girls kidnap
-
Pihu Mondal: నరకపు నీడ నుంచి వెలుగుల వైపు
ఉదయం అమ్మకు ఇంట్లో టాటా చెప్పి, బడిలో పాఠాలు వింటూ.. స్నేహితులతో కబుర్లు చెప్పుకుంటూ తిరిగిన అమ్మాయి సాయంత్రం అయ్యేసరికి తనకు తెలియని చీకటి లోకంలో ఉంటే ఎంత భయం... చుట్టూ ఏం జరుగుతోందో... తనకేం జరిగిందో తనకే సరిగా తెలియని ఆ ‘చీకటి లోకం’లో తెగువ చూపి, అది మిగిల్చిన చేదు సంఘటనల నుంచి బయటపడి ఇంటికి వచ్చేసింది 14 ఏళ్ల ఆ అమ్మాయి. ఊళ్లో అంతా విచిత్రంగా చూశారు ఆమెను. ‘బిజినెస్ గర్ల్’ అని అంతా అంటుంటే కుంగిపోయింది. కానీ, అదే అమ్మాయి 21 ఏళ్ల వయసు వచ్చేనాటికి మానవ అక్రమ రవాణాకు గురైన బాలికల జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోంది. ఆమె పేరు పీహూ మోండల్. పశ్చిమ బెంగాల్‌లోని ఓ మారుమూల గ్రామం. ‘హ్యూమన్ ట్రాఫికింగ్ బారిన పడిన ఆడపిల్లల బాధను పంచుకుని, వారిని నరకపు నీడ నుంచి బయటికి తీసుకొచ్చి, వెలుగు చూపగలిగినప్పుడు ఇంకా నా గుర్తింపును నేను ఎందుకు దాచుకోవాలి?!’ అని ప్రశ్నిస్తున్న ఈ అమ్మాయి గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ‘‘మేడమ్ సాహెబ్’ కావాలని నా చిన్ననాటి నుంచి నాతో పెరిగిన కల. పరగాణాలోని చిన్నూరు మాది. మా నాన్న రోజు కూలీ. అమ్మ గృహిణి. మాకంటూ సెంటు భూమి లేదు. ఉన్నదల్లా తలదాచుకునేందుకు చిన్న ఇల్లు. మా ఊళ్లో ఆడపిల్లలు చదువుకోవడానికి బడికి వెళ్లరు. కానీ, నాకు చదువుకోవాలని ఉండేది. నేను మేడమ్ సాహెబ్‌గా ఎదగాలని కలలు కంటూ, పుస్తకాలనే ఎక్కువ ఇష్టపడేదాన్ని. ఇదే విషయాన్ని మా అమ్మానాన్నలతో చెబితే వాళ్లూ ‘సరే’ అన్నారు. ఊళ్లో చాలా మంది వ్యతిరేకించారు అమ్మాయిలకు చదువెందుకని. కానీ, వాళ్లతో గొడవపడి మరీ నన్ను స్కూల్లో చేర్పించారు నాన్న. నాకు చదువు మీద ఉన్న ఇష్టం చూసి, ఇంటి పనిలో కూడా సాయం చేయమని అడిగేది కాదు అమ్మ. అప్పుడప్పుడు మా ఊరి వాళ్లు కొందరు వెక్కిరించినా వాటిని పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. నొప్పి ఉంది, ప్రాణం లేదు పద్నాలుగేళ్ల వయసు. పదవతరగతిలోకి అడుగు పెట్టాను. నేనూ, మా స్నేహితురాలు కలిసి ఇంటికి తిరిగి వస్తున్నాము. చాలా ఎండ, గొంతెండుకుపోతోంది. దారిలో ఒకరి దగ్గర నీళ్లు ఉంటే అడిగి, తీసుకొని తాగాం. ఆ తర్వాత ఇంటివైపు బయల్దేరాం. కొంచెం దూరం నడిచాక అడుగులు తడబడటం మొదలెట్టాయి. తల అంతా తిరుగుతున్నట్టు అనిపించింది... కళ్లు తెరిచి చూసేసరికి నేనూ, నా ఫ్రెండ్ రైలులో ఉన్నాం. ఒళ్లంతా విపరీతమైన నొప్పి. కూర్చోవడానికి ఒళ్లు సహకరించడం లేదు. మా దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. మా పరిస్థితి చూశాక మేమెలాంటి దారుణానికి గురయ్యామో కొంత మేరకు అర్థమయ్యింది. అక్కడ మమ్మల్ని ఇంకెవరికో అమ్మేందుకు తీసుకువెళుతున్నారని, ఇప్పటికే రెండుసార్లు అమ్ముడు పోయామన్న మాటలు విన్నాం. ఒకరినొకరం చూసుకున్నాం. చైన్ లాగితే రైలు ఆగింది. వెంటనే, రైల్వే పోలీసులు వచ్చారు. తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు ఒకసారి మానవ అక్రమరవాణాపై వర్క్‌షాప్‌కి హాజరయ్యాం. అందుకే, మాకు వెంటనే రైలును ఆపాలనే ఆలోచన వచ్చింది. విచారణ తర్వాత మేం ఇంటికి వచ్చాం. అవగాహనే ప్రధానం ఇవన్నీ మా ఇంట్లో... నా ఒంట్లో ఒకలాంటి నిస్తేజాన్ని నింపాయి. దాంతో డిప్రెషన్లోకి వెళ్లాను. నాకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో తిరిగి స్కూల్‌కి వెళ్లి, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని నిరూపించాను. దీని తర్వాత బంధన్ ముక్తి, ఇల్ఫత్లో చేరాను. అక్కడ, మానవ అక్రమ రవాణా, పిల్లల అక్రమ రవాణా, అత్యాచార ఘటనలలో ప్రాణాలతో బయటపడిన అమ్మాయిలను చాలా దారుణమైన స్థితిలో చూశాను. వారి గురించి ఆలోచిస్తే నా వెన్నులో వణుకు వచ్చేస్తుంది. నేను తప్పించుకున్నది అదృష్టంగా భావించాను. నాలా మరే ఆడపిల్లా ఆ నరకంలోకి చిక్కుకోకుండా ఉండేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉన్న స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి మానవ అక్రమ రవాణా గురించి బాలికలకు అవగాహన కల్పిస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడా ఏ అమ్మాయీ మానవ అక్రమ రవాణాకు గురికాకూడదు. ఇదే ఆలోచనతో నా లక్ష్యం వైపుగా సాగుతున్నాను. సంస్కృతం ప్రధాన సబ్జెక్ట్‌గా బి.ఎ. పూర్తిచేశాను. ఇప్పుడు ఎం.ఎ. చేయాలనుకుంటున్నాను. సొంతంగా హ్యాండ్‌మేడ్ ఆభరణాలను తయారు చేస్తుంటాను. పెయింటింగ్స్ వేస్తుంటాను. పర్వతారోహణ చేయాలన్నది నా మరో కల. ఎల్తైన శిఖరం అంచున నిలబడి, చేతులు చాచి అక్కడి గాలిని ఆస్వాదించాలి. అందుకు కూడా అడుగులు వేస్తున్నాను’’ అని చెబుతున్న రేపటి ఈ ఆశాజ్యోతి ఆశయాలు నెరవేరాలని ఆశిద్దాం. అంతటా దూరం దూరం.. స్కూల్‌కు రావద్దని అక్కడి టీచర్లు చెప్పేశారు. ఏడుస్తూ ఇంటికి వస్తే మా అమ్మానాన్నలు దీనస్థితిలో ఉన్నారు. ఊళ్లో అంతా ‘చదువుకునే అమ్మాయిలు పారిపోతారు’ అంటూ మమ్మల్ని నీచ పదాలతో తిట్టారు. కలెక్టివ్ గ్రూప్ సాయంతో స్కూల్లో చదువుకోవడానికి అనుమతి లభించింది. అయితే, అక్కడి టీచర్లు మాతో సరిగా ప్రవర్తించలేదు. ఇతర పిల్లలతో కలిసి కూర్చోనివ్వలేదు. మొదటి సీట్లో కూర్చొనేదాన్ని, చివర సీట్లోకి పంపించారు. ఇక ఇతర పిల్లల తల్లిదండ్రులు ‘మా అబ్బాయిలకు దూరంగా ఉండాలి. అయినా, చదువుకుని ఏం చేస్తావు, చేసేది అదే వ్యాపారం కదా!’ అని హేళనగా మాట్లాడేవారు. -
సన్యాసుల వేషంలో వచ్చి.. బాలికల కిడ్నాప్‌నకు యత్నం
మెరకముడిదాం: పాఠశాలకు వెళుతోన్న ఇద్దరు బాలికలను సన్యాసి వేషంలో ఆటోలో భిక్షాటనకు వచ్చిన కొందరు అటకాయించి కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. పోలీసులు, బాలికలు తెలిపిన వివరాల ప్రకారం..విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం ఊటపల్లికి చెందిన ఇద్దరు బాలికలు మెరకముడిదాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. వీరు గురువారం ఉదయం సైకిళ్లపై పాఠశాలకు బయలుదేరారు. గాదెల మర్రివలస కూడలి వద్దకు వచ్చేసరికి అక్కడ సన్యాసి వేషాల్లో ఉన్న కొందరు వీరిని అడ్డగించే యత్నం చేశారు. బాలికలు కాస్త వేగంగా సైకిళ్లు తొక్కడంతో కొద్ది దూరం వెంబడించారు. అదే సమయంలో ప్రయాణికులతో కూడిన ఆటో అటువైపుగా రావడాన్ని గమనించిన సన్యాసులు వెనుదిరిగారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆటో బాలికలు వేగంగా మెరకముడిదాం చేరుకుని విషయాన్ని స్థానికులకు తెలిపారు. మెరకముడిదాం, ఊటపల్లి వాసులు అప్రమత్తమై మెరకముడిదాంకు సమీపంలో సన్యాసులను పట్టుకుని బుదరాయవలస పోలీసులకు అప్పగించారు. రెండు ఆటోలతో పాటు 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిని మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. ఏడాది కిందట పార్వతీపురానికి చేరుకున్న వీరు కొన్నాళ్లు తగరపువలసలోను, 3 రోజుల కిందట బాడంగి వచ్చి భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు గుర్తించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న 11 మందిలో నలుగురు చిన్నారులు, ఇద్దరు ఆడపిల్లలు, ఐదుగురు మగవారు ఉన్నారు. వీరి ఆధార్ కార్డులను పరిశీలించగా వీరిపై గతంలో ఎలాంటి కేసులు లేవని, విచారిస్తున్నామని, కిడ్నాప్‌కు ప్రయత్నించినట్టు తేలితే కేసు నమోదు చేస్తామని ఎస్ఐ సీహెచ్ నవీన్ పడాల్ తెలిపారు. -
సిద్దిపేట జిల్లాలో బాలికల కిడ్నాప్‌కు యత్నం
ములుగు (గజ్వేల్): సిద్దిపేట జిల్లా ములుగు మండలం మాసాన్‌పల్లిలో ఇద్దరి బాలికల కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. మంగళవారం పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న బాలికలకు చాకెట్లు ఆశ చూపి ఎత్తుకుని పారిపోతున్న కిడ్నాపర్లను గ్రామస్తులు గమనించి దేహశుద్ధి చేసి బాలికలను కాపాడారు. మాసాన్‌పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు మంగళవారం మధ్యాహ్న భోజన సమయంలో మధ్యప్రదేశ్‌కు చెందిన సందీప్‌నిహార్, జగదీశ్ అనే ఇద్దరు వ్యక్తులు వచ్చారు. పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న ఒకటవ, రెండవ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలకు చాక్లెట్లు ఆశ చూపి దగ్గరకు పిలు చుకుని ఎత్తుకుని పారిపోతున్నారు. ఈ క్రమంలో మిగతా పిల్లల అరుపులను గమనించిన గ్రామస్తులు వారిని అడ్డుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం గ్రామస్తులు కిడ్నాపర్లను స్థానిక పోలీసులకు అప్పగించారు. -
యాదాద్రి ఉదంతం : కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: నేరాలను అదుపులోకి తెచ్చాం, ప్రజలకు రక్షణ కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దేశంలోనే గొప్పగా పనిచేస్తోందని చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్టలో చోటుచేసుకుంటున్న బాలికల అక్రమ రవాణాపై స్పందించాలని బీజేపీ సీనియర్ నేత కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండో తిరుపతిగా పేరొందిన యాదగిరి గుట్టలో ఇలాంటి అసాంఘిక , అమానవీయ వ్యభిచార ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చి చిన్నపిల్లలను వ్యభిచార వృత్తిలోకి దింపడం క్షమించరాని నేరమని అన్నారు. ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే కిడ్నాప్, అపహరణ కేసులను పోలీసులు తేలిగ్గా తీసుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు 2,283 మంది చిన్నారులు కనిపించకుండా పోయారనీ, ఇంకా 912 చిన్నారుల ఆచూకీ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు తలెత్తకుండా ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు సమాధానమేదీ..? ఎస్సారెస్పీ ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలకు నీళ్లిస్తామని 2017లో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్, రైతులకు నీరివ్వకపోతే పాపం చేసినట్టేనని వ్యాఖ్యానించారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. మరి పంటలకు సాగునీరు లేక రోడ్డెక్కిన రైతన్నలకు కేసీఆర్ నేడు ఏం సమాధానం చెబుతారని ఎద్దేవా చేశారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు కోసమే రైతులకు నీరివ్వడం లేదని ఆరోపించారు. -
విద్యార్థినుల కిడ్నాప్ కలకలం
పత్తికొండ టౌన్: కర్నూలు జిల్లా పత్తికొండలో గురువారం విద్యార్థినుల కిడ్నాప్ కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థినులను దుండగులు ఆటోలో కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. వారి చెర నుంచి విద్యార్థినులు తప్పించుకున్నారు. బాధిత విద్యార్థినుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పత్తికొండ పట్టణానికి చెందిన హేమ, ఇందు, ఆశా, పూజిత, షమీసునీషా, ఫర్జానా స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గురువారం సమ్మెటివ్ పరీక్షలు ముగిసిన తర్వాత సాయంత్రం ఫర్జానా అనే విద్యార్థిని తనకు కడుపునొప్పి ఉందని చెప్పింది. మాత్రలు తీసుకుందామని మిగిలిన ఐదుగురితో కలసి తేరుబజారుకు వెళ్తుండగా రెండు ఆటోల్లో దుండగులు వచ్చారు. విద్యార్థినులను బలవంతంగా ఆటోల్లోకి ఎక్కించారు. అరిస్తే చంపేస్తామని బెదిరించారు. వారంతా తలకు మంకీ క్యాప్‌లు ధరించారని విద్యార్థినులు చెపుతున్నారు. ఫర్జానా ఆటోలో నుంచి దూకి పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులకు సమాచారం అందించింది. ఆటోల్లో ఉన్న ఐదుగురు విద్యార్థినులను దుండగులు బ్లేడ్లతో గాయపరిచి, వదిలివెళ్లినట్లు చెబుతున్నారు. గాయపడిన విద్యార్థినులు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. ఈ సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు పెద్దసంఖ్యలో పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. సదరు విద్యార్థినులను ఎస్ఐ మధుసూదన్‌రావు విచారణ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, సీపీఐ రాష్ట్ర నాయకుడు రామచంద్రయ్య పోలీస్‌స్టేషన్‌కు వచ్చి విద్యార్థినులను పరామర్శించారు. సీఐ విక్రంసింహా, ఎస్ఐ మధుసూదన్‌రావు విద్యార్థినులు, తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులను వేర్వేరుగా విచారణ చేస్తున్నారు. -
నైజీరియాలోనూ ఒక పూనమ్ పాండే ఉందండోయ్!
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే బీడీ కాల్చుకునేందుకు బోలెడంత నిప్పు దొరికిందన్నాడట ఒకడు. సరిగ్గా అలాంటి పనే చేసింది ఓ నైజీరియన్ పాప్ సింగర్. ప్రస్తుతం నైజీరియాలో అల్ కాయిదా అనుబంధ ఉగ్రవాద సంస్థ బోకో హరామ్ 276 మంది విద్యార్థినులను కిడ్నాప్ చేసింది. ఇది ఏప్రిల్ 14 న జరిగింది. ఆడపిల్లలు చదువుకోవడం మత విరుద్ధమన్నదే బోకోహరామ్ వాదన. అయితే బందీలుగా ఉన్న ఆ విద్యార్థినుల కోసం అన్వేషణ జరుగుతోంది. ఈ సంక్షోభం సాయంతో సులువుగా ప్రచారం పొందవచ్చుననుకుంది నైజీరియన్ పాప్ సింగర్ అడోకియే. 'ఉగ్రవాదులారా... ఆ పిల్లల్ని వదిలిపెట్టండి. మీకు కావాలంటే నన్ను తీసుకెళ్లండి. నా కన్యత్వం మీకు సమర్పించుకుంటా' అని ఓ ఆఫర్ ఇచ్చేసింది. 'వారంతా చిన్నపిల్లలు, నాకు అనుభవం ఉంది. నన్ను రోజుకు 12 మంది అనుభవించినా నాకు పరవాలేదు' అని పేర్కొంది ఆ అమ్మడు. బోకో హరామ్ అడోకియే ఆఫర్ ని తీసుకున్నా తీసుకోకపోయినా అమ్మడికి మాత్రం బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది.