GK - Current Affairs
-
మహారాష్ర్ట నూతన ముఖ్యమంత్రి ఎవరు?
1. 2014 సంవత్సరానికి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుకు ఎంపికైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైద రాబాద్‌కు చెందిన శాస్త్రవేత్త? 1) ఎస్. ప్రభాకర్ 2) ఎం.శ్రీధర్ 3) ఎస్. వెంకట మోహన్ 4) టి. వెంకటేశ్వర్ రావు 2. 2014 నవంబర్ 2న 56 బంతుల్లో సెంచరీ సాధించి టెస్టుల్లో వేగవంతమైన సెంచరీ రికార్డును సమం చేసిన పాకిస్థాన్ బ్యాట్స్ మన్? 1) యూనిస్‌ఖాన్ 2) మిస్బా ఉల్ హక్ 3) అజహర్ అలీ 4) షాహిద్ అఫ్రిదీ 3. 2014 నవంబర్ 1 నుంచి ఏటీఎంల ఉచిత లావాదేవీలపై పరిమితిని ఎన్ని మెట్రో నగరాల్లో విధించారు? 1) 4 2) 5 3) 6 4) 8 4. 2014 అక్టోబర్ 31న మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? 1) ఏక్నాథ్ ఖాడ్సే 2) ప్రకాశ్ మెహతా 3) చంద్రకాంత్ పాటిల్ 4) దేవేంద్ర ఫడ్నవిస్ 5. ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మిం టన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు? (ఫైనల్ గుజరాత్లో 2014 నవంబర్ 2న జరిగింది) 1) రుత్విక శివానీ 2) రితుపర్ణ దాస్ 3) మేఘన 4) మనీషా 6. 2014 నవంబర్ 2న న్యూఢిల్లీలో నిర్వహించిన పోటీలో దులీప్ ట్రోఫీ క్రికెట్‌ను కైవసం చేసుకున్న జట్టు? 1) సౌత్ జోన్ 2) సెంట్రల్ జోన్ 3) నార్త జోన్ 4) వెస్ట్ జోన్ 7. 2014 పారిస్ మాస్టర్స సిరీస్ టెన్నిస్ టైటిల్ ను ఎవరు సాధించారు? 1) మిలోస్ రావ్‌నిక్ 2) రోజర్ ఫెదరర్ 3) నొవాక్ జొకోవిచ్ 4) డేవిడ్ ఫై్ 8. 2014 నవంబర్ 7 నుంచి 28 వరకు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను ఏ దేశంలో నిర్వహించనున్నారు? 1) భారత్ 2) నార్వే 3) బల్గేరియా 4) రష్యా 9. ఇటీవల మరణించిన గ్యారీ బెకర్ ఏ దేశానికి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త? 1) జర్మనీ 2) ఫ్రాన్స 3) అమెరికా 4) కెనడా 10. ‘రీ డిజైనింగ్ ది ఏరోప్లేన్ వైల్ ఫ్లైయింగ్ - రిఫార్మింగ్ ఇన్‌స్టిట్యూషన్‌స’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? 1) అరుణ్ మైరా 2) సంజయ్ బారు 3) పి.సి. పారఖ్ 4) ఎ.జి. నూరానీ 11. భారతదేశంలో బ్యాంకుల బోర్డుల పాలన తీరును సమీక్షించాల్సిందిగా కోరుతూ భారతీయ రిజర్వు బ్యాంకు నియమించిన కమిటీకి అధ్యక్షత వహించింది? 1) నచికేత్ మోర్ 2) పి.జె. నాయక్ 3) ఆనంద్ సిన్హా 4) శ్యామలా గోపినాథ్ 12. ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక దళానికి సారథ్యం వహించిన తొలి మహిళ ఎవరు? 1) వఫా ఖలేద్ మౌమార్ 2) క్రిస్టీన్ లండ్ 3) లక్ష్మీ పూరి 4) నికోల్ కిడ్మన్ 13. సండే టైమ్స్ యూకే సూపర్ రిచ్ వార్షిక జాబితా ప్రకారం బ్రిటన్ సంపన్నుల జాబి తాలో అగ్రస్థానం సాధించింది? 1) హిందూజా సోదరులు 2) లక్ష్మీ మిట్టల్ 3) లార్డ స్వరాజ్ పాల్ 4) ప్రకాశ్ లోహియా 14. సండే టైమ్స్ యూకే సూపర్ రిచ్ వార్షిక జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యధి కంగా బిలియనీర్లు ఉన్న నగరం? 1) మాస్కో 2) న్యూయార్క 3) శాన్ఫ్రాన్సిస్కో 4) లండన్ 15. ఫోర్బ్స మ్యాగజైన్ రూపొందించిన ప్రపం చంలోనే అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన అంటీలియా ఎవరి నివాస గృహం? 1) బిల్ గేట్స్ 2) లక్ష్మీ మిట్టల్ 3) ముకేష్ అంబానీ 4) లిల్లీ సాఫ్రా 16. హాకీలో భారత్ ఇప్పటివరకు ఒకే ఒక్కసారి ప్రపంచకప్ గెలిచింది. ఏ సంవత్సరంలో ఈ ఘనత సాధించింది? 1) 1975 2) 1979 3) 1983 4) 2010 17. {పపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన యాంబియెంట్ ఎయిర్ పొల్యూషన్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ఎక్కువ వాయు కాలుష్య నగరం? 1) బీజింగ్ 2) హాంగ్‌కాంగ్ 3) షాంఘై 4) ఢిల్లీ 18. జల్లికట్టు అనే ఎద్దుల క్రీడను ఇటీవల సుప్రీంకోర్టు నిషేధించింది. ఇది ఏ రాష్ట్రంలో సంప్రదాయిక క్రీడ? 1) కర్ణాటక 2) మహారాష్ట్ర 3) తమిళనాడు 4) ఆంధ్రప్రదేశ్ 19. చెన్నై రైలు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన అమ్మాయి పేరు మీద దక్షిణ రైల్వే ఏటా ఏ రోజున ‘స్వాతి డే’గా జరపాలని తల పెట్టింది? 1) మే నెల తొలి పనిదినం 2) జూన్ తొలి పనిదినం 3) మే ఒకటో తేదీ 4) జూన్ ఒకటో తేదీ 20. 2014 మే 13న దక్షిణ మధ్య రైల్వే మొట్ట మొదటి డబుల్ డెక్కర్ రైలును ఏ స్టేషన్ల మధ్య ప్రారంభించింది? 1) సికింద్రాబాద్ - విశాఖపట్నం 2) కాచిగూడ - గుంటూరు 3) కాచిగూడ - తిరుపతి 4) సికింద్రాబాద్ - వరంగల్ 21. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బియాండ్ విజువల్ రేంజ్ (బీవీ ఆర్) గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించే క్షిపణి? 1) అస్త్ర 2) ఆకాశ్ 3) అగ్ని - 1 4) అగ్ని - 5 22. కేంద్ర జలసంఘం (సెంట్రల్ వాటర్ కమి షన్) చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితు లయ్యారు? 1) సి.కె. అగర్వాల్ 2) ఎ.బి. పాండ్య 3) ఎ. మహేంద్రన్ 4) నరేంద్ర కుమార్ 23. లంచాలు స్వీకరించాడన్న ఆరోపణలతో జైలుశిక్ష అనుభవిస్తున్న ఇజ్రాయెల్ మాజీ ప్రధాని? 1) యూరీ ఓర్బాచ్ 2) యాకోవ్ పెరీ 3) ఎయిర్ షమీర్ 4) ఎహుద్ అల్మర్ట 24. {పపంచంలో కెల్లా ఎత్తయిన ఆకాశ సౌధం ‘కింగ్డమ్ టవర్’ను ఏ దేశంలో నిర్మిస్తున్నారు? 1) యూకే 2) యూఎస్ఏ 3) సౌదీ అరేబియా 4) యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ 25. 2014 వరల్డ్ టీమ్ టేబుల్ టెన్నిస్ ఛాంపి యన్‌షిప్‌లో పురుషుల టైటిల్‌ను ఏ దేశం సాధించింది? 1) చైనా 2) జర్మనీ 3) జపాన్ 4) ఆస్ట్రియా 26. ప్రణాళికా సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1) 1952 2) 1951 3) 1950 4) 1949 27. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? 1) వియన్నా 2) రోమ్ 3) జెనీవా 4) వాషింగ్టన్ డీసీ 28. ‘క్యాడ్డీ’ అనే పదాన్ని ఏ క్రీడలో ఉపయో గిస్తారు? 1) బిలియర్డ్స 2) గోల్ఫ్ 3) ఫుట్‌బాల్ 4) వాలీబాల్ 29. {పపంచకప్ పురుషుల హాకీ పోటీలను 2018 లో ఏ దేశం నిర్వహిస్తుంది? 1) నెదర్లాండ్స 2) ఆస్ట్రేలియా 3) భారత్ 4) మలేషియా 30. రెండు వరుస పార్లమెంట్ సమావేశాల మధ్య విరామ సమయం ఎన్ని నెలలకు మించకూడదు? 1) 3 2) 6 3) 4 4) 2 31. {Mొయేషియా దేశ రాజధాని? 1) బెల్గ్రేడ్ 2) ప్రేగ్ 3) జాగ్రెబ్ 4) రీగా 32. భారత రాజ్యాంగంలోని ఏప్రకరణ జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తోంది? 1) 360 2) 370 3) 365 4) 330 33. అచానక్మర్ శాంక్చ్యురీ ఏ రాష్ట్రంలో ఉంది? 1) మధ్యప్రదేశ్ 2) ఒడిషా 3) ఉత్తరప్రదేశ్ 4) ఛత్తీస్‌గఢ్ 34. గోల్డెన్ రెవల్యూషన్ దేనికి సంబంధిం చింది? 1) పండ్ల ఉత్పత్తి 2) కోడిగుడ్ల ఉత్పత్తి 3) మాంసం ఉత్పత్తి 4) ఎరువుల ఉత్పత్తి 35. జాతీయ ఐక్యతా దినంగా ఏ రోజును పాటిస్తారు? 1) అక్టోబర్ 30 2) అక్టోబర్ 24 3) అక్టోబర్ 31 4) అక్టోబర్ 28 సమాధానాలు 1) 3; 2) 2; 3) 3; 4) 4; 5) 1; 6) 2; 7) 3; 8) 4; 9) 3; 10) 1; 11) 2; 12) 2; 13) 1; 14) 4; 15) 3; 16) 1; 17) 4; 18) 3; 19) 1; 20) 2; 21) 1; 22) 2; 23) 4; 24) 3; 25) 1; 26) 3; 27) 4; 28) 2; 29) 3; 30) 2; 31) 3; 32) 2; 33) 4; 34) 1; 35) 3. -
‘హమ్ హై దేశ్ కే రక్షక్’ గీత రచయిత?
జీకే - కరెంట్ అఫైర్స్ 1. సెప్టెంబర్ 9వ తేదీని హిమాలయ దివస్‌గా ఏ రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది? ఎ) జమ్మూ కాశ్మీర్ బి) ఉత్తర ప్రదేశ్ సి) అరుణాచల్ ప్రదేశ్ డి) ఉత్తరాఖండ్ 2. యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను ఎవరు సాధించారు? ఎ) కరోలిన్ వోజ్నియాకి బి) లీనా సి) మరియా షరపోవా డి) సెరెనా విలియమ్స్ 3. భారత సంతతి రచయిత నీల్ ముఖర్జీ రచించిన ఏ పుస్తకం మ్యాన్ బుకర్ బహుమతి-2014కి సంబంధించి తుది జాబితాకు ఎంపికైంది? ఎ) ది నేరో రోడ్ టు ద డీప్ నార్త బి) ఎ లైఫ్ అపార్ట సి) ద లైవ్స ఆఫ్ అదర్స డి) టు లైవ్స 4. 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధిం చిన భారత తొలి అథ్లెట్ ఎవరు? ఎ) సుశీల్ కుమార్ బి) యోగేశ్వర్ దత్ సి) అభినవ్ బింద్రా డి) జీతురాయ్ 5. 2014 యూఎస్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు సాధించారు? ఎ) రోజర్ ఫెదరర్ బి) కీ నిషికోరి సి) మారిన్ సిలిక్ డి) నొవాక్ జకోవిచ్ 6. 2014 సెప్టెంబర్ 5న భారతదేశంతోపాటు పౌర అణు ఒప్పందంపై సంతకం చేసిన దేశం? ఎ) జపాన్ బి) ఆస్ట్రేలియా సి) బ్రెజిల్ డి) దక్షిణాఫ్రికా 7. 86వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ విదేశీ చిత్రంగా ఎంపికైన ‘ది గ్రేట్ బ్యూటీ’ ఏ దేశానికి చెందింది? ఎ) ఫ్రాన్స బి) జర్మనీ సి) ఇటలీ డి) స్పెయిన్ 8. నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఎ) ఇమ్రాన్ ఖాన్ బి) షేక్ హసీనా సి) ఖలీదా జియా డి) ఆంగ్‌సాన్ సూకీ 9. టూట్సీలు, హుటూలు ఏ దేశంలో రెండు ప్రధాన తెగలు? ఎ) రువాండా బి) కెన్యా సి) సోమాలియా డి) ఇథియోపియా 10. 2014 మార్చిలో వికలాంగుల కోసం నిర్వ హించిన వింటర్ పారాలింపిక్స్‌లో ఏ దేశం అత్యధిక పతకాలు సాధించింది? ఎ) ఉక్రెయిన్ బి) జర్మనీ సి) కెనడా డి) రష్యా 11. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట పునర్వ్యవస్థీకరణ బిల్లు -2014, రాజ్యసభలో ఆమోదం పొందిన తేది? ఎ) ఫిబ్రవరి 18 బి) ఫిబ్రవరి 19 సి) ఫిబ్రవరి 20 డి) ఫిబ్రవరి 21 12. ఇటీవల మరణించిన బంగారు లక్ష్మణ్ ఏ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు? ఎ) జనతాదళ్ (యునెటైడ్) బి) జనతాదళ్ (సెక్యులర్) సి) సమాజ్‌వాదీ పార్టీ డి) భారతీయ జనతా పార్టీ 13. దుబాయ్‌లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ క్రికెట్‌ను ఏ దేశం గెలుచుకుంది? ఎ) దక్షిణాఫ్రికా బి) పాకిస్తాన్ సి) ఆస్ట్రేలియా డి) భారత్ 14. శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులను ఏ రంగంలో ఇస్తారు? ఎ) సాహిత్యం బి) సంగీతం సి) శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాలు డి) చలనచిత్రాలు 15. 2014 ఫిబ్రవరిలో బయో ఏషియా అంత ర్జాతీయ సదస్సు ఏ నగరంలో జరిగింది? ఎ) బెంగళూరు బి) చెన్నై సి) కోల్‌కతా డి) హైదరాబాద్ 16. భారతదేశంలో తొలి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స బ్యాంక్ ఏటీఎంను 2014 ఫిబ్రవరి 27న ఏ నగరంలో ప్రారంభించారు? ఎ) హైదరాబాద్ బి) ఢిల్లీ సి) చెన్నై డి) ముంబై 17. ఫార్చూన్ మ్యాగజీన్ రూపొందించిన ప్రపంచ అత్యంత ప్రశంసనీయ కంపెనీల జాబితాలో చోటు దక్కించుకున్న భారతీయ కంపెనీ? ఎ) టాటా స్టీల్ బి) ఓఎన్జీసీ సి) ఐఓసీ డి) ఎ, బి 18. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిబంధనలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి? ఎ) ఏప్రిల్ 1, 2014 బి) జూన్ 1, 2014 సి) జూలై 1, 2014 డి) పైవేవీ కాదు 19. ఏ అధికరణను ఉపయోగించి రాష్ర్టపతి పాలనను విధిస్తారు? ఎ) ఆర్టికల్ 352 బి) ఆర్టికల్ 354 సి) ఆర్టికల్ 356 డి) ఆర్టికల్ 358 20. హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) చైర్పర్సన్, మేనే జింగ్ డెరైక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన మహిళ? ఎ) ఉషా థొరాట్ బి) నిషీ వాసుదేవ సి) శ్యామలా గోపీనాథ్ డి) పైవారెవరూ కాదు 21. అణుధార్మికతను కనుగొన్న శాస్త్రవేత్త? ఎ) జేమ్స్ చాడ్విక్ బి) జె.జె. థామ్సన్ సి) హెన్రీ బెక్వెరెల్ డి) రూథర్ ఫర్డ 22. బోడోలాండ్ ప్రత్యేక రాష్ర్ట ఏర్పాటు సాధ్యా సాధ్యాలపై ఏర్పాటు చేసిన కమిటీకి నాయకత్వం వహించింది? ఎ) జీకే పిళ్లై బి) ఆర్కే సింగ్ సి) అనిల్ గోస్వామి డి) శశికాంత్ శర్మ 23. కేంద్ర పారా మిలటరీ బలగాల (సీఆర్పీ ఎఫ్) సేవలను కొనియాడుతూ రాసిన ‘హమ్‌హై దేశ్ కే రక్షక్’ గీత రచయిత? ఎ) గుల్జార్ బి) జావేద్ అక్తర్ సి) ప్రసూన్ జోషి డి) గోవింద్ మిశ్రా 24. 2014 ఫిబ్రవరిలో లండన్‌లో విడుదలైన నివేదిక ప్రకారం భారతదేశ అత్యంత విలువైన బ్రాండ్? ఎ) టాటా గ్రూప్ బి) ఎస్బీఐ సి) ఎయిర్టెల్ డి) రిలయన్స ఇండస్ట్రీస్ 25. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) మాజీ డెరైక్టర్ జనరల్ రాజీవ్ ప్రస్తుతం ఏ పదవిలో కొనసాగుతున్నారు? ఎ) సీబీఐ డెరైక్టర్ బి) చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషర్ సి) విజిలెన్స కమిషనర్ డి) ఏదీకాదు 26. జలియన్ వాలాబాగ్ దుర్ఘటన ఏ సంవ త్సరంలో జరిగింది? ఎ) 1911 బి) 1913 సి) 1921 డి) 1919 27. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్, బెంగళూరు గవర్నర్ల బోర్డ చైర్ పర్సన్‌గా నియమితురాలైన తొలి మహిళ? ఎ) నీతా అంబానీ బి) ఇంద్ర నూయీ సి) చందా కొచ్చార్ డి) కిరణ్ మంజుదార్ షా 28. {పముఖ హిందీ రచయిత అమర్‌కాంత్ ఇటీవల మరణించారు. ఆయనకు జ్ఞానపీఠ్ అవార్డు ఏ సంవత్సరంలో లభించింది? ఎ) 2009 బి) 2007 సి) 2001 డి) 2004 29. ఇటీవల మరణించిన సిల్వరిన్ స్వేర్ ఏ రాష్ర్టం నుంచి పద్మశ్రీ అవార్డును పొందిన తొలి మహిళ? ఎ) అసోం బి) మేఘాలయ సి) నాగాలాండ్ డి) మణిపూర్ 30. డాక్టర్ యలవర్తి నాయుడమ్మ పురస్కారం- 2013 ఎవరికి లభించింది? ఎ) వీకే సారస్వత్ బి) అవినాష్ చందర్ సి) జయంత్ విష్ణు నార్లికర్ డి) కె. రాధాకృష్ణన్ 31. ఏడో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్ ఎవరు? ఎ) గౌతమ్ గంభీర్ బి) దినేష్ కార్తీక్ సి) వీరేంద్ర సెహ్వాగ్ డి) యువరాజ్ సింగ్ 32. ఇండోర్ పోల్‌వాల్ట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన రేనాడ్ లావ్లెనీ ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు? ఎ) ఉక్రెయిన్ బి) రష్యా సి) ఫ్రాన్స డి) స్పెయిన్ 33. మీటింగ్స విత్ రిమార్కబుల్ ఉమెన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఎ) ఎ.జి. నూరాని బి) కరణ్ సింగ్ సి) నీనా వ్యాస్ డి) నట్వర్ సింగ్ 34. వైశాల్యంలో అతి చిన్న దేశం? ఎ) తువాలు బి) నౌరు సి) మొనాకో డి) వాటికన్‌సిటీ 35. 12వ పంచవర్ష ప్రణాళికా కాలం? ఎ) 2010-15 బి) 2011-16 సి) 2012-17 డి) 2013-18 36. 2014 మార్చిలో బిమ్స్టెక్ దేశాల సమా వేశం ఏ దేశంలో జరిగింది? ఎ) భారత్ బి) థాయిలాండ్ సి) మయన్మార్ డి) శ్రీలంక 37. 69వ సంతోష్ ట్రోఫీ ఫుట్‌బాల్ చాంపి యన్‌షిప్‌ను గెలుచుకున్న జట్టు? ఎ) మిజోరాం బి) రైల్వేస్ సి) కేరళ డి) సర్వీసెస్ 38. 2014 టెంపుల్టన్ ప్రైజ్ విజేత థామస్ హాలిక్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? ఎ) చెక్ రిపబ్లిక్ బి) కెనడా సి) యూకే డి) దక్షిణాఫ్రికా 39. జకార్తా ఏ దేశానికి రాజధాని? ఎ) ఫిలిప్పైన్‌స బి) ఇండోనేషియా సి) మలేషియా డి) థాయిలాండ్ 40. ఏ బ్యాంకును గతంలో ఇంపీరియల్ బ్యాం క్ అని పిలిచేవారు? ఎ) ఆర్బీఐ బి) ఎస్బీహెచ్ సి) ఎస్బీఐ డి) బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాధానాలు 1) డి; 2) డి; 3) సి; 4) డి; 5) సి; 6) బి; 7) సి; 8) డి; 9) ఎ; 10) డి; 11) సి; 12) డి; 13) ఎ; 14) సి; 15) డి; 16) సి; 17) డి; 18) ఎ; 19) సి; 20) బి; 21) సి; 22) ఎ; 23) బి; 24) ఎ; 25) సి; 26) డి; 27) డి; 28) ఎ; 29) బి; 30) సి; 31) డి; 32) సి; 33) బి; 34) డి; 35) సి; 36) సి; 37) ఎ; 38) ఎ; 39) బి; 40) సి. బ్రిక్స్ ఆరో సమావేశం బ్రెజిల్‌లోని ఫోర్తలేజా నగరంలో 2014 జూలై 14, 15 తేదీల్లో ఆరో బ్రిక్స్ సదస్సును నిర్వహించారు. దీనికి బ్రెజిల్ అధ్యక్షురాలు డిల్మా రోసెఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్రమోడీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్ జుమా హాజరయ్యారు. వీరితోపాటు అర్జెంటీనా అధ్యక్షురాలు క్రిస్టినా ఫెర్నాండెజ్ డి కిర్చనర్ కూడా పాల్గొన్నారు. ఈ సదస్సులో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ)ను చైనాలోని షాంగైలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికయ్యే 100 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఐదు దేశాలు సమానంగా భరిస్తాయి. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధులకు ప్రత్యామ్నాయంగా ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మౌలిక వసతులను అభివృద్ధి చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ బ్యాంకు మొదటి అధ్యక్షుడిని భారత్ నుంచి నియమిస్తారు. గవర్నర్ల బోర్డు తొలి చైర్మన్‌గా రష్యా దేశస్థుడిని నియమిస్తారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గలో ఆఫ్రికన్ రీజినల్ సెంటర్‌ను నెలకొల్పుతారు. మరో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో రిజర్వ కరెన్సీ పూల్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. బ్రిక్స్ గురించి సంక్షిప్తంగా.. ప్రఖ్యాత బ్రిటిష్ ఆర్థికవేత్త జిమ్ ఓ నీల్ బ్రిక్ (ఆఖఐఇ) అనే పదాన్ని 2001లో ప్రవేశ పెట్టాడు. గోల్డ్‌మన్ శాక్స్ కంపెనీకి చెందిన ఆయన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలను కొత్తగా అభివృద్ధి చెందిన దేశాలుగా అభివర్ణించాడు. 2050 సంవత్సరానికి ఈ నాలుగు దేశాలు అత్యంత శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థలుగా రూపొందుతాయని అయన పేర్కొన్నారు. ఈ నాలుగు దేశాలు జనాభాలో అతిపెద్ద దేశాలు. బ్రిక్ మొదటి సదస్సు 2009 జూన్‌లో రష్యాలోని ఎకాతెరిన్బర్గలో జరిగింది. 2010 డిసెంబర్లో ఈ కూటమిలో ఐదో సభ్య దేశంగా దక్షిణాఫ్రికా చేరింది. అప్పటి నుంచి ఈ కూటమిని బ్రిక్స్ (ఆఖఐఇ)గా వ్యవహరి స్తున్నారు. 2011 బ్రిక్స్ సమావేశంలో మొదటి సారి పూర్తి సభ్యదేశంగా దక్షిణాఫ్రికా పాల్గొంది. -
బీఎస్ఎఫ్ నూతన డెరైక్టర్ జనరల్?
ఫారెస్ట్ ఆఫీసర్స్ జీకే - కరెంట్ అఫైర్స్ 1. నాగ్‌పూర్‌లో ఇటీవల జరిగిన జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో మహిళల 53 కిలోల విభాగంలో స్వర్ణపతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి? మత్స్య సంతోషి 2. 2014 ఏప్రిల్ 1న భారతీయ రిజర్వ బ్యాంక్ ప్రకటించిన ద్రవ్య పరపతి విధానంలో నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) ని యథాతథంగా ఉంచారు. ప్రస్తుత సీఆర్ఆర్ ఎంత? 4 శాతం 3. పిట్జ్కర్ బహుమతిని ఏ రంగంలో కృషి చేసిన వారికి ప్రదానం చేస్తారు? ఆర్కిటెక్చర్ 4. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) నూతన డెరైక్టర్ జనరల్‌గా 2014 ఏప్రిల్‌లో ఎవరు నియమితులయ్యారు? డి. కె. పాఠక్ 5. 2014 మార్చిలో మూడో అణు భద్రతా సదస్సును ఎక్కడ నిర్వహించారు? నెదర్లాండ్‌సలోని ద హేగ్‌లో 6. 2014 మార్చిలో రష్యాలో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ విజేత? విశ్వనాథన్ ఆనంద్ 7. రెండో యూత్ ఒలింపిక్స్‌ను 2014 ఆగస్టు 16 నుంచి 28 వరకు ఏ నగరంలో నిర్వహిస్తారు? నాన్జింగ్ (చైనా) 8. 2018 సెప్టెంబరులో మూడో యూత్ ఒలింపిక్స్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి? బ్యూనస్ ఎయిర్స (అర్జెంటీనా రాజధాని) 9. స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారు చేసిన భూగర్భ ఖనిజ వనరులను గుర్తించే హెలికాప్టర్? గరుడ వసుధ 10. 2014 జనవరిలో ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలల్లో ప్రవేశాలు, రుసుములు నిర్ణయించే నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? రాష్ర్ట హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ మోహన్‌రెడ్డి 11. కేంద్రీయ హిందీ సమితి సభ్యుడిగా 2014 జనవరిలో ఎవరిని నియమించారు? యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 12. భారత చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తొలిసారి ఎవరికి ప్రదానం చేశారు? దేవికారాణి రోరిచ్ (1969) 13. 2014 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సేవలు చేసిన 127 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఎంతమంది మహిళలున్నారు? 27 మంది 14. 2014 ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ ఫైనల్లో స్లొవేకియాకు చెందిన డొమినికా సిబుల్కొవాను ఓడించి మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు? లీనా (చైనా). ఇది ఆమెకు తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ 15. హాలీవుడ్ చిత్రం ‘జాయ్‌రైడ్-3’లో గీతాలను పాడిన తెలుగు యువతి? భావనా రెడ్డి 16. అడ్వాన్స న్యూమరికల్ రీసెర్చ అండ్ అనాలిసిస్ గ్రూప్ (అనురాగ్)కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేసిన దేశీయ అత్యాధునిక సూపర్ కంప్యూటర్ పేరు? ధ్రువ - 3 17. 2014 జనవరిలో ప్రతిష్టాత్మకమైన ఫెడరేషన్ కప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను తొలిసారి గెలుచుకున్న జట్టు? చర్చిల్ బ్రదర్స (గోవా) 18. 2014 జనవరిలో బ్యాంకాక్‌లో దుర్మరణం చెందిన టాటా మోటార్స మేనేజింగ్ డెరైక్టర్ ఎవరు? కార్ల స్లిమ్ 19. 2014 జనవరిలో ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టికల్ రీసెర్చ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన తొలి వ్యవసాయ సూపర్ కంప్యూటింగ్ హబ్? అశోక (అడ్వాన్సడ్ సూపర్ కంప్యూటింగ్ హబ్ ఫర్ ఓమిక్స్ నాలెడ్‌జ ఇన్ అగ్రికల్చర్) 20. 65వ గణతంత్ర వేడుకలకు ప్రధాన అతిథిగా ఏ దేశ ప్రధాని హాజరయ్యారు? జపాన్ 21. 65వ గణతంత్ర దినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రేహౌండ్స అధికారి దివంగత కె. ప్రసాద్‌బాబుకు ఏ పురస్కారాన్ని ప్రదానం చేశారు? అశోక్ చక్ర 22. 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న స్టానిస్లాస్ వావ్రింకా ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు? స్విట్జర్లాండ్ 23. స్టానిస్లాస్ వావ్రింకా 2014 ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ ఫైనల్ పోటీలో ఎవరిని ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు? రఫెల్ నాదల్ (స్పెయిన్) 24. 2014 జనవరిలో లక్నోలో జరిగిన సయ్యద్ మోడీ ఇండియా గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో మహిళల సింగిల్స్ విజేతగా నిలిచిన సైనా నెహ్వాల్ ఫైనల్లో ఎవరిని ఓడించింది? పి.వి.సింధు 25. సయ్యద్ మోడీ ఇండియా గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల విభాగంలో చైనా ఆటగాడు జూ సంగ్ ఎవరిని ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు? కిదాంబి శ్రీకాంత్ (ఆంధ్రప్రదేశ్) 26. {బిటన్లో 500 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో వీఎస్ నైపాల్ కూడా ఉన్నారు. ఆయన ఎవరు? భారత మూలాలు ఉన్న రచయిత, 2001లో నోబెల్ సాహిత్య బహుమతి విజేత 27. బి.సి.రాయ్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? ఫుట్‌బాల్ 28. 2014 జనవరిలో గ్రామీ సంగీత అవార్డుల్లో ఐదు అవార్డులను గెల్చుకున్న సంగీత జోడీ? డాఫ్ట్ పంక్ (ఫ్రాన్స) 29. కిమ్ జోంగ్ ఉన్ ఏ దేశానికి అధిపతి? ఉత్తర కొరియా 30. 2014 జనవరిలో నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఎక్కడ ప్రారంభించారు? న్యూ ఢిల్లీ 31. ఫార్చ్యూన్ మేగజీన్ అమెరికాలో పని చేయడానికి అనువైన 100 కంపెనీల జాబితాను 2014 జనవరిలో రూపొందించింది. ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్న కంపెనీ? గూగుల్ 32. ‘బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట 2014’ నివేదిక ప్రకారం భారత్‌లో అత్యంత విశ్వసనీయ బ్రాండ్? శామ్సంగ్ 33. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఏ దేశం రూ. 1336 కోట్ల రుణాన్ని ఇవ్వనుంది? జపాన్ 34. 2014 జనవరిలో టునీషియా నూతన ప్రధాన మంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? మెహ్దీ జోమా 35. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో వెచ్చిస్తాయి? 65 : 35 36. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అంపైర్ ప్యానెల్లో స్థానం లభించిన తొలి మహిళ? క్యాతీ క్రాస్ (న్యూజిలాండ్) 37. 2014 జనవరిలో గూగుల్ నుంచి మోటరోలా కంపెనీని కొనుగోలు చేసిన సంస్థ? చైనాకు చెందిన లెనోవో 38. 2014 ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స ఇండెక్స్ (ఈపీఐ)లో భారతదేశ ర్యాంక్? 155 39. 178 దేశాల జాబితాలో తయారైన 2014 ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స ఇండెక్స్‌లో అగ్రస్థానంలో ఉన్న దేశం? స్విట్జర్లాండ్ 40. ప్రపంచ ఉక్కు అసోసియేషన్ (డబ్ల్యూఎస్‌ఏ) గణాంకాల ప్రకారం 2013లో ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో భారత్ స్థానం? నాలుగో స్థానం 41. 2013 సంవత్సరానికి ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిన దేశం? చైనా (779 మిలియన్ టన్నులు) 42. 59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపికైనవారు? దీపికా పదుకొనే (గోలియోం కీ రాస్ లీలా రామ్‌లీలా) 43. 2014 రాబర్ట ఫోస్టర్ చెర్రీ అవార్డ ఫర్ గ్రేట్ టీచింగ్‌కు ఎంపికైన భారత - అమెరికన్ ప్రొఫెసర్? మీరా చంద్రశేఖర్ 44. 2014 జనవరి 20న బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైంది? అఖిలేష్ దాస్ గుప్తా 45. 59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నవారు? రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా (భాగ్ మి ల్కా భాగ్) 46. 2014 జనవరిలో ఐబీఎంకు చెందిన దిగువ శ్రేణి సర్వర్ బిజినెస్‌ను 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంస్థ? లెనోవో (చైనా) 47. 2014 జనవరి 28న మైకోలా అజరోవ్ ఏ దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు? ఉక్రెయిన్ 48. 2013లో 9.98 మిలియన్ వాహనాలను విక్రయించి ప్రపంచ అగ్రశ్రేణి వాహన కంపెనీగా అవతరించిన సంస్థ? టయోటా (జపాన్) 49. సంస్థల కేటగిరీలో 2013 సంవత్సరానికి జాతీయ మత సామరస్య అవార్డుకు ఎంపికైంది? సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ సెక్యులరిజమ్ (సీఎస్ఎస్ఎస్). ఇది ముంబైలో ఉంది 50. 2014 ఆథ్‌మర్ గోల్డ్‌మెడల్ పురస్కారానికి ఎంపికైన భారతీయ మహిళా వ్యాపారవేత్త? బయోకాన్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కిరణ్ మజుమ్దార్ షా 51. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలోని సభ్యదేశాల సంఖ్య? 15 52. ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? రోమ్ (ఇటలీ) 53. 16వ లోక్‌సభకు పోటీలో ఉన్న రాజ్‌వర్దన్ సింగ్ రాథోర్ ఏ క్రీడలో 2004 ఏథెన్‌స ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు? షూటింగ్ 54. బంగ్లాదేశ్ కరెన్సీ? టాకా 55. బ్రిటిష్ రాణి అధికారిక నివాస భవనాన్ని ఏమంటారు? బకింగ్ హామ్ ప్యాలెస్ 56. స్లోవేకియా దేశ రాజధాని? బ్రటిస్లావా 57. వైట్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? బెల్గ్రేడ్ (సెర్బియా దేశ రాజధాని) 58. జపాన్ పార్లమెంట్‌ను ఏమంటారు? డైట్ 59. మెసపొటేమియా ఏ దేశానికి పాత పేరు? ఇరాక్ 60. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరం ఏ నదీ తీరాన ఉంది? డెలావేర్ 61. కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? ఆదిలాబాద్ 62. 1952 నుంచి 1956 వరకు లోక్‌సభకు ప్రథమ స్పీకర్‌గా వ్యవహరించినవారు? గణేశ్ వాసుదేవ్ మౌలాంకర్ 63. ‘ద ఫాల్ ఆఫ్ ఎ స్పారో’ ఎవరి ఆత్మకథ? సలీమ్ అలీ (ప్రఖ్యాత ఆర్నిథాలజిస్ట్) 64. పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారు? సెరికల్చర్ 65. జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు? జనవరి 24 66. పంజాబ్‌లోని టోన్యాలో ర్యాన్‌బాక్సీ కంపెనీకి ఉన్న యూనిట్లో తయారయ్యే ముడి ఔషధాన్ని తమ దేశంలో విక్రయించరాదని 2014 జనవరిలో ఆదేశాలు జారీ చేసిన దేశం? అమెరికా 67. భారతదేశ తొలి మూకీ చలన చిత్రం రాజా హరిశ్చంద్ర ఎప్పుడు విడుదలైంది? 1913 మే 3న 68. యక్షగానం ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్య ప్రదర్శన? కర్ణాటక