- యువకుడి అరెస్ట్
- నిర్భయ కేసు నమోదు
ఘట్‌కేసర్: ప్రేమించకపోతే కత్తెరతో చంపుతానని బాలికను బెదిరించిన యువకుడిని పోలీసులు మంగళవారం రిమాండుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కేంద్రానికి చెందిన ఓ కుటుంబం మండలంలోని అన్నోజిగూడలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో రెండు సంవత్సరాల క్రితం బతుకుదెరువు నిమిత్తం వచ్చి నివాసం ఉంటున్నారు. ఆ కుటుంబానికి చెందిన బాలిక (15) సమీపంలోని పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.
అదే కాలనీకి చెందిన సంతోష్ అనే యువకుడు ఆ బాలికతో అప్పుడప్పుడు మాట్లాడేవాడు. ఈ నేపథ్‌యంలోనే యువకుడు తనను ప్రేమించాలని ఒత్తిడి తెచ్చాడు. ప్రేమిం చకుంటే మీ అమ్మను చంపేస్తానని, నీ ముఖంపై యాసిడ్ చల్లుతానని బెదిరించాడు. ఈ విషయాలను ఆ బాలిక తన కుటుంబసభ్యులకు తెలిపింది. దాంతో వారు కాలనీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఆ యువకుడిని పిలిపించి కాలనీపెద్దలు మందలించారు. కాగా ఆదివారం మధ్యాహ్నం బాలిక ఇంట్లో ఒంటిరిగా ఉండటాన్ని గమనించిన సంతోష్ ఇంట్లోకి వెళ్లి కత్తెరతో చంపేస్తానని బెదిరించాడు.
దీంతో బాలిక అరవడంతో చుట్టు ప్రక్కల వారు అక్కడికి రావడంతో ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సాయంత్రం తల్లిదండ్రులకు జరిగిన విషయం తెలిపింది. దీంతో పోలీ సులకు అదేరోజు రాత్రి ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి నిందితుడిని మంగళవారం రిమాండుకు తరలించారు. అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రేమించకపోతే చంపేస్తానని బాలికకు బెదిరింపు
Published Wed, May 6 2015 12:53 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM
Advertisement
Advertisement