girija sankar
-
భారీ వర్షాలు : ఉద్యోగులకు సెలవులు రద్దు
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలోని భారీ వర్షాలపై పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని జిల్లాల డీపీవోలు, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో దీనిపై సమీక్షించారు. ఈ క్రమంలో పంచాయతీ రాజ్ అధికారులు, ఉద్యోగులందరికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని జిల్లాల్లో మంచి నీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని గిరిజా శంకర్ ఆదేశించారు. వర్షాల కారణంగా పేరుకుపోయిన డ్రైన్‌ను శుభ్ర పరచాలని సూచించారు. అన్ని గ్రామాల్లోనూ క్లోరినషన్ చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. నిరంతరం వర్షాల పరిస్థితులు సమీక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా గిరిజా శంకర్ వెల్లడించారు. ఇక కాకినాడ సమీపాన వాయుగుండం తీరాన్ని తాకింది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర అంతటా వర్షాలు పడనున్నాయి. విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీర ప్రాంత ప్రజలు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీనిపై ఏపీ విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ, ఇది డీప్ డిప్రెషన్ మాత్రమేనని, తుఫానులా మారలేదని చెప్పారు. ఫలితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రస్తుతం కాకినాడ ప్రాంతంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని, రాగల మూడు నాలుగు గంటలు పశ్చిమ గోదావరి, కృష్ణ, గుంటూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొన్నారు. కృష్ణా, గుంటూరుల మీదుగా వర్షాలు తెలంగాణా వైపు వెళతాయన్నారు. ప్రస్తుతం గంటకు 45 నుంచి 50 కిలో మీటర్ల మేర గాలులు వీస్తున్నాయన్నారు. తీర ప్రాంతంలో 60 నుంచి 65 కిలో మీటర్ల వేగం ఉండొచ్చు అని తెలిపారు. అన్ని జిల్లాల్లో సహాయకచర్యలు అందించడానికి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మంగళగిరిలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సర్వం సిద్ధం చేసుకొని ఉన్నాయని తెలిపారు. రెండు రోజుల క్రితమే కాకినాడకు ఒక ప్లటూన్ ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పంపామని వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నానానికి ఏపీలో వర్షాలు తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు. చదవండి: భారీ వర్షాలు: తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం (function(w,d,s,u,n,i,f,g,e,c){w.WDMObject=n;w[n]=w[n]||function(){(w[n].q=w[n].q||[]).push(arguments);};w[n].l=1*new Date();w[n].i=i;w[n].f=f;w[n].g=g;e=d.createElement(s);e.async=1;e.src=u;c=d.getElementsByTagName(s)[0];c.parentNode.insertBefore(e,c);})(window,document,"script","//api.dmcdn.net/pxl/cpe/client.min.js","cpe","5f686da28ba2a6d8cbff0ede",{scroll_to_pause: true}); -
మహిళలకే పెద్ద‘పీఠం’
సాక్షి, అమరావతి : అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి రెండు రోజుల ముందే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు భారీ కానుకను అందజేసింది. రాష్ట్రంలో మొత్తం 13 జిల్లా పరిషత్‌లు ఉండగా, అందులో సగానికంటే పైగా అంటే.. ఏడు జెడ్పీ చైర్మన్ పదవులను మహిళలకు రిజర్వు చేసింది. దీంతో శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో మహిళలే జడ్పీ చైర్పర్సన్లుగా రాబోతున్నారు. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్ల వివరాలతో పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ జారీచేశారు. అలాగే, రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవుల రిజర్వేషన్లను కూడా శుక్రవారం ఉదయానికే ఆయా జిల్లాల కలెక్టర్లు ఖరారు చేశారు. ఈ జాబితాలను పంచాయతీరాజ్ శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. ఎంపీపీ, జెడ్పీటీసీల్లో మహిళలకే పెద్దపీట ఇదిలా ఉండగా, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల రిజర్వేషన్లలోనూ సగానికి పైగా పదవులు మహిళలకే రిజర్వు అయ్యాయి. 660 మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) పదవులు ఉండగా.. అందులో 334 పదవులు, 660 జెడ్పీటీసీ స్థానాల్లో 335 మహిళలకు రిజర్వు అయ్యాయి. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా 9,639 ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. వీటిలో 4,769 ఎంపీటీసీ స్థానాలు కూడా మహిళలకే రిజర్వు అయ్యాయి. కాగా, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల రిజర్వేషన్లలో జిల్లాను యూనిట్‌గా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల జనాభా ఆధారంగా ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. అలాగే, మండలాన్ని యూనిట్‌గా తీసుకుని ఎంపీటీసీ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేశారు. -
సాక్స్‌లో మొబైల్ ఫోన్ పెట్టుకొని సచివాలయం పరీక్షకు..
సాక్షి, అనంతపురం : కణేకల్లు మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోనుతో వచ్చి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన అభ్యర్ధిని డీబార్ చేయడంతో పాటు అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ కలెక్టర్ సత్యనారాయణను ఆదేశించారు. రాయదుర్గానికి చెందిన బి.నౌషాద్కు సచివాలయ ఉద్యోగ రాత పరీక్ష కేంద్రం కణేకల్లు మోడల్ స్కూల్ పడింది. సెప్టెంబరు ఒకటో తేదీన ఉదయం సాక్స్‌లో సెల్‌ఫోన్ దాచుకుని పరీక్ష కేంద్రంలోకి వచ్చాడు. అయితే సిబ్బంది తనిఖీల్లో సెల్‌ఫోన్‌ను గుర్తించలేకపోయారు. పరీక్ష ముగియడానికి అరగంట ముందు మొబైల్ బయటకు తీసి గూగూల్లో సెర్చ్ చేసి ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాశాడు. చివరకు ఇన్విజిలేటర్ గుర్తించాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్ పోలీస్ విచారణకు ఆదేశించడంతో నౌషాద్ తాను మొబైల్ తీసుకొచ్చినట్లు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో అభ్యర్థిని డీబార్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు కలెక్టర్ సత్యనారాయణ అభ్యర్థిని డీబార్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు నమోదుకు ఉత్తర్వులు జారీ చేశారు. సరైన పర్యవేక్షణ చేయనందుకు సంబంధిత ఇన్విజిలేటర్లు, హాల్ సూపరింటెండెంట్, చీఫ్ సూపరింటెండెంట్, సెక్యూరిటీ స్టాఫ్‌పైనా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. -
‘సమర’ సన్నాహాలు..
పురపాలక సంఘాల ఎన్నికలకు నగారా మోగడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. ‘కోడ్’ను అమలు పరిచే చర్యలకు ఉపక్రమించింది. పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఇక రాజకీయ పక్షాలూ సమర సన్నాహాల్లో తలమునకలవుతున్నాయి. ఎవరిని ఎక్కడ నిలపాలనే కసరత్తు ప్రారంభించాయి. మహబూబ్‌నగర్: పురపాలక సంస్థలకు నాలుగో సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేయడంతో జిల్లాలో పురపాలక సమరానికి అన్ని పక్షాలు సిద్ధమవుతున్నాయి. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలతో పాటు నాలుగు నగర పంచాయతీల పరిధిలోని 206 వార్డుల్లో ఈ నెల 30న పోలింగ్ నిర్వహిస్తారు. వార్డుల పునర్విభజనకు సంబంధించి కేసులు కోర్టు విచారణలో ఉండటంతో జడ్చర్ల, అచ్చంపేట, కొల్లాపూర్ నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడలేదు. మిగతా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఈ నెల పదో తేదీన ఓటరు జాబితా ప్రదర్శన, నామినేషన్ల స్వీకరణతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్ రెండో తేదీన ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా ఎన్నికల షెడ్యూలును రూపొందించారు. ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లు రాష్ట్ర స్థాయిలో ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపాలిటీల్లో వార్డుల వారీ రిజర్వేషన్లు గత ఏడాది జూన్‌లో ఖరారు చేశారు. నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అధికారులు వార్డులవారీగా రిజర్వేషన్ వివరాలు వెల్లడించారు. మున్సిపాలీటీలు, నగర పంచాయతీ చైర్మన్లు గతంలో మాదిరిగానే పరోక్ష పద్దతిలో మెజార్టీ కౌన్సిలర్ల మద్దతుతో ఎన్నికవుతారు. గ్రామ పంచాయతీ ఎన్నికల తరహాలో మున్సిపల్ ఎన్నికల్లోనూ మహిళలకు 50శాతం వార్డులు కేటాయించారు. 2005లో జరిగిన ఎన్నికల్లో 33శాతం మాత్రమే మహిళలకు రిజర్వు చేశారు. మున్సిపాలిటీల నాలుగో సాధారణ ఎన్నికల్లో జిల్లాలో 3.80లక్షలకు పైగా పట్టణ ప్రాంత ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ‘ కోడ్’ కూసింది.. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నుంచే ఎన్నికల కోడ్ (ఎన్నికల ప్రవర్తన నియమావళి) అమల్లోకి వచ్చింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిబంధనలు అమలయ్యేలా చూడాలని కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ గిరిజా శంకర్ ఎన్నికల్ కోడ్‌ను అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను అప్రమత్తం చేశారు. గోడలపై రాతలను తుడిపి వేయించడం, ఫ్లెక్సీలు, కటౌట్ల తొలగింపు, అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్ల వినియోగం, మతాలకు సంబంధించిన సమావేశాలు, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం వంటి అంశాలపై కలెక్టర్ పలు సూచనలు చేశారు. సర్వం సన్నద్దం - గిరిజా శంకర్, జిల్లా కలెక్టర్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వ సన్నద్దంగా ఉంది. వార్డుల వారీగా ఓటర్ల విభజన పూర్తయింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమించాం. 344 పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటింగ్ కోసం 420 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సిద్దం చేశాం. ఓటరు ఫోటో గుర్తింపు కార్డుల ముద్రణ, ప్రచురణ నిబంధనల మేరకు పూర్తి చేశాం.