GHMC election counting
-
నేరేడ్మెట్ డివిజన్లో టీఆర్ఎస్ విజయం
-
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై కంగనా ట్వీట్
ముంబై: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ఫలితాలపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ ఇప్పటి వరకు 40 స్థానాలు గెలిచింది. కాగా కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో కంగనా కాంగ్రెస్ పార్టీపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘ప్రియమైన కాంగ్రెస్.. మీ పార్టీ అధికారంలో పలు రాష్ట్రాల్లో కంగనా కంగనా అంటూ నా నామం జపం చేస్తూ గందరగోళం చేస్తుంటే.. బీజేపీ మాత్రం తన పాలనతో క్లిష్టమైన నగరాల్లో ప్రజల హృదయాలను గెలుచుకుంది. కొత్తగా పలు ప్రాంతాల్లో విజయం సాధిస్తోంది’ అంటూ కంగనా కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు. (చదవండి: వివాదాస్పద ట్వీట్.. కంగనకు నోటీసులు) కాగా ఉత్కంఠ రేకెత్తిస్తోన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అనుహ్య రీతిలో బీజేపీ ఓట్లను సాధించగా.. అధికార పార్టీ టీఆర్ఎస్ మెల్లిమెల్లిగా పుంజుకుంటూ ఆధిక్యంలోకి వచ్చింది. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్-53 స్థానాలు గెలుచుకోగా బీజేపీ 41 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఎంఐఎం 38 డివిజన్లలో విజయం సాధించింది. (చదవండి: కంగనా ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి... లేదంటే!) Dear @INCIndia while your government ruled states are in mess and doing Kangana Kangana whole day, can’t help but notice @BJP4India is ruling hearts of their toughest critics and entering new territories 🥰 https://t.co/GaSxUox5Zt — Kangana Ranaut (@KanganaTeam) December 4, 2020 -
రేపే గ్రేటర్ కౌంటింగ్
హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు శుక్రవారం ప్రారంభించాలా లేక శనివారమా అన్న సస్సెన్స్ కు అధికారులు తెర దించారు. శుక్రవారం రోజునే కౌంటింగ్ ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే ముందుగా అనుకున్నట్టు సాయంత్రం 4 గంటలకు కాకుండా 3 గంటలకే మొదలుపెట్టాలని నిర్ణయించారు. పాతబస్తీలోని పురానాపూల్ డివిజన్ లో శుక్రవారం రీ పోలింగ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో కౌంటింగ్ ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై ఉన్నత స్థాయి అధికారులు తర్జనభర్జన పడ్డారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తే పూర్తి ఫలితాలు వెల్లడి కావడానికి కనీసంగా అయిదు గంటల సమయం పడుతుందని అంచనా వేశారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తే రాత్రి 9 లేదా 10 గంటల వరకు కొనసాగే ఆస్కారం ఉంటుందని, రాత్రి వేళ ఫలితాలు వెల్లడించడం, తద్వారా శాంతి భద్రతల సమస్య ఏదైనా ఉత్పన్నమవుతుందేమోనన్న అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం చైర్మన్, జీహెచ్ ఎంసీ కమిషనర్, హైదరాబాద్ పోలిస్ కమిషనర్ తదితరులు సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశాలు ఉన్న పక్షంలో కౌంటింగ్ శనివారం ఉదయం నుంచి ప్రారంభించాలని తొలుత భావించారు. అయితే పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనడానికి అవసరమైన బలగాలు సిద్ధంగా ఉన్నాయని పోలీసు ఉన్నతాధికారులు చెప్పడంతో చివరకు కౌంటింగ్ శుక్రవారం చేపట్టాలని నిర్ణయించారు. అయితే మరీ ఆలస్యం కాకుండా ఉండేందుకు వీలుగా ఒక గంట ముందుగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ అంశంపై జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు.