వైఎస్సార్ సీపీలో చేరిన ఘంటా మురళి | ghanta murali joined in ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీలో చేరిన ఘంటా మురళి

Published Sat, Apr 12 2014 3:00 AM | Last Updated on Tue, Aug 14 2018 5:41 PM

వైఎస్సార్ సీపీలో చేరిన ఘంటా మురళి - Sakshi

వైఎస్సార్ సీపీలో చేరిన ఘంటా మురళి

ఏలూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర చిన్ననీటి పారుదల సంస్థ చైర్మన్, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు ఘంటా మురళీరామకృష్ణ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన అనుచరులతో కలసి హైదరాబాద్ వెళ్లిన ఆయన పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్‌కుమార్ ఆయనను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు తీసుకువెళ్లారు.మురళితోపాటు చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తూతా లక్ష్మణరావు, కామవరపుకోట సొసైటీ అధ్యక్షుడు ఘంటా సత్యంబాబు, రావికంపాడు సర్పంచ్ ఏసుబాబు, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు వైసీపీలో చేరారు.

 జగన్ సమర్థతను చూసే పార్టీలో చేరా
కామవరపుకోట : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమర్థతను చూసే తాను పార్టీలో చేరానని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ చెప్పారు. హైదరాబాద్ నుంచి ఫోన్‌లో ఇక్కడి విలేకరులతో ఆయన మాట్లాడారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు కాంగ్రెస్ పాలకుల తీరు వల్ల నత్తనడకన సాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాల న్నా.. రాజశేఖరరెడ్డి ప్రజా సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా.. ప్రజ లకు మేలుచేసే మరిన్ని కొత్త పథకాలు రావాలన్నా జగన్‌మోహన్‌రె   డ్డి నాయకత్వంలోనే సాధ్యమన్నారు.

మురళితో కలసి వైసీపీలో చేరిన వారిలో, గొర్రె లు, మేకల పెంపకందారుల అభివృద్ధి సంఘం జిల్లా అధ్యక్షుడు కొలుసు రాంబాబు, తడికలపూడి సొసైటీ మాజీ డెరైక్టర్ పసుమర్తి శ్రీమన్నారాయణ, తడికలపూడికి చెందిన గుణకల దుర్గారావు, ముళ్లపూడి నాగరాజు, ఏకాంత సత్యనారాయణ, ప్రొద్దుటూరి ఆనందరావు, నల్లూరి శివరామకృష్ణ, సాగిపాడుకు చెందిన తమ్మినేని శ్రీనివాసరావు, రావికంపాడుకు చెంది న కనుమూరి అంజిరెడ్డి, ఏఎంసీ డెరైక్టర్ కె.ప్రసాదరెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు షేక్ మీరాసాహెబ్, గుంటుపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు బేతిన వెంకట్రావు తదితరులు ఉన్నా రు. వారివెంట కామవరపుకోట మం డల వైసీపీ కన్వీనర్ మిడతా రమేష్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement