girls abused
-
అమెరికా వ్యాపారి జైలులో ఆత్మహత్య
న్యూయార్క్: బాలికల విక్రయం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారి జెఫ్రీ ఎప్స్టీన్(66) జైలులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. బాలికలను, ముఖ్యంగా 14 ఏళ్లలోపు వారిని విక్రయిస్తున్నాడన్న ఆరోపణలపై అతడు ప్రస్తుతం మన్‌హట్టన్‌లోని మెట్రోపాలిటన్ కరెక్షనల్ జైలులో ఉన్నాడు. ఎప్స్టీన్ గతంలో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు క్లింటన్, బ్రిటన్ యువరాజు ఆండ్రూ వంటి పలువురు రాజకీయనేతలు, సెలబ్రిటీలతో సన్నిహిత సంబంధాలు సాగించేవాడు. మన్‌హట్టన్, పామ్‌బీచ్‌లలోని తన నివాసాల్లో 2002–2005 మధ్య టీనేజీ బాలికలను వాడుకోవడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడినట్లు అతడిపై ఆరోపణలున్నాయి. ఆరోపణలు రుజువైతే 45 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. -
చిత్రహింసలు.. ఆపై రెండేసి పెళ్లిళ్లు
లక్నో : బిహార్‌లోని ముజఫర్‌పూర్ షెల్టర్ హోం ఘటన మరువక ముందే ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియోలో వసతి గృహంలో బాలికల లైంగిక హింస ఘటన వెలుగులోకి వచ్చింది. డియోరియోలో వసతి గృహం నుంచి పారిపోయి బయటకు వచ్చిన ఓ బాలిక అక్కడ జరిగే అకృత్యాల గురించి బయట పెట్టింది. షెల్టర్ హోం నిర్వహకురాలు గిరిజా త్రిపాఠి బాలికలను చిత్ర హింసలకు గురిచేసేవారని, కొంత మంది బాలికలకు వారి కన్నా రెట్టింపు వయసున్న వారితో రెండేసి పెళ్లిళ్లు చేసేవారని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. బాధిత బాలిక ఫిర్యాదుతో షెల్టర్ హోంపై దాడి చేసిన పోలీసులు మరో 24 మంది బాలికలకు కాపాడారు. షెల్టర్ హోం అకృత్యాల నుంచి బయటపడిన బాలికలతో మంగళవారం ఆరుగురు మహిళా సభ్యుల బృందం మాట్లాడింది. తమను హోంలో చిత్ర హింసలకు గురిచేసేవారని, లైంగికంగా వేధించేవారని బాలికలు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేపి ప్లోర్ మొత్తం శుభ్రం చేయించేవారని, తినడానికి కేవలం రెండు చపాతీలు మాత్రమే ఇచ్చేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా పని చేయాడానికి నిరాకరిస్తే వారికి ఆపూట భోజనం పెట్టే వారు కాదని బాలికలు వాపోయారు. కాగా బాలిక ఫిర్యాదుతో సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆ వసతి గృహంపై దాడులు చేసిన పోలీసులు 24 మంది బాలికలను రక్షించామని తెలిపారు. వారిలో 10 మంది మైనర్లు ఉన్నారని పేర్కొన్నారు. అక్కడ మొత్తం 42 మంది ఉండగా వారిలో 18 మంది ఆచూకీ లభించలేదన్నారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఏడాదికి పైగా వీరు ఎటువంటి అనుమతులు లేకుండా వసతి గృహాన్ని నడుపుతున్నారని తమ విచారణలో తెలిందన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం డియోరియా జిల్లా ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. అనుమతులు లేకుండా నడుస్తున్న వసతి గృహలపై కేంద్ర శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకాగాంధీ లోక్‌సభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
పదేళ్ల బాలిక తెగువ ; 24 మందికి విముక్తి
లక్నో : ఓ పదేళ్ల బాలిక ప్రదర్శించిన తెగువ బాలికల వసతి గృహంలో బంధీలుగా ఉన్న 24 మందికి విముక్తి కల్పించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో చోటుచేసుకుంది. వింధ్యవాసిని మహిళ మరియు బాలిక సంరక్షణ గృహం నుంచి తప్పించుకున్న ఆమె అక్కడ జరుగుతున్న ఆకృత్యాల గురించి పోలీసులకు తెలిపింది. బాలిక ఇచ్చిన సమాచారంతో దాడులు జరిపిన పోలీసులు అక్కడ బంధీలుగా ఉన్నవారిని రక్షించారు. అంతేకాకుండా ఆ వసతి గృహం నిర్వహకురాలు గిరిజ త్రిపాఠితోపాటు, ఆమె భర్త, కూతురిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బయటపడిన బాలికలు తమపై జరిగిన భౌతిక, లైంగిక దాడుల గురించి పోలీసులకు తెలిపారు. ఆ బాలిక కథనం ప్రకారం.. ‘నేను ఆ వసతి గృహంలోని మొదటి అంతస్తులో ఉండేదాన్ని.. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో వార్డెన్ నన్ను కిందికి పిలిచారు. నన్ను ఫ్లోర్ శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించారు. ఆ తర్వాత ఆమెకు ఫోన్ కాల్ రావడంతో అందులో లీనమైపోయారు. దీనిని అదునుగా భావించిన నేను మరో ఆలోచన లేకుంగా అక్కడి నుంచి బయటకు వచ్చి పోలీసు స్టేషన్‌కు వెళ్లాను. వారు చెప్పిన పనులు చేయకుంటే మమ్మల్ని దారుణంగా కొడతారు. నా కంటే పెద్దవారిపై లైంగికంగా దాడులు కూడా జరిగాయ’ని తెలిపారు. బాలిక ఫిర్యాదుతో అదే రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆ వసతి గృహంపై దాడులు చేసి 24 మంది బాలికలను రక్షించామని పోలీసులు తెలిపారు. వారిలో 10 మంది మైనర్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. అక్కడ మొత్తం 42 మంది ఉండగా వారిలో 18 మంది ఆచూకీ లభించలేదన్నారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఏడాదికి పైగా వీరు ఎటువంటి అనుమతులు లేకుండా వసతి గృహాన్ని నడుపుతున్నారని తమ విచారణలో తెలిందన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం డియోరియా జిల్లా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. -
ఆ అకృత్యాలపై బిహార్‌కు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌లోని ముజఫర్‌పూర్ బాలికల వసతి గృహంలో మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల ఘటనపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ ఉదంతానికి సంబంధించి బిహార్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్ధానం గురువారం నోటీసులు జారీ చేసింది. మరోవైపు షెల్టర్ హోంలో బాలికలపై అకృత్యాలకు నిరసనగా గురువారం రాష్ట్ర బంద్‌కు లెఫ్ట్ పార్టీలు పిలుపు ఇచ్చాయి. బంద్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. చిన్నారులపై లైంగిక దాడి ఘటనకు బాధ్యత వహిస్తూ బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ముజఫర్‌పూర్‌కు చెందిన ఎన్జీవో సేవా సంకల్ప్ ఇవాం వికాస్ సమితి నిర్వహిస్తున్న వసతి గృహంలో మైనర్ బాలికలపై నిర్వాహకులు, అధికారులు జరిపిన లైంగిక దాడుల ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంస్థ చేపట్టిన సామాజిక ఆడిట్లో ఈ దారుణం వెలుగుచూసింది. -
బాలికలపై అకృత్యాలు.. బిహార్ బంద్
పట్నా : బిహార్‌లోని ముజఫర్‌పూర్ బాలికల వసతి గృహంలో మైనర్ బాలికలపై లైంగిక వేధింపుల కేసుకు నిరసనగా గురువారం రాష్ట్ర బంద్‌కు లెఫ్ట్ పార్టీలు పిలుపు ఇచ్చాయి. బంద్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతు తెలిపాయి. చిన్నారులపై లైంగిక దాడి ఘటనకు బాధ్యత వహిస్తూ బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ముజఫర్‌పూర్‌కు చెందిన ఎన్జీవో సేవా సంకల్ప్ ఇవాం వికాస్ సమితి నిర్వహిస్తున్న వసతి గృహంలో మైనర్ బాలికలపై నిర్వాహకులు, అధికారులు జరిపిన లైంగిక దాడుల ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ సంస్థ చేపట్టిన సామాజిక ఆడిట్లో ఈ దారుణం వెలుగుచూసింది. చిన్నారులకు మత్తుమందు ఇచ్చి వారిపై లైంగిక దాడులకు పాల్పడటం, వారిని తీవ్రంగా హింసించడం వంటి చర్యలతో షెల్టర్ హోంను బిహార్ ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో ఉంచింది. కాగా బిహార్ బంద్‌కు మద్దతు ఇస్తున్నామని, హేయమైన ఈ ఘటనపై సీఎం నితీష్ కుమార్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ ప్రతినిధి శక్తిసింహ్ గోహిల్ ట్వీట్ చేశారు. నితీష్ ప్రభుత్వ ఊతంతో చిన్నారి బాలికలపై జరిగిన సామూహిక లైంగిక దాడి అత్యంత హేయమని ఆర్జేడీ నేత, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ అన్నారు. -
ఫేస్బుక్ నకిలీ ప్రొఫైల్‌తో.. బ్లాక్మెయిల్
అతడు అందమైన అమ్మాయిల ఫొటోలతో నకిలీ ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తాడు. యువతులకు ఫ్రెండ్ రిక్వెస్టు పంపి, వాళ్లతో చాటింగ్ మొదలుపెడతాడు. కొన్నాళ్ల తర్వాత కలుద్దామని చెబుతాడు. వాళ్లు నిరాకరిస్తే, వారి ప్రొఫైల్‌లో ఉన్న ఫొటోలతో మరో నకిలీ అకౌంట్ క్రియేట్ చేసి, దాంట్లో వాళ్ల ఫొటోలను మార్ఫింగ్ చేసి దారుణంగా పెడతాడు. ఆ అకౌంట్‌ను పోర్న్ కంటెంట్‌తో నింపేస్తాడు. దాంతోపాటు వాళ్ల వివరాలను ఎస్కార్ట్ వెబ్సైట్లలో పెడతాడు. అంతటితో అయిపోదు.. నకిలీ ప్రొఫైల్‌ను వాళ్ల స్కూలు ఫేస్బుక్ అకౌంటులో పెడతానంటూ బ్లాక్మెయిల్ చేసి, వాళ్ల నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తాడు. ఎట్టకేలకు ఈ మోసగాడిని పోలీసులు పట్టుకున్నారు. అతడి పేరు అఖిలేష్ (24). పెళ్లి కూడా అయింది. ఇప్పటివరకు ఇలా వంద మంది వరకు అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేశాడు. చిన్నవయసు నుంచే అతడికి తప్పులు చేయడం అలవాటు. స్కూలు రికార్డులలో తన తండ్రి పేరుకు బదులు మామ పేరు రాశాడు. డ్రైవింగ్ లైసెన్సుకు కూడా అలాగే చేశాడు. మధ్యప్రదేశ్‌లోని భింద్ ప్రాంతానికి చెందిన అఖిలేష్, ఢిల్లీలోని బక్కర్వాలా ప్రాంతంలో నివసిస్తాడు. పదోతరగతి ఫెయిలై చదువు మానేశాడు. వజీర్‌పూర్‌లోని ఓ ఎగుమతుల కంపెనీలో పనివాడిగా చేరి, డ్రైవర్ అయ్యాడు. బాలీవుడ్లో పాటలు పాడాలని అనుకునేవాడు. పొరుగునుండే ఓ అమ్మాయితో స్నేహం చేయాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. తర్వాతి నుంచి ఫేస్బుక్ వ్యవహారం మొదలుపెట్టాడు. అతడిపై 354డి, 509, 506లతో పాటు పోస్కోచట్టంలోని 12వ సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ఫేస్బుక్ మెసెంజర్ సాయంతో తన కూతురిని ఎవరో వేధిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు ఓ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో అఖిలేష్ బాగోతం మొత్తం బయటపడింది. ఆమె ఫోన్ నంబరును అసభ్యకరమైన టైటిళ్లతో ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. చివరకు సైబర్‌సెల్‌కు చెందిన ఇన్స్పెక్టర్ రమేష్ దహియా ఇతడి గుట్టు రట్టుచేశారు. సుమారు వంద మంది అమ్మాయిల నెంబర్లతో కూడిన మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు.