బీఎస్‌ఎఫ్ నూతన డెరైక్టర్ జనరల్? | Forest Officers GK - Current Affairs | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎఫ్ నూతన డెరైక్టర్ జనరల్?

Published Mon, Apr 7 2014 10:33 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

బీఎస్‌ఎఫ్ నూతన డెరైక్టర్ జనరల్? - Sakshi

బీఎస్‌ఎఫ్ నూతన డెరైక్టర్ జనరల్?

ఫారెస్ట్ ఆఫీసర్స్ జీకే - కరెంట్ అఫైర్స్
 1.    నాగ్‌పూర్‌లో ఇటీవల జరిగిన జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో మహిళల 53 కిలోల విభాగంలో స్వర్ణపతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి?
     మత్స్య సంతోషి

2.    2014 ఏప్రిల్ 1న భారతీయ రిజర్‌‌వ బ్యాంక్ ప్రకటించిన ద్రవ్య పరపతి విధానంలో నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్) ని యథాతథంగా ఉంచారు. ప్రస్తుత సీఆర్‌ఆర్ ఎంత?
     4 శాతం

 3.    పిట్జ్‌కర్ బహుమతిని ఏ రంగంలో కృషి చేసిన వారికి ప్రదానం చేస్తారు?
     ఆర్కిటెక్చర్

 4.    సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) నూతన డెరైక్టర్ జనరల్‌గా 2014 ఏప్రిల్‌లో ఎవరు నియమితులయ్యారు?
     డి. కె. పాఠక్

 5.    2014 మార్చిలో మూడో అణు భద్రతా సదస్సును ఎక్కడ నిర్వహించారు?
     నెదర్లాండ్‌‌సలోని ద హేగ్‌లో

 6.    2014 మార్చిలో రష్యాలో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ విజేత?
     విశ్వనాథన్ ఆనంద్

 7.    రెండో యూత్ ఒలింపిక్స్‌ను 2014 ఆగస్టు 16 నుంచి 28 వరకు ఏ నగరంలో నిర్వహిస్తారు?
     నాన్‌జింగ్ (చైనా)

 8.    2018 సెప్టెంబరులో మూడో యూత్ ఒలింపిక్స్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి?
     బ్యూనస్ ఎయిర్‌‌స
     (అర్జెంటీనా రాజధాని)

 9.    స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) తయారు చేసిన భూగర్భ ఖనిజ వనరులను గుర్తించే హెలికాప్టర్?
     గరుడ వసుధ

 10.    2014 జనవరిలో ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలల్లో ప్రవేశాలు, రుసుములు నిర్ణయించే నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
     రాష్ర్ట హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ మోహన్‌రెడ్డి

 11.    కేంద్రీయ హిందీ సమితి సభ్యుడిగా 2014 జనవరిలో ఎవరిని నియమించారు?
     యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

 12.    భారత చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తొలిసారి ఎవరికి ప్రదానం చేశారు?
     దేవికారాణి రోరిచ్ (1969)

 13.    2014 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సేవలు చేసిన 127 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఎంతమంది మహిళలున్నారు?
     27 మంది

 14.    2014 ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ ఫైనల్‌లో స్లొవేకియాకు చెందిన డొమినికా సిబుల్కొవాను ఓడించి మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
     లీనా (చైనా). ఇది ఆమెకు తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్

 15.    హాలీవుడ్ చిత్రం ‘జాయ్‌రైడ్-3’లో గీతాలను పాడిన తెలుగు యువతి?
     భావనా రెడ్డి

 16.    అడ్వాన్‌‌స న్యూమరికల్ రీసెర్‌‌చ అండ్ అనాలిసిస్ గ్రూప్ (అనురాగ్)కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేసిన దేశీయ అత్యాధునిక సూపర్ కంప్యూటర్ పేరు?
     ధ్రువ - 3

 17.    2014 జనవరిలో ప్రతిష్టాత్మకమైన ఫెడరేషన్ కప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను తొలిసారి గెలుచుకున్న జట్టు?
     చర్చిల్ బ్రదర్‌‌స (గోవా)

 18.    2014 జనవరిలో బ్యాంకాక్‌లో దుర్మరణం చెందిన టాటా మోటార్‌‌స మేనేజింగ్ డెరైక్టర్ ఎవరు?
     కార్‌‌ల స్లిమ్

 19.    2014 జనవరిలో ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టికల్ రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన తొలి వ్యవసాయ సూపర్ కంప్యూటింగ్ హబ్?
     అశోక (అడ్వాన్‌‌సడ్ సూపర్ కంప్యూటింగ్ హబ్ ఫర్ ఓమిక్స్ నాలెడ్‌‌జ ఇన్ అగ్రికల్చర్)

 20.    65వ గణతంత్ర వేడుకలకు ప్రధాన అతిథిగా ఏ దేశ ప్రధాని హాజరయ్యారు?
     జపాన్

 21.    65వ గణతంత్ర దినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రేహౌండ్‌‌స అధికారి దివంగత కె. ప్రసాద్‌బాబుకు ఏ పురస్కారాన్ని ప్రదానం చేశారు?
     అశోక్ చక్ర

 22.    2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న స్టానిస్లాస్ వావ్రింకా ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు?
     స్విట్జర్లాండ్

 23.    స్టానిస్లాస్ వావ్రింకా 2014 ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ ఫైనల్ పోటీలో ఎవరిని ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు?
     రఫెల్ నాదల్ (స్పెయిన్)

 24.    2014 జనవరిలో లక్నోలో జరిగిన సయ్యద్ మోడీ ఇండియా గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో మహిళల సింగిల్స్ విజేతగా నిలిచిన సైనా నెహ్వాల్ ఫైనల్లో ఎవరిని ఓడించింది?
     పి.వి.సింధు

 25.    సయ్యద్ మోడీ ఇండియా గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల విభాగంలో చైనా ఆటగాడు జూ సంగ్ ఎవరిని ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు?
     కిదాంబి శ్రీకాంత్ (ఆంధ్రప్రదేశ్)

 26.    {బిటన్‌లో 500 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో వీఎస్ నైపాల్ కూడా ఉన్నారు. ఆయన ఎవరు?
     భారత మూలాలు ఉన్న రచయిత,
 2001లో నోబెల్ సాహిత్య బహుమతి విజేత

 27.    బి.సి.రాయ్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది?
     ఫుట్‌బాల్

 28.    2014 జనవరిలో గ్రామీ సంగీత అవార్డుల్లో ఐదు అవార్డులను గెల్చుకున్న సంగీత జోడీ?
     డాఫ్ట్ పంక్ (ఫ్రాన్‌‌స)

 29.    కిమ్ జోంగ్ ఉన్ ఏ దేశానికి అధిపతి?
     ఉత్తర కొరియా

 30.    2014 జనవరిలో నేషనల్ వక్ఫ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఎక్కడ ప్రారంభించారు?
     న్యూ ఢిల్లీ

 31.    ఫార్చ్యూన్ మేగజీన్  అమెరికాలో పని చేయడానికి అనువైన 100 కంపెనీల జాబితాను
 2014 జనవరిలో రూపొందించింది. ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్న కంపెనీ?
     గూగుల్

 32.    ‘బ్రాండ్ ట్రస్ట్ రిపోర్‌‌ట 2014’ నివేదిక ప్రకారం భారత్‌లో అత్యంత విశ్వసనీయ బ్రాండ్?
     శామ్‌సంగ్

 33.    హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఏ దేశం రూ. 1336 కోట్ల రుణాన్ని ఇవ్వనుంది?
     జపాన్

 34.    2014 జనవరిలో టునీషియా నూతన ప్రధాన మంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
     మెహ్‌దీ జోమా

 35.    రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో వెచ్చిస్తాయి?
     65 : 35

 36.    అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అంపైర్ ప్యానెల్‌లో స్థానం లభించిన తొలి మహిళ?
     క్యాతీ క్రాస్ (న్యూజిలాండ్)

 37.    2014 జనవరిలో గూగుల్ నుంచి మోటరోలా కంపెనీని కొనుగోలు చేసిన సంస్థ?
     చైనాకు చెందిన లెనోవో

 38.    2014 ఎన్విరాన్‌మెంటల్ పర్‌ఫార్మెన్‌‌స ఇండెక్స్ (ఈపీఐ)లో భారతదేశ ర్యాంక్?
     155

 39.    178 దేశాల జాబితాలో తయారైన 2014 ఎన్విరాన్‌మెంటల్ పర్‌ఫార్మెన్‌‌స
      ఇండెక్స్‌లో అగ్రస్థానంలో ఉన్న దేశం?
     స్విట్జర్లాండ్

 40.  ప్రపంచ ఉక్కు అసోసియేషన్ (డబ్ల్యూఎస్‌ఏ) గణాంకాల ప్రకారం 2013లో ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో భారత్ స్థానం?
     నాలుగో స్థానం

 41. 2013 సంవత్సరానికి ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
     చైనా (779 మిలియన్ టన్నులు)

42.    59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపికైనవారు?
     దీపికా పదుకొనే (గోలియోం కీ రాస్ లీలా రామ్‌లీలా)

43.    2014 రాబర్‌‌ట ఫోస్టర్ చెర్రీ అవార్‌‌డ ఫర్ గ్రేట్ టీచింగ్‌కు ఎంపికైన భారత - అమెరికన్ ప్రొఫెసర్?
     మీరా చంద్రశేఖర్

 44.    2014 జనవరి 20న బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైంది?
     అఖిలేష్ దాస్ గుప్తా

 45.    59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నవారు?
     రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా
     (భాగ్ మి ల్కా భాగ్)

 46.    2014 జనవరిలో ఐబీఎంకు చెందిన దిగువ శ్రేణి సర్వర్ బిజినెస్‌ను 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంస్థ?
     లెనోవో (చైనా)

 47.    2014 జనవరి 28న మైకోలా అజరోవ్ ఏ దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు?
     ఉక్రెయిన్

 48.    2013లో 9.98 మిలియన్ వాహనాలను విక్రయించి ప్రపంచ అగ్రశ్రేణి వాహన కంపెనీగా అవతరించిన సంస్థ?
     టయోటా (జపాన్)

 49.    సంస్థల కేటగిరీలో 2013 సంవత్సరానికి జాతీయ మత సామరస్య అవార్డుకు ఎంపికైంది?
     సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ సెక్యులరిజమ్ (సీఎస్‌ఎస్‌ఎస్). ఇది ముంబైలో ఉంది

 50.    2014 ఆథ్‌మర్ గోల్డ్‌మెడల్ పురస్కారానికి ఎంపికైన భారతీయ మహిళా వ్యాపారవేత్త?
     బయోకాన్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కిరణ్ మజుమ్‌దార్ షా

 51.    ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలోని సభ్యదేశాల సంఖ్య?
     15

 52.    ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ప్రధాన కార్యాలయం ఎక్కడుంది?
     రోమ్ (ఇటలీ)

 53.    16వ లోక్‌సభకు పోటీలో ఉన్న రాజ్‌వర్దన్ సింగ్ రాథోర్ ఏ క్రీడలో 2004 ఏథెన్‌‌స ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు?
     షూటింగ్

 54.    బంగ్లాదేశ్ కరెన్సీ?
     టాకా

 55.    బ్రిటిష్ రాణి అధికారిక నివాస భవనాన్ని ఏమంటారు?
     బకింగ్ హామ్ ప్యాలెస్

 56.    స్లోవేకియా దేశ రాజధాని?
     బ్రటిస్లావా

 57.    వైట్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
     బెల్‌గ్రేడ్ (సెర్బియా దేశ రాజధాని)

 58.    జపాన్ పార్లమెంట్‌ను ఏమంటారు?
     డైట్
 59.    మెసపొటేమియా ఏ దేశానికి పాత పేరు?
     ఇరాక్

 60.    అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరం ఏ నదీ తీరాన ఉంది?
     డెలావేర్

 61.    కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది?
     ఆదిలాబాద్

 62.    1952 నుంచి 1956 వరకు లోక్‌సభకు ప్రథమ స్పీకర్‌గా వ్యవహరించినవారు?
     గణేశ్ వాసుదేవ్ మౌలాంకర్

 63.    ‘ద ఫాల్ ఆఫ్ ఎ స్పారో’ ఎవరి ఆత్మకథ?
     సలీమ్ అలీ (ప్రఖ్యాత ఆర్నిథాలజిస్ట్)

 64.    పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారు?
     సెరికల్చర్

 65.    జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు?
     జనవరి 24

 66.    పంజాబ్‌లోని టోన్యాలో ర్యాన్‌బాక్సీ కంపెనీకి ఉన్న యూనిట్లో తయారయ్యే ముడి ఔషధాన్ని తమ దేశంలో విక్రయించరాదని 2014 జనవరిలో ఆదేశాలు జారీ చేసిన దేశం?
     అమెరికా

 67. భారతదేశ తొలి మూకీ చలన చిత్రం రాజా హరిశ్చంద్ర ఎప్పుడు విడుదలైంది?
     1913 మే 3న

 68. యక్షగానం ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్య ప్రదర్శన?
     కర్ణాటక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement