girl safe
-
బాలికలకు భద్రత ఎక్కడ?
ఇక్కడ మీరుచూస్తోంది తెలంగాణలోని హజీపూర్‌లో బాలికల మృతదేహాల కోసం బావిలో పోలీసులు గాలిస్తున్న దృశ్యాలు. చదువుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరిగి వస్తున్న అమాయక విద్యార్థినిలను ఓ మృగాడు లిఫ్టు ఇస్తానంటూ నమ్మబలికి అత్యాచారం చేసి, హతమార్చి ఇలా బావిలో పాతిపెట్టాడు. ఇలా ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థినుల తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చాడు. విద్యార్థినిలు నివాసముండే ప్రాంతాల నుంచి స్కూళ్లకు బస్సు సౌకర్యం లేకపోవడం వల్లనే ఇంతటి దారుణానికి కారణంగా అధికారుల పరిశీలనలో వెల్లడైంది. అనంత జిల్లా వ్యాప్తంగానూ ఆర్టీసీ బస్సులు తిరగని గ్రామాలు వెయ్యికిపైగానే ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి ఆటోలు, ద్విచక్రవాహనాల్లో విద్యార్థినులు స్కూళ్లకు వస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలోనూ ఇలాంటి దారుణాలు చోటు చేసుకోకముందే ప్రభుత్వం మేల్కొని అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. – అనంతపురం న్యూసిటీ నడకే దిక్కు మీరు చూస్తున్న ఈ చిత్రంలోని విద్యార్థినిలు తనకల్లు మండలం టి.వంకపల్లి గ్రామానికి చెందిన వారు. ఈ గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో రోజూ ఐదే కిలోమీటర్లు కాలి నడకన తనకల్లులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చేరుకుంటూ ఉంటారు. గ్రామంలో చాలా మంది బాలికలను అంత దూరం కాలినడకన పంపలేక తల్లిదండ్రులు మధ్యలోనే వారి చదువులు మాన్పించేశారు. ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఉంది. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో అభద్రతా భావానికి గురై ఉన్నత చదువులకు బాలికలు దూరమయ్యారు. – తనకల్లు మాకు వేరే మార్గం లేదు మా ఊరు తనకల్లుకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. స్కూల్‌కి వచ్చేందుకు మాకు ఆర్టీసీ బస్సులు లేవు. ఆటోల సౌకర్యం కూడా అంతంత మాత్రమే. దీంతో కాలినడకన స్కూల్‌కు వెళ్లాల్సి వస్తోంది. మాకు వేరే మార్గమూ లేదు. నడుచుకొంటూ అంత దూరం వెళ్లేటప్పుడు చాలా భయంగా ఉంటుంది.– ఉషా, 9వ తరగతి, టి.వంకపల్లి, తనకల్లు మం‘‘ ఆటోలే శరణ్యం ఈ ఆటోలో వేలాడుతూ వెలుతున్న విద్యార్థినిలు గుమ్మఘట్ట మండలం భూపసముద్రం గ్రామానికి చెందిన వారు. ఈ గ్రామం నుంచి ఎక్కువగా 74 ఉడేగోళం, రాయదుర్గంలోని ఉన్నత పాఠశాలలకు వెళుతుంటారు. వీరికి పాఠశాల సమాయనికి బస్సులు లేక ఇలా ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోంది. – గుమ్మఘట్ట -
బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం
రాజమహేంద్రవరంలో తీసుకువెళ్లి.. నడకుదురులో వదిలేశారు.. తండ్రికి అప్పగించిన కరప పోలీసులు కరప (కాకినాడ రూరల్) : రాజమండ్రిలో నాలుగు రోజుల క్రితం తప్పిపోయిన ఎనిమిదేళ్ల బాలిక కథ సుఖాంతమైంది. బాలిక వెంకటలక్షి్మని కరప పోలీసులు గురువారం రాత్రి తండ్రి ఖాదర్‌కు అప్పగించారు. ఈ బాలికను రాజమండ్రిలో ముగ్గురు కిడ్నాప్ చేసి నడకుదురు వద్ద వదిలిపెట్టారు. ఆమె చెవికి ఉన్న రూ.9 వేల విలువైన రింగులను తీసుకుపోయారు. పోలీసులు, తండ్రి కథనం ప్రకారం... శ్రీశైలం నుంచి పొట్టకూటి కోసం ఖాదర్, ఉరవకొండ మల్లేశ్వరి, పిల్లలతో రాజమండ్రిలో జీవిస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ఖాదర్, మల్లేశ్వరి కుమార్తె వెంకటలక్ష్మి రాజమండ్రి గోదావరి గట్టుపై ఆడుకుంటుంటే.. ముగ్గురు వ్యక్తులు మాయమాటలు చెప్పి ట్రై¯ŒSలో కాకినాడ తీసుకువెళ్లారు. 8వ తేదీ బుధవారం నడకుదురులోని ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న ఈ బాలికను స్థానికులు మొండి ఈశ్వరరావు, గాడి శ్రీనివాస్, నడికట్ల శివశంకర్, జువ్వల చిన్నలు చేరదీసి వివరాలు సేకరించారు. చెవికి ఉన్న రింగులు వారు తీసేసుకున్నారని ఆమె చెప్పింది. ఈమె కోసం ఎవరైనా వస్తారేమోనని చూసిన వారు గురువారం ఆమెను కరప పోలీసుస్టేష¯ŒSలో అప్పగించారు. ఎస్సై మెల్లం జానకిరాం వైర్లెస్ సెట్లో ఆమె వివరాలు వెల్లడించడంతో.. బాలిక తప్పిపోయినట్టు ఫిర్యాదు ఉందని రాజమండ్రి త్రీటౌ¯ŒS పోలీసులు స్పందించారు. రాజమండ్రి పీఎస్ హెచ్‌సీ సీహెచ్ వెంకటరమణ, ఖాదర్‌తో కలిసి స్థానిక పోలీసుస్టేష¯ŒSకు రావడంతో బాలికను రైటర్ ఎ¯ŒS.వెంకటరమణ వారికి అప్పగించారు. నాలుగురోజుల నుంచి కుమార్తె కోసం తిరుగుతున్నానని ఖాదర్ చెబుతూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కుమార్తె చెవికి ఉన్న రింగుల విలువ రూ.9 వేలు ఉంటుందని చెప్పారు. -
చిన్నారి సురక్షితం
– అనుష్క కిడ్నాప్ కేసును ఛేదించిన కదిరి పోలీసులు కదిరి : కదిరి మునిసిపాలిటీ పరిధిలోని కుటాగుళ్లకు చెందిన వరాలు, ఆంజనేయులు దంపతుల ఐదేళ్ల కుమార్తె అనుష్క కిడ్నాప్ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. ఒకప్పుడు కుటాగుళ్లలోనే కాపురముండి, ప్రస్తుతం జమ్మలమడుగులో ఉంటున్న నాగమణి తన కుమార్తె హేమలతతో కలిసి డబ్బు కోసం చిన్నారిని గురువారం తెల్లవారుజామున కిడ్నాప్ చేసింది. తర్వాత ఏం చేయాలో తెలియక ధర్మవరంలో ఉంటున్న అల్లుడు చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లింది. ఈ చిన్నారి ఎవరని అతను ప్రశ్నించాడు. తనకు తెలిసిన వారి అమ్మాయి అని, వెంటబడగా తీసుకొచ్చామని నమ్మబలికింది. కాగా.. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న కదిరి డీఎస్పీ రామాంజనేయులు పట్టణ ఎఐ మధుసూదన్‌రెడ్డి నేతత్వంలో ప్రత్యేక బందాన్ని ఏర్పాటు చేశారు. చిన్నారి ధర్మవరంలో ఉందని తెలుసుకున్న ఈ బందం అక్కడికి వెళ్లింది. నిందితురాలు నాగమణి, ఆమె కుమార్తె, అల్లుణ్ని అదుపులోకి తీసుకుంది. చిన్నారిని సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.