శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష విరాళం
ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్ట్‌కు ఆదివారం ఓ భక్తుడు రూ.1,01,116ను విరాళంగా అందజేశారు. తాడేపల్లిగూడెం మండలం నీలాద్రిపురానికి చెందిన వీవీ రామకృష్ణారావు, లక్ష్మీకాంతమ్మ దంపతులు ముందుగా చినవెంకన్న, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం విరాళాన్ని ఆలయ కార్యాలయంలో అందజేశారు. ఆలయ ఏఈవో కర్రా శ్రీనివాసరావు దాతలను అభినందించి విరాళం బాండ్ అందజేశారు.