం.. జియాలజీలో ఎంఎస్సీను అందిస్తోంది.
 అర్హత: జియాలజీ సబ్జెక్టుతో బీఎస్సీ.
 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.svuniversity.ac.in
 హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. అప్లైడ్ జియాలజీలో ఎంఎస్సీను అందిస్తోంది.
 అర్హత: కనీసం 40 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో డిగ్రీ.
 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.osmania.ac.in
 వీటితోపాటు ఢిల్లీ విశ్వవిద్యాలయం (www.du.ac. in), పుణె విశ్వవిద్యాలయం (ఠీఠీఠీ.ఠజీఞఠ్ఛ.్చఛి. జీ) వంటివి కూడా ఈ కోర్సును అందిస్తున్నాయి.ఉద్యోగావకాశాలు: యూపీఎస్సీ నిర్వహించే జియాలజిస్ట్, సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులవటం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు పొందవచ్చు. మినరల్ ఎక్స్‌ప్లొరేషన్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ ఎక్స్‌ట్రాక్షన్ వంటి రంగాల్లో ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు సాధించవచ్చు.
 
 నానోఎలక్ట్రానిక్స్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?    - వెంకట్, గుంటూరు
 హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం.. నానో ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్‌ను అందిస్తోంది.అర్హత: కెమికల్/మెకానికల్/ ఏరోనాటికల్/ఎలక్ట్రికల్/కంప్యూటర్ ఇంజనీరింగ్/ బయోటెక్నాలజీ/ మెటీరియల్ సైన్స్‌లలో బీఈ/బీటెక్ లేదా కెమిస్ట్రీ/ఫిజిక్స్/ బయోటెక్నాలజీ/ ఎర్త్ సెన్సైస్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌లలో ఎంఎస్సీ లేదా తత్సమానం.
 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.jntuh.ac.in
 అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం.. మైక్రో అండ్ నానో ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
 అర్హత: సంబంధిత సబ్జెక్టులో బీటెక్.
 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.jntua.ac.in
 తంజావూరులోని శాస్త్ర విశ్వవిద్యాలయం.. నానో ఎలక్ట్రానిక్స్‌లో ఎంటెక్ కోర్సును అందిస్తోంది.
 అర్హత: ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్.
 ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
 వెబ్‌సైట్: www.sastra.edu
 
 సివిల్ సర్వీసెస్ పరీక్ష గురించి పూర్తి వివరాలు తెలపండి?
 - సత్యవతి, బొబ్బిలి
 భారతీయ సర్వీసుల్లోకెల్లా అత్యున్నత సర్వీసుగా సివిల్ సర్వీసెస్ పరీక్షను పేర్కొనవచ్చు. ఈ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తుంది. ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్,సెంట్రల్ సెక్రటేరియెట్ సర్వీస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్), గ్రూప్-ఏ వంటి పోస్టుల్లో నియామకాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తుంది. అర్హత: ఏదైనా డిగ్రీ. అభ్యర్థి వయసు 21-30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
 
 పరీక్ష విధానం:
 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష: ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. జనరల్ స్టడీస్, సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సీ-శాట్).ఈ రెండు పరీక్షలు ఒకే రోజు జరుగుతాయి. ఒక్కో పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష ఉంటుంది. జాతీయ, అంతర్జాతీయ వర్తమాన వ్యవహారాలు, భారతదేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకనమిక్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్, జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్‌మెంటల్ ఎకాలజీ, జనరల్ సైన్స్ వంటి అంశాలపై జనరల్ స్టడీస్ పేపర్‌లో ప్రశ్నలు అడుగుతారు. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ స్కిల్స్ వంటి వాటిపై సీ-శాట్ పేపర్‌లో ప్రశ్నలు అడుగుతారు.
 
 మెయిన్ పరీక్ష: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను మెయిన్ పరీక్షకు పిలుస్తారు. ఇందులో 9 పేపర్లు ఉంటాయి. డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. అభ్యర్థి పూర్తిస్థాయి నైపుణ్యాలను పరీక్షించే విధంగా ఇందులో పరీక్షలు ఉంటాయి. వీటిని ఇంగ్లిష్ లేదా ఎనిమిదో షెడ్యూల్‌లో ఉన్న ఏదైనా ఒక భాషలో రాయవచ్చు. ఇందులో తెలుగు కూడా ఉంది. ఇంటర్వ్యూ: - సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థి వ్యక్తిగత సామర్థ్యం, నాలెడ్జ్, విలువలను పరీక్షించే రీతిలో ప్రశ్నలు ఉంటాయి.
 
 సివిల్ సర్వీసెస్.. భారతదేశంలో జరిగే పరీక్షలన్నిటిలో కష్టమైంది. సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నిరంతర శ్రమ, కఠోర దీక్ష, పట్టుదల అవసరం. ప్రపంచ వ్యాప్తంగా జరిగే అంశాలన్నిటిపైనా నిరంతరం అప్‌డేట్ అవుతూ పట్టు సాధించాలి. నాలెడ్జ్, ఆప్టిట్యూడ్ పెంచుకోవటం కోసం మేగజీన్లు చదవాలి. ఎక్కువ మోడల్ పేపర్ల సాధన ద్వారా స్పీడ్‌ను పెంచుకోవచ్చు. హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ వంటివి ఆప్షనల్స్‌గా తీసుకోవటం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
 వెబ్‌సైట్: www.upsc.gov.in
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement