German Chancellor Angela Merkel
-
ఒక్క ఫోటో.. ఇంటర్నెట్ షేక్
లా మాల్బె: రెండు రోజులపాటు జరిగిన సదస్సులో ఊహించని రీతిలో చర్చ.. చివర్లో ప్రతిష్ఠంభన... మిగతా దేశాలు ఏకం కావటంతో ఒంటరిగా మారిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వెరసి జీ-7 దేశాల సదస్సు గందరగోళ పరిణామాలతో సాగింది. సదస్సు ముగిశాక ట్రంప్ చేసిన ట్వీట్లు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉంటే జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. జీ-7 సదస్సులో రెండో రోజు. రెండు వర్కింగ్ సెషన్ల మధ్యలో అనుకోకుండా జరిగిన భేటీ అంటూ ఆమె ఓ సందేశాన్ని ఉంచుతూ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. చేతులు కట్టుకుని ఉన్న ట్రంప్.. చుట్టూ చేరి మిగతా దేశాల ప్రతినిధులు ఉండటం, బల్ల మీద చేతులేసి మెర్కెల్ సీరియస్‌గా ట్రంప్‌ను తదేకంగా చూస్తుండటం... వెరసి సోషల్ మీడియాలో ఫోటో నవ్వులు పూయిస్తోంది. జీ-7లో ట్రంప్ టైమ్ బాగోలేదని చాలా మంది కామెంట్లు చేస్తుండగా, మెర్కెల్ ముందు పిల్లిలా మారిపోయారంటూ మరికొందరు, ఇంకొందరైతే తమ శైలిలో ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ కాప్షన్లతో వైరల్ చేస్తున్నారు. అమెరికాకు హెచ్చరిక... క్యూబెక్‌లోని లా మాల్బెలో జరిగిన సదస్సుల్లో వాణిజ్య సంబంధాల పునఃపరిశీలనకు సంబంధించి ఉమ్మడి ప్రకటన వెలువరించాలని ట్రంప్ చేసిన సూచనను మిగిలిన దేశాలు పట్టించుకోకపోగా, హెచ్చరికలు జారీ చేశాయి. ముఖ్యంగా రష్యాను జీ–7 కూటమిలోకి తిరిగి చేర్చుకోవాలని ట్రంప్ చేసిన ప్రతిపాదనను యూరప్ కూటమి సభ్యులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. వాణిజ్యం, పర్యావరణం, ఇరాన్ ఒప్పందం తదితరాలపై ట్రంప్ వైఖరిని తప్పుపట్టిన యూరోప్ దేశాలు..తామూ అమెరికాపై ప్రతిచర్యలకు దిగుతామని హెచ్చరించాయి. ఇక ఆతిథ్య దేశం కెనడా ప్రధాని ట్రూడో నేతృత్వంలోని సభ్య దేశాలు ట్రంప్ నిర్ణయాన్ని అక్రమమని పేర్కొన్నాయి. భద్రతా కారణాలతో ఇతర దేశాల వస్తువులపై సుంకాలు పెంచామన్న ట్రంప్ వాదనను కెనడా తోసిపుచ్చింది. తమ ఎగుమతులతో అమెరికాకు ముప్పు ఉందని పేర్కొనడం సమర్థనీయం కాదని కెనడా వాదించింది. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ ఇమాన్యుయేల్ స్పందిస్తూ..చర్చలు నిర్మొహమాటంగా, ముక్కుసూటిగా జరిగాయన్నారు. వాణిజ్యం క్లిష్ట వ్యవహారంగా మారిన మాట వాస్తవమే అయినా, అన్ని దేశాలు అభివృద్ధిచెందేందుకు మార్గాలున్నాయని ఆయన చెబుతున్నారు. Angela merkel and other leaders at G7. #SaturdayMorning pic.twitter.com/EAV0xcqvkW — Just Joe (@dannon787) 9 June 2018 Angela Merkel's office has released this photo taken today at the G7, which shows me not caring. @g7 @JustinTrudeau was hiding I guess. pic.twitter.com/A4N15vbe7T — President Trump (@POTUS_Don45) 10 June 2018 Trump left the #G7 early but by posting this photo, Angela Merkel got the last word. pic.twitter.com/1ny6mj5Wci — Jean Dunn 🐈 (@jeandunn52) 9 June 2018 -
అంతమందిని ఆహ్వానించి ఆమె తప్పుచేశారు..!
వాషింగ్టన్: ఇంకో నాలుగు రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో ప్రపంచ నేతలపై వాగ్బాణాలు సంధించారు. కొత్త ప్రభుత్వ విధానాల రూపకల్పనలో బిజీబిజీగా గడుపుతున్న ఆయన ఆదివారం ప్రఖ్యాత టైమ్స్ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇరాక్ యుద్ధం, ఇరాన్‌పై ఆంక్షల సడలింపు, చైనాతో వాణిజ్యం, సిరియా శరణార్థులు, జర్మనీ విధానాలు, బ్రెగ్జిట్ తదితర అంశాలపై వాగ్బాణాలు సంధించారు. లక్షమందికిపైగా సిరియా, లిబియా శరణార్థులను జర్మనీలోకి ఆహ్వానించడం చాన్సలర్ ఏంజిలా మోర్కెల్ చేసిన ఘోర తప్పిదమని ట్రంప్ అన్నారు. దానికి బదులుగా సిరియాలోనే సేఫ్జోన్లు ఏర్పాటు చేసి, ప్రజలు అక్కడే ఉండేలా చేయాలని ఇందుకు అవసరమైయ్యే ఖర్చునంతా అమెరికాకు మిత్రులైన గల్ఫ్ దేశాలు భరించాలని పేర్కొన్నారు. యురోపియన్ యూనియన్(ఈయూ) అనే వాహనాన్ని నడిపించేదే జర్మనీయే అని, ఈ విషయం ఈయూలోని అన్ని దేశాలకు బాగా తెలుసని ట్రంప్ వ్యాఖ్యానించారు. శరణార్థులను చేర్చుకోవాలన్న జర్మనీ నిర్ణయం వల్లే బ్రిటన్ ఈయూ నుంచి వైదొలిగిందని, ఈ విషయంలో బ్రిటన్ చాలా తెలివిగా వ్యవహరించిదని ట్రంప్ అన్నారు. చైనాతో వాణిజ్యంలో ఎంత లోటు(deficit) ఉందో అమెరికా ప్రకటించాల్సిన అవసరం ఉందని, కొత్తగా ఏర్పడబోయే ్పరభుత్వం ఆ పని తప్పక చేస్తుందని చెప్పారు. ట్రంప్ ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. ఒబామా కేర్ పథకాన్ని పూర్తిగా రద్దుచేస్తాం. ఇందుకోసం ఏమేం చెయ్యాలనేదానిపై చర్చలు పూర్తికావచ్చాయి. అతి త్వరలోనే మరో ఆరోగ్య పథకాన్ని తీసుకొస్తాం. తక్కువ ఖర్చుతో అందరికీ వైద్యం అందిస్తాం. రష్యాపై ఆంక్షలు ఎత్తేయడంలో అణ్వస్త్రాల నిర్వీర్యం కీలక అంశం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. బ్రెగ్జిట్.. బ్రిటన్ తీసుకున్న తెలివైన నిర్ణయం. చైనా సహా ఇతర దేశాలతో అమెరికా కొనసాగిస్తోన్న వాణిజ్యంలో లోటు(deficit)ను వెల్లడిస్తాం. ఇప్పటివరకు ప్రపంచ దేశాలన్నీ 'నాటో'ను నిర్లక్ష్యం చేశాయి. నాకు మాత్రం దానితో చాలా పనుంది. ఇరాన్‌తో అణుఒప్పందమంత చెత్త నిర్ణయాన్ని నేనెప్పుడూ వినలేదు. ఇరాక్‌పై యుద్ధం తేనేతెట్టును కదిలించినట్లైంది. ప్రెసిడెంట్ అయ్యాక కూడా ట్విట్టర్లో కొనసాగుతా. ఎవరైనా నిజాయితీ లేకుండా వార్తలు రాస్తే ట్విట్టర్లోనే ఖండిస్తా. -
బ్రిటన్‌కు వెన్న పూస్తూనే వాతలు
బెర్లిన్: వెన్నపూస్తూ వాతలు పెట్టిన చందంగా.. బ్రెగ్జిట్ బాధాకరం అంటూనే పాత ఒప్పందాల విషయంలో బ్రిటన్‌కు హెచ్చరికలు జారీచేశారు జర్మన్ చాన్సలర్ ఏంజిలా మోర్కెల్. ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమణ ఖరారయిన తర్వాత తొలిసారిగా స్పందించిన ఆమె.. బ్రెగ్జిట్ ఫలితం ఈయూనే కాక యావత్ యూరప్ ఐక్యతను విచ్ఛిన్నం చేసిందని అన్నారు. (చదవండి: బ్రిటన్ లో అల్లకల్లోలం ఖాయం) శుక్రవారం మధ్యాహ్నం(స్థానిక కాలమానం ప్రకారం) మీడియాతో మాట్లాడిన మోర్కెల్ బ్రెగ్జిట్ అనంతర పరిణామాలపై మాట్లాడుతూ నిన్నటివరకు ఈయూతో చేసుకున్న అన్ని ఒప్పందాలను సంపూర్ణంగా నిలబెట్టుకోవాలని హెచ్చరించారు. 'విడిపోయే ప్రక్రియ పూర్తయ్యే చివరి నిమిషం దాకా బ్రిటన్ తన వాగ్ధానాలు నిరవేర్చాల్సిన అవసరం ఉంది' అని మోర్కెల్ స్పష్టం చేశారు. అదే సమయంలో ఈయూ నేతలు, సభ్యదేశాధినేతలు బ్రిటన్ కు సహకరించాలని ఆమె కోరారు. ప్రస్తుతం మనమున్నది గందరగోళ ప్రపంచమని, శాంతిసమాధానాలతో నిర్ణయాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇంకా.. 'ఈయూ నుంచి వైదొలగాలనే బ్రిటిషర్ల నిర్ణయం బాధాకరం. అది ఐరోపా సమాజ ఐక్యతను విచ్ఛినం చేసింది. యూరప్ దేశాలు వేటికవే భిన్నత్వాన్ని కలిగిఉన్నాయో, ఈయూ అంతకంటే భిన్నమైనది. రెండో ప్రపంచ యుద్ధానంతరం తోడ్పాటును అందించుకునేందుకే ఈయూ ఏర్పాటయిందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అయితే ప్రస్తుతం కూటమిలోని సభ్యదేశాలే ఈయూపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వీటిని పటాపంచలు చేయాల్సిన సమయం వచ్చింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఈయూ మనుగడ సాధించగలదన్న నమ్మకాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఏర్పడింది. ఈ మేరకు అందరితో చర్చించాలనుకుంటున్నా. ఆ క్రమంలోనే సోమవారం యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు డోనాల్డ్ టస్క్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే, ఇటలీ ప్రధాని మాటియో రెంజీలతో భేటీ అవుతున్నా' అని ఏంజిలా పేర్కొన్నారు. -
మరో రూ.7,500 కోట్లు: జర్మనీ
బెర్లిన్/ఎథెన్స్: సిరియా తదితర దేశాల నుంచి వెల్లువలా వస్తున్న శరణార్థులకు తమ దేశంలో ఆశ్రయం, వసతులు కల్పించటం కోసం వచ్చే ఏడాది అదనంగా మరో 600 కోట్ల యూరోలు (రూ. 7,500 కోట్లు) కేటాయిస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. గత ఏడాది రెండు లక్షల మంది శరణార్థుల నుంచి దరఖాస్తులు అందగా.. ఈ ఏడాది 8 లక్షల దరఖాస్తులు వస్తాయని జర్మనీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సిరియాలో, ఇతర ప్రాంతాల్లో యుద్ధాల వల్ల ఆయా దేశాల నుంచి వలస వస్తున్న శరణార్థులకు జర్మన్లు రైల్వేస్టేషన్లలో కానుకలతో స్వాగతం పలకడం మనసు కదిలించే అంశమని అభివర్ణించారు. లక్షల సంఖ్యలో వస్తున్న శరణార్థుల సవాలును తమ పటిష్ట ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కోగలదని అన్నారు. తాజా పరిణామాలు జర్మనీని మార్చివేయనున్నాయని, అది సానుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. తాజా శరణార్థుల కోటా రూపకల్పన... శరణార్థుల విషయంలో ఫ్రాన్స్ మరింత భాగం తీసుకుంటుందని ఆ దేశాధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో 24 వేల మందికి ఆశ్రయం కల్పిస్తామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో తమ దేశంలో 750 మంది సిరియా శరణార్థులకు ఆశ్రయం కల్పిస్తామని న్యూజిలాండ్ ప్రకటించింది. ఫ్రాన్స్, జర్మనీల ఒత్తిడి నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ వివిధ దేశాలకు తాజా కోటాలను సిద్ధం చేస్తోంది. బుధవారం ప్రకటించనున్న ఈ కోటా ప్రకారం.. 1,20,000 మంది శరణార్థుల్లో సగం మందిని వివిధ ఈయూ దేశాలకు తరలించనున్నారు. యూరప్ తీరంలోని గ్రీస్, ఇటలీ, హంగరీలపై శరణార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు జర్మనీ 31,443 మందిని, ఫ్రాన్స్ 24,031 మందిని, స్పెయిన్ 14,931 మందిని తీసుకోనున్నాయని ఈయూ వర్గాలు తెలిపాయి. హంగరీకి చేరుకున్న వేలాది మంది శరణార్థుల కోసం.. ఆస్ట్రియా, జర్మనీలు తమ సరిహద్దులను తెరచివుంచటంతో పాటు ప్రయాణ ఆంక్షలను సడలించటంతో శుక్రవారం నుంచి ఈ రెండు దేశాలకు వలసల సంఖ్య పెరిగింది. గత రెండు రోజుల్లో 20 వేల మంది జర్మనీకి చేరుకోగా సోమవారం మరో పది వేల మంది వస్తారని అంచనా. బాల్కన్ ప్రాంతాల నుంచి భూమార్గంలో తమ దేశానికి చేరుకున్న శరణార్థులను హంగరీ శుక్రవారం నాడు బస్‌ల ద్వారా ఆస్ట్రియా సరిహద్దుకు చేర్చటంతో ఈ 20,000 మంది శరణార్థులు అక్కడి నుంచి జర్మనీ వచ్చారు. శరణార్థులను రక్షించిన ప్రయాణికులు మరోవైపు.. టర్కీ, బాల్కన్ ప్రాంతాల నుంచి భూమార్గంలోనూ, మధ్యధరాసముద్ర మార్గంలో కిక్కిరిసిన బోట్లలోనూ యూరప్ తీర దేశాలకు శరణార్థులు చేరుకుంటూనే ఉన్నారు. గ్రీస్ తీరంలో లెస్బోస్ దీవి వద్ద సముద్రంలో ప్రమాదంలో చిక్కుకున్న 61 మంది శరణార్థులను గ్రీస్‌కు చెందిన ఒక ప్రయాణ బోటు రక్షించింది.