నైజీరియాలోనూ ఒక పూనమ్ పాండే ఉందండోయ్! | pop singer offers herself to Boko Haram | Sakshi
Sakshi News home page

నైజీరియాలోనూ ఒక పూనమ్ పాండే ఉందండోయ్!

Published Fri, Jun 27 2014 4:38 PM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM

నైజీరియాలోనూ ఒక పూనమ్ పాండే ఉందండోయ్!

నైజీరియాలోనూ ఒక పూనమ్ పాండే ఉందండోయ్!

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే బీడీ కాల్చుకునేందుకు బోలెడంత నిప్పు దొరికిందన్నాడట ఒకడు. సరిగ్గా అలాంటి పనే చేసింది ఓ నైజీరియన్ పాప్ సింగర్.


ప్రస్తుతం నైజీరియాలో అల్ కాయిదా అనుబంధ ఉగ్రవాద సంస్థ బోకో హరామ్ 276 మంది విద్యార్థినులను కిడ్నాప్ చేసింది. ఇది ఏప్రిల్ 14 న జరిగింది. ఆడపిల్లలు చదువుకోవడం మత విరుద్ధమన్నదే బోకోహరామ్ వాదన. అయితే బందీలుగా ఉన్న ఆ విద్యార్థినుల కోసం అన్వేషణ జరుగుతోంది.


ఈ సంక్షోభం సాయంతో సులువుగా ప్రచారం పొందవచ్చుననుకుంది నైజీరియన్ పాప్ సింగర్ అడోకియే. 'ఉగ్రవాదులారా... ఆ పిల్లల్ని వదిలిపెట్టండి. మీకు కావాలంటే నన్ను తీసుకెళ్లండి. నా కన్యత్వం మీకు సమర్పించుకుంటా' అని ఓ ఆఫర్ ఇచ్చేసింది. 'వారంతా చిన్నపిల్లలు, నాకు అనుభవం ఉంది. నన్ను రోజుకు 12 మంది అనుభవించినా నాకు పరవాలేదు' అని పేర్కొంది ఆ అమ్మడు.


బోకో హరామ్ అడోకియే ఆఫర్ ని తీసుకున్నా తీసుకోకపోయినా అమ్మడికి మాత్రం బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement