The girl
-
మీ అమ్మాయి ప్రేమలో ఉందా?
అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఒక వయసు తర్వాత కన్నార్పకుండా కాపాడుకుంటాం. కళ్లు తెరచి ఉంచినా... గట్టిగా మూసుకున్నా రాలే కన్నీరుని ఆపలేం కదా. ఈ జెట్ ఏజ్‌లో మంచీచెడు తేడా తెలుసుకునే వయసు రాకముందే పిల్లలు పెద్దపెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు... ప్రేమ పిచ్చిలో చాలామంది గాయపడుతున్నారు. దీనిని పెంపకంలో తప్పు అనుకోవడం తప్పు. మీ ప్రేమ గొప్పదనం మీ జాగ్రత్తలోనే ఉంది. బిడ్డను అర్థం చేసుకునే టైం మీకు ఉంటే... అంతా గుడ్ టైమే! ఆ అబ్బాయి, అమ్మాయి అప్పుడే ప్రేమలో పడ్డారు. కానీ ఒకరికొకరు విషయం చెప్పుకోలేదు. కాలేజీలో కూడా చూపులే కలుపుకున్నారు. ఆ రోజు రాత్రి ఫోన్ చేసుకున్నారు. నువ్వు ముందు చెప్పు అంటే నువ్వు ముందు చెప్పు అని వంతులేసుకున్నారు. చివరికి ఆ అబ్బాయే మనసు విప్పాడు. ఇద్దరూ ఆ రోజు రాత్రంతా ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. సడెన్‌గా వాళ్ల నాన్న వచ్చాడు. వెంటనే ఆ అమ్మాయి భయంతో ఫోన్ పక్కన పడేసింది. ఇలాంటి సన్నివేశాలు మీ ఇంట్లో చూశారా..? మీ ఇంట్లో అమ్మాయి ఇలాగానీ చేసిందా? అమ్మాయి ఫోన్ కోసం అబ్బాయి వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో అబ్బాయి నాన్న క్యారమ్స్ ఆడదాని రమ్మంటాడు. అయిష్టంగానే వెళ్తాడు. ఇంతలో ఫోన్ వస్తుంది. ఒకసారి... రెండోసారి... తండ్రి ఫోన్ లిఫ్ట్ చేసేసరికి వెంటనే ఆగిపోతుంది. మూడోసారి కూడా అంతే...! అయినా నాలుగోసారి ఫోన్ రింగవగానే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడటానికి పక్కకు వెళిపోతాడా అబ్బాయి. ప్రేమికుల మధ్య ఆ ఫోన్ రింగ్ ఓ కోడ్. మీ ఇంట్లో ఎప్పుడైనా మీ అమ్మాయి విషయంలో ఇలాంటి రింగ్స్ వినబడ్డాయా...? మీ అమ్మాయి బయటెక్కడో కనపడిందంటూ హీరోయిన్ తండ్రికి, ఆయన మిత్రుడు చెబుతాడు. అమ్మాయిని అపురూపంగా పెంచిన తండ్రి విషయం తెలిసినా, తెలియనట్లే ‘ఎక్కడికెళ్లావమ్మా’ అని అడుగుతాడు. బాయ్‌ఫ్రెండ్‌తో కలసి బొంబాయికి విమానంలో వెళ్లి, క్యాండిల్ లైట్ డిన్నర్ చేసి తిరిగొచ్చిన అమ్మాయి మాత్రం ‘ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను నాన్నా’ అని అబద్ధం చెప్పేస్తుంది. మీరు ప్రేమగా పెంచిన అమ్మాయి ఇలాంటి అబద్ధాలు ఎప్పుడైనా ఆడిందా? అమ్మాయి ప్రేమలో పడితే..! ‘పడడం’ అనే మాట మన అమ్మాయి విషయంలో వాడబడడం.. వెరీ శాడ్. గొప్ప దుఃఖంలా ఉంటుంది. విషాదంలా కూడా! కోపాన్నీ, వైరాగ్యాన్నీ తెస్తుంది. అసలు ప్రేమన్న మాటకే మంటెత్తుతుంది. కానీ బిడ్డ. కన్నబిడ్డ. తెలియని వయసులో లేదు. తెలిసిన వయసులోనూ లేదు. తెలిసీ తెలియని వయసులో ఉంది. టీనేజ్ అన్నది మామూలుగానే మాట వినని వయసు. దానికి ప్రేమ కూడా కలిస్తే? మాట లెక్క చేయని వయసు. ఎలా డీల్ చేయాలి? డీల్ చేయడం కూడా ‘పడడం’లాంటి పెద్ద మాటే. కూతురేం కొరుకుడు పడని సమస్య కాదు. లౌక్యంగా డీల్ చెయ్యడానికి. ప్రేమగా హ్యాండిల్ చెయ్యాలి. తనని, తను ప్రేమను కూడా ఒడిసిపట్టుకోవాలి. జాగ్రత్తగా నడిపించాలి. దారి మరల్చాలి. కనిపించే పూలదారి ఆవలి ముళ్ల బాట గురించి చెప్పాలి. అమ్మానాన్నల మాటలు ముళ్లలా అనిపించవచ్చు. రేప్పొద్దున ముళ్లు గుచ్చుకోబోతుంటే ఆ అమ్మానాన్నల చేతులే చిన్నారి పాదాలకు రక్షణ అని అర్థమయ్యేలా తెలియజెయ్యగలగాలి. పెద్ద పని. కానీ మన చిన్నారి కోసం తప్పని పని. అవి ప్రేమ లక్షణాలే! కన్నబిడ్డను ఎలా అనుమానించడం? ‘‘నువ్వు గానీ ఎవర్నీ ప్రేమించడం లేదు కదా ’’అని ఎలా ప్రశ్నించడం? ప్రశ్నించనవసరం లేదు. పరీక్షించనవసరం లేదు. పరిశీలనా అవసరం లేదు. ఇవన్నీ చేస్తే అదేదో టెస్టులా ఉంటుంది. అలా వద్దు. చిన్న గమనింపు చాలు. నిజానికి గమనింపు కూడా అక్కర్లేదు. వాళ్లే వచ్చి కంట్లో పడతారు. పిల్లలు కదా. పసి హృదయాలు. పసి మనసులు. ఎలా కాపాడుకోవడం? ఈ ప్రశ్నకు సమాధానం సైకాలజిస్టుల దగ్గర ఉంది. ‘‘ప్రేమ వంటి సున్నితమైన విషయాలను తల్లిదండ్రులు తమ పిల్లలతో చర్చించడం అవసరం’’ అని ప్రముఖ సైకాలజిస్ట్ మేఘనా సింఘాల్ అంటున్నారు. ‘‘పిల్లలు ఏ విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలని మనం కోరుకుంటున్నామో, పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల వ్యక్తిగత విషయాలను తల్లిదండ్రులతో చెప్పుకునే ధైర్యం, చొరవ పిల్లలకు వస్తుంది’’ అని ఆమె అంటారు. ఇదే విషయాన్ని మరో సైకాలజిస్ట్ డాక్టర్ సి.వీరేందర్ ఇంకో కోణంలో చెబుతున్నారు. ‘‘తల్లిదండ్రులతో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఆడపిల్లలకు ఉండాలి. ప్రేమకు స్నేహానికి మధ్య అంతరంపై వారికి అవగాహన కల్పించాలి’’ అని ఆయన అంటున్నారు. మీ అమ్మాయి ప్రవర్తనలో గమనించవలసిన 10 మార్పులు 1 ఏకాంతం : నలుగురితో కలిసి ఆడిపాడుతుండే పిల్ల, అల్లరి చేస్తుండే పిల్ల అకస్మాత్తుగా ఆటలు, పాటలు ఆపి, ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడుతుంటే మనం ఆలోచించాలి. ప్రేమలో ఉన్నందు వల్లనే ఆమె ఆ ఏకాంతాన్ని కోరుకుంటుంటే కనుక అది ప్రమాదకరం. ఏకాంతం కాస్తా కొన్నాళ్లకి ఒంటరితనం అవుతుంది. 2 తనలో తను నవ్వుకోవడం : దీనికి కూడా ప్రేమే కారణం అనుకోనవసరం లేదు. తనకేవో ఫ్రెండ్స్ జోక్స్ గుర్తుకురావచ్చు. ఆవే ళ జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్‌ని తను తలుచుకుని ఉండొచ్చు. అయితే ఈ నవ్వుకోవడం పరధ్యానంలోకి మారితే కనుక అమ్మాయిని బయట ఏదో శక్తి ఆకట్టుకుంటోందని, ఆకర్షిస్తోందనీ. 3 ముస్తాబుకు ఎక్కువ సమయం : మామూలు గానే ఆడపిల్లలు ముస్తాబుకు కాస్త టైమ్ తీసుకుంటారు. ఆ కాస్త మరికాస్తై అది ఇంకాస్తై మాత్రం ఎవరి దృష్టిలోనో తను ప్రత్యేకంగా కనిపించాలని తాపత్రయపడుతున్నట్లు. ప్రేమలో ఉన్న అమ్మాయి తనో రాజకుమారిలా ఫీల్ అవుతుంది. వీలున్నంత వరకు అలా తయారయ్యేందుకు ప్రయత్నిస్తుంది. 4 ఫోన్ వస్తే పక్కకు వెళ్లిపోవడం : అవతలి నుంచి ఫోన్ రాగానే అమ్మాయి కళ్లల్లో మెరుపు కనిపిస్తుంది. వెంటనే ఉన్నచోటు నుంచి లేచి వెళుతుంది. అమ్మానాన్నలు వినకూడని మాటలు టీనేజర్‌కి ఏం ఉంటాయి! డెఫినెట్‌గా అది స్పెషల్ కాల్ అయ్యుంటుంది. అందుకే అంత గోప్యత. 5 రోజంతా టెక్స్ట్ మెసేజింగ్ : వేళ్లు నిరంతరం మొబైల్ లోని ఏబీసీడీ మీటల్ని నొక్కుతూనే ఉంటాయి. అటు నుంచి, ఇటు నుంచి ఎస్సెమ్మెస్‌లు పాస్ అవుతూనే ఉంటాయి. ప్రేమలో ఉన్నవాళ్లు మాటల కంటే కూడా మెజేస్‌లను ఎక్కువ ఇష్టపడతారని ఎన్ని అధ్యయనాల్లో వెల్లడి కాలేదూ?! 6. అన్యమనస్కం : ఏం చెబుతున్నా విననట్లే ఉంటారు. ఏదో ఆలోచిస్తుంటారు. ‘ఏం చెప్పావ్’ అని అడుగుతుంటారు. చెప్పిందీ సగం సగం వింటారు. తాము చెప్పదలచుకున్నదాన్నీ స్పష్టంగా చెప్పరు. వేరే మూడ్‌లోకి వెళ్లిపోతారు. కుటుంబ సభ్యులంతా ఒక టాపిక్‌పై మాట్లాడుతుంటే వీరు అందులోకి వెళ్లరు. తమ లోకంలో తాము ఉన్నట్లుంటారు. 7. ఇల్లు కదలరు : కుటుంబ సభ్యులు ఫంక్షన్లకు, పరామర్శలకు వెళ్తుంటే వీళ్లు వెళ్లరు. రమ్మని అడిగినా, ‘నాకు ఒంట్లో బాగోలేదు మీరు వెళ్లండి’ అనో, ‘నేను చదువుకోవాలి’ అనో తప్పించుకుంటారు. ఇంట్లోనే ఉండిపోడానికి ట్రై చేస్తారు. అలాంటి ఏకాంతాన్ని ఇష్టపడతారు. 8 ఫ్రెండ్.. ఫ్రెండ్.. ఫ్రెండ్ : ఏం మాట్లాడినా ఫ్రెండ్ ఫ్రెండ్ అంటుంటారు. ఫ్రెండ్‌కి వస్తానని చెప్పాను, ఫ్రెండ్స్‌తో కలిసి వెళుతున్నాను, కంబైన్డ్ స్టడీ కోసం ఫ్రెండ్ నన్ను రమ్మంది, షాపింగ్‌కు తోడుగా వెళ్లాలట.. ఇలా చెబుతుంటారు. 9 పాకెట్ మనీ : ఇది రెండు రకాలుగా జరుగుతుంది. రోజూ పాకెట్ మనీ అడిగే అమ్మాయి క్రమంగా అడగడం తగ్గించేస్తుంటుంది. లేదా మనీ సరిపోవడం లేదు ఎక్కువగా ఇమ్మని అడుగుతుంటుంది. అంటే పాకెట్ మనీ కోసం పట్టు పట్టరు. లేదా పట్టుపట్టి మరీ ఎక్కువ అమౌంట్ డిమాండ్ చే స్తుంటారు. ఇదీ ప్రేమ మహత్యమే. 10 ఆరాలు, అబద్ధాలు : ఇంట్లో ఉన్న అమ్మను, ఆఫీసుకు వెళ్లొచ్చే నాన్నను, బయట తిరుగుతుంటే అన్నదమ్ముల్ని టైమ్ టు టైమ్ వారి వేర్ అబౌట్స్ గురించి ఆరా తీస్తుంటారు. దాని ప్రకారం తమ టైమ్‌ని ప్లాన్ చేసుకుంటారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... ఇంట్లో తమకు సంబంధించిన వస్తువుల దగ్గరికి, పుస్తకాల దగ్గరికి, బట్టల దగ్గరికీ ఎవర్నీ రానివ్వరు. వీటికి తోడు అబద్ధాలు. ప్రతి విషయాన్నీ దాచేస్తుంటారు. అది బయటపడుతుందేమోనని అబద్ధాలు ఆడుతుంటారు. -
చదువుకునే అవకాశం కల్పించండి!
వరదయ్యుపాళెం: తల్లిదండ్రులు ఆ బాలికకు బాల్య వివాహం చేశారు. మెట్టినింట్లో కాపురం చేయలేక కొద్ది రోజులకే పుట్టినింటికి చేరింది. పుట్టింటి వారు పట్టిం చుకోకపోవడంతో తనను హాస్టల్లో చేర్పించి చదువుకునే అవకాశం కల్పించాలని ఆ బాలిక బుధవారం మధ్యాహ్నం వరదయ్యుపాళెం ఎంపీడీవో హుమ్రత్‌ను ఆశ్రరుంచింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం, రాగవారిపాళెం గ్రావూనికి చెందిన ఈశ్వరయ్యు, వుునెవ్ముకు మూగ్గురు కువూర్తెలు. ఈశ్వరయ్యు అనారోగ్యంతో ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. భర్త మృతితో మునెవ్ము తన ముగ్గురు కువూర్తెలను సమీప బంధువులకిచ్చి పెళ్లి చేసింది. మూడో కుమార్తె అనుష్క ఎనిమిదో తరగతి చదువుతుండగా 8 నెలల క్రితం బలవంతంగా శ్రీకాళహస్తి సమీపంలోని రంగాయుగుంట గ్రావూనికి చెందిన వెంకటేశుకు ఇచ్చి పెండ్లి చేసింది. ఆమె 3 నెలలకే భర్తతో కాపురం చేయులేక తల్లి వద్దకు చేరింది. తల్లి పట్టించుకోకపోవడంతో అనుష్క శ్రీసిటి సెజ్‌లో ఓ ఫ్యాక్టరీలో దినసరి కూలి పనులు చేసుకుంటోంది. అత్తింటి వారు ఆమెను తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండడంతో బుధవారం మధ్యాహ్నం ఎంపీడీవోను ఆశ్రయించింది. తనకు బలవంతపు బాల్య వివాహం చేశారని, చదువుకోవాలని ఉందని, హాస్టల్లో చేర్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించాలని కోరింది. వివరాలు సేకరించి బాలికను ఐసీడీఎస్ సిబ్బందికి అప్పగించనున్నట్లు ఎంపీడీవో తెలిపారు. -
ప్రేమించకపోతే చంపేస్తానని బాలికకు బెదిరింపు
- యువకుడి అరెస్ట్ - నిర్భయ కేసు నమోదు ఘట్కేసర్: ప్రేమించకపోతే కత్తెరతో చంపుతానని బాలికను బెదిరించిన యువకుడిని పోలీసులు మంగళవారం రిమాండుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఓ కుటుంబం మండలంలోని అన్నోజిగూడలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో రెండు సంవత్సరాల క్రితం బతుకుదెరువు నిమిత్తం వచ్చి నివాసం ఉంటున్నారు. ఆ కుటుంబానికి చెందిన బాలిక (15) సమీపంలోని పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే కాలనీకి చెందిన సంతోష్ అనే యువకుడు ఆ బాలికతో అప్పుడప్పుడు మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలోనే యువకుడు తనను ప్రేమించాలని ఒత్తిడి తెచ్చాడు. ప్రేమిం చకుంటే మీ అమ్మను చంపేస్తానని, నీ ముఖంపై యాసిడ్ చల్లుతానని బెదిరించాడు. ఈ విషయాలను ఆ బాలిక తన కుటుంబసభ్యులకు తెలిపింది. దాంతో వారు కాలనీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఆ యువకుడిని పిలిపించి కాలనీపెద్దలు మందలించారు. కాగా ఆదివారం మధ్యాహ్నం బాలిక ఇంట్లో ఒంటిరిగా ఉండటాన్ని గమనించిన సంతోష్ ఇంట్లోకి వెళ్లి కత్తెరతో చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక అరవడంతో చుట్టు ప్రక్కల వారు అక్కడికి రావడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలిపింది. దీంతో పోలీ సులకు అదేరోజు రాత్రి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి నిందితుడిని మంగళవారం రిమాండుకు తరలించారు. అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
200 ఏళ్లకు ఒక అమ్మాయి జన్మించింది
సమ్‌థింగ్ స్పెషల్ ‘అమ్మాయే పుడుతుంది.. అచ్చం అమ్మలాగే ఉంటుంది...’ అంటూ ల్యారీల కుటుంబం రెండువందల సంవత్సరాల నుంచి ఎదురుచూస్తోంది. అయితే ప్రతిసారీ నాన్నలాంటి అబ్బాయిలే పుడుతూ వస్తున్నారు. ఈ పరంపర రెండు వందల సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. అయితే ఎట్టకేలకు తాజాగా ఆ ఇంట ఒక బుజ్జిపాప పుట్టింది. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు ఉబ్బితబ్బిబయిపోతోంది. ల్యారీల వంశ వృక్షాన్ని రెండువందల ఏళ్లుగా పరిశీలించి చూస్తే ఒక్క అమ్మాయంటే ఒక్క అమ్మాయీ ఉండదు. 1809లో చివరగా ఆ ఇంట ఒక పాప జన్మించింది. అప్పటి నుంచి తరాలు మారిపోతున్నా.. ఆ ఇంట మగశిశువులు తప్ప ఆడశిశువుల జాడ లేదు. అబ్బాయిలు పుడుతున్నారు.. పెద్ద అవుతున్నారు, వారికి పెళ్లిళ్లు అవుతున్నాయి... సంతానం కలుగుతోంది. ఆ సంతానమంతా అబ్బాయిలే! కొన్ని తరాల కిందటే ల్యారీల వంశం తమ ఇంట్లో ఆడశిశువుల జననం కలగడం లేదని అర్థం చేసుకొంది. కుటుంబం విస్తరిస్తున్నా.. ఏ ఒక్కరికీ అమ్మాయి పుట్టలేదు. అన్నీ గడ్డాలూ, మీసాలే! ఒక అక్క కావాలి, ఒక చెల్లి ఉండాలి, కూతురు కావాలి... అనే తపన మొదలైంది. ల్యారీల ఇంటికి వచ్చిన కోడళ్లను కూడా లోటు వేధించసాగింది. ఆడపిల్ల కోసం ఆ కుటుంబం పరితపించింది. ఐదు తరాల ఈ ఆవేదనను తీరుస్తూ ఇటీవలే ఆ ఇంట్లో పాపపుట్టింది. ల్యారీల వంశంలోని మార్క్‌కు నలుగురబ్బాయిల తర్వాత ఐదో సంతానంగా పాపపుట్టింది. దీంతో ఇప్పుడు ఆ కుటుంబం చాలా ఆనందపడుతోంది. ఐదు తరాలుగా తమ ఇంట్లో అమ్మాయిలే లేరని.. ఇప్పుడు పాప పుట్టడంతో తమ కుటుంబం మొత్తం ఎంత ఆనందిస్తోందో చెప్పడానికి మాటలు చాలడం లేదని మార్క్ అంటున్నాడు. తన భార్య హన్నా వల్ల ఈ అదృష్టం కలిసి వచ్చిందని మార్క్ మెరుస్తున్న కళ్లతో చెబుతున్నాడు! -
బాలికలను కాపాడుకుందాం..
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, తరుణి స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా బేగంపేట్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘బాలికలను కాపాడుకుందాం’ అన్న సందేశంతో బైక్‌థాన్ పేరిట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ నుంచి దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ వరకు దాదాపు 500 మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు నిజామాబాద్ ఎంపీ కవితతోపాటు అవినీతి నిరోధక శాఖ డెరైక్టర్ జనరల్ ఏకే ఖాన్, క్రైం ఎస్పీ పద్మజ, ఏపీ ఫారెస్ట్ అకాడమీ డెరైక్టర్ రఘువీర్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు అచ్యుతరావు తదితరులు ఆడ పిల్లలకు రక్షణగా ఉంటామని ప్రతినబూనారు. తోడు-నీడగా ఉండి వారి అభివృద్ధిని కాంక్షిస్తామని, ఆర్థికంగా, సామాజికంగా వారి ఎదుగుదలకు తోడ్పాటునందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ మగ పిల్లలతో పోలిస్తే ఆడ పిల్లల నిష్పత్తి తక్కువగా ఉండడం బాధాకరమన్నారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు మమతారఘువీర్, అచ్యుతరావు, రహీముద్దీన్ మాట్లాడుతూ 2001-2011 జనాభా లెక్కల ప్రకారం అమ్మాయిల శాతం గణనీయంగా పడిపోయిందన్నారు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా హక్కులు పొందే రోజులు రావాలన్నారు. హక్కుల కోసం పోరాడిన మలాల మాదిరిగా బాలికలు ముందుకు రావాలన్నారు. అంతర్జాతీయ బాలికల వారోత్సవాలను పురస్కరించుకుని బాలికల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈనెల 15న సైదాబాద్ కాలనీలోని గీతాంజలి విద్యాలయంలో చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు, తరుణి సంస్థ అధినేత్రి హేమలత పాల్గొన్నారు. -
బాలికను మోసం చేసిన యువకుడికి రిమాండు
నిందితుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ మోమిన్‌పేట: వివాహం చేసుకుంటానని నమ్మబలికి బాలికను మోసం చేసిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. సీఐ ఏవీ రంగా బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని టేకులపల్లి అనుబంధ సుద్దోడ్క తండాకు చెందిన బాలిక(17) ఇంటర్ చదువుతోంది. ఈమె వేసవి సెలవులకు మర్పల్లి మండలం నర్సాపూర్ అనుబంధ పెద్ద తండాలో ఉంటున్న తన సోదరి వద్దకు వెళ్లింది. అక్కడ అదే తండాకు చెందిన అంబోతు అంబర్‌సింగ్(28)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అంబర్‌సింగ్ మెదక్ జిల్లా సదాశివపేటలో ఉంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని అంబర్‌సింగ్ బాలికను నమ్మబలికి లొంగదీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఈనెల 3న అంబర్‌సింగ్‌కు కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి బాలికను దూరంగా ఉంచుతున్నాడు. పెళ్లి విషయమై బాలిక అంబర్సింగ్ను నిలదీయగా తనకేం సంబంధం లేదని స్పష్టం చేశాడు. దీంతో బాలిక ఈనెల 16న మోమిన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి బుధవారం రిమాండుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ రాజు తదితరులు ఉన్నారు.