ghanta muraliramakrishna
-
వైఎస్సార్ సీపీలో చేరిన ఘంటా మురళి
ఏలూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర చిన్ననీటి పారుదల సంస్థ చైర్మన్, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు ఘంటా మురళీరామకృష్ణ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన అనుచరులతో కలసి హైదరాబాద్ వెళ్లిన ఆయన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్‌కుమార్ ఆయనను వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్దకు తీసుకువెళ్లారు.మురళితోపాటు చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తూతా లక్ష్మణరావు, కామవరపుకోట సొసైటీ అధ్యక్షుడు ఘంటా సత్యంబాబు, రావికంపాడు సర్పంచ్ ఏసుబాబు, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు వైసీపీలో చేరారు. జగన్ సమర్థతను చూసే పార్టీలో చేరా కామవరపుకోట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థతను చూసే తాను పార్టీలో చేరానని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ చెప్పారు. హైదరాబాద్ నుంచి ఫోన్లో ఇక్కడి విలేకరులతో ఆయన మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు కాంగ్రెస్ పాలకుల తీరు వల్ల నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాల న్నా.. రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా.. ప్రజ లకు మేలుచేసే మరిన్ని కొత్త పథకాలు రావాలన్నా జగన్మోహన్రె డ్డి నాయకత్వంలోనే సాధ్యమన్నారు. మురళితో కలసి వైసీపీలో చేరిన వారిలో, గొర్రె లు, మేకల పెంపకందారుల అభివృద్ధి సంఘం జిల్లా అధ్యక్షుడు కొలుసు రాంబాబు, తడికలపూడి సొసైటీ మాజీ డెరైక్టర్ పసుమర్తి శ్రీమన్నారాయణ, తడికలపూడికి చెందిన గుణకల దుర్గారావు, ముళ్లపూడి నాగరాజు, ఏకాంత సత్యనారాయణ, ప్రొద్దుటూరి ఆనందరావు, నల్లూరి శివరామకృష్ణ, సాగిపాడుకు చెందిన తమ్మినేని శ్రీనివాసరావు, రావికంపాడుకు చెంది న కనుమూరి అంజిరెడ్డి, ఏఎంసీ డెరైక్టర్ కె.ప్రసాదరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు షేక్ మీరాసాహెబ్, గుంటుపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బేతిన వెంకట్రావు తదితరులు ఉన్నా రు. వారివెంట కామవరపుకోట మం డల వైసీపీ కన్వీనర్ మిడతా రమేష్ ఉన్నారు. -
రాష్ట్ర విభజన జరిగే పనికాదు
చింతలపూడి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన జరిగే పని కాదని కేంద్ర జౌళి శాఖామాత్యులు కావూరి సాంబశివరావు అన్నారు. చింతలపూడి మార్కెట్ కమిటీలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని తాను నమ్ముతున్నట్టు చెప్పారు. 371 డీ కి రాజ్యాంగ సవరణ చేయకుండా విభజన సాధ్యం కాదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో అందుకు అంత సమయం లేదన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదని, ఇప్పటికైనా యూపీఏ ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. బీజేపీతో సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు విభజనకు మద్దతు తెలపడం వల్లనే కేంద్రం తొందరపడి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఒక్క ప్రాంతానికి కాక రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు. 1959 వరకు భద్రాచలం డివిజన్ సీమాంధ్రలో కలిసే ఉండేదన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఖమ్మంలో భద్రాచలం డివిజన్‌ను కలిపారన్నారు. భద్రాచలం ఎప్పటికీ సీమాంధ్రదే నన్నారు. తమిళనాడుకు చెన్నై రాజధానిగా ఉన్నా అనేక ప్రాంతాలు అభివృద్ధి చెందాయన్నారు. రాష్ట్రంలో మాత్రం అన్నిరకాలుగా హైదరాబాద్‌లో ఎక్కువ అభివృద్ధి జరిగిందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, ఒక వేళ విభజన తప్పని సరి అయితే హెచ్ఎండీఏ పరిధిని పదేళ్లపాటు కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, లేదా ఢిల్లీ తరహా రాష్ట్రంగా చేయాలని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రకు 20 ఏళ్లపాటు పరిశ్రమల స్థాపనకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర విభజన సరైన చర్య కాదని ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా అధిష్టానం తమ మాటను వినలేదని చెప్పారు. అంతకు ముందు చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రి, సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, యర్రగుంటపల్లిలో పీహెచ్‌సీలకు కావూరి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఐటీఐ కళాశాలకు, రక్షిత మంచినీటి పథకాలను ప్రారంభించారు. ఆయన వెంట ఏపీఐడీసీ చైర్మన్ ఘంటా మురళీరామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ తూత లక్ష్మణరావు, కేంద్ర ఉన్ని ఉత్పత్తుల బోర్డు డెరైక్టర్ ఎం.ధామస్, అధికారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, బోదల రమేష్ ఉన్నారు.