- రాజమహేంద్రవరంలో తీసుకువెళ్లి.. నడకుదురులో వదిలేశారు..
- తండ్రికి అప్పగించిన కరప పోలీసులు
బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం
Published Thu, Mar 9 2017 10:52 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM
కరప (కాకినాడ రూరల్) :
రాజమండ్రిలో నాలుగు రోజుల క్రితం తప్పిపోయిన ఎనిమిదేళ్ల బాలిక కథ సుఖాంతమైంది. బాలిక వెంకటలక్షి్మని కరప పోలీసులు గురువారం రాత్రి తండ్రి ఖాదర్‌కు అప్పగించారు. ఈ బాలికను రాజమండ్రిలో ముగ్గురు కిడ్నాప్ చేసి నడకుదురు వద్ద వదిలిపెట్టారు. ఆమె చెవికి ఉన్న రూ.9 వేల విలువైన రింగులను తీసుకుపోయారు. పోలీసులు, తండ్రి కథనం ప్రకారం... శ్రీశైలం నుంచి పొట్టకూటి కోసం ఖాదర్, ఉరవకొండ మల్లేశ్వరి, పిల్లలతో రాజమండ్రిలో జీవిస్తున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న ఖాదర్, మల్లేశ్వరి కుమార్తె వెంకటలక్ష్మి రాజమండ్రి గోదావరి గట్టుపై ఆడుకుంటుంటే.. ముగ్గురు వ్యక్తులు మాయమాటలు చెప్పి ట్రై¯ŒSలో కాకినాడ తీసుకువెళ్లారు. 8వ తేదీ బుధవారం నడకుదురులోని ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న ఈ బాలికను స్థానికులు మొండి ఈశ్వరరావు, గాడి శ్రీనివాస్, నడికట్ల శివశంకర్, జువ్వల చిన్నలు చేరదీసి వివరాలు సేకరించారు. చెవికి ఉన్న రింగులు వారు తీసేసుకున్నారని ఆమె చెప్పింది. ఈమె కోసం ఎవరైనా వస్తారేమోనని చూసిన వారు గురువారం ఆమెను కరప పోలీసుస్టేష¯ŒSలో అప్పగించారు. ఎస్సై మెల్లం జానకిరాం వైర్‌లెస్ సెట్‌లో ఆమె వివరాలు వెల్లడించడంతో.. బాలిక తప్పిపోయినట్టు ఫిర్యాదు ఉందని రాజమండ్రి త్రీటౌ¯ŒS పోలీసులు స్పందించారు. రాజమండ్రి పీఎస్ హెచ్‌సీ సీహెచ్ వెంకటరమణ, ఖాదర్‌తో కలిసి స్థానిక పోలీసుస్టేష¯ŒSకు రావడంతో బాలికను రైటర్ ఎ¯ŒS.వెంకటరమణ వారికి అప్పగించారు. నాలుగురోజుల నుంచి కుమార్తె కోసం తిరుగుతున్నానని ఖాదర్ చెబుతూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. కుమార్తె చెవికి ఉన్న రింగుల విలువ రూ.9 వేలు ఉంటుందని చెప్పారు.
Advertisement