G.kisan
-
సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
దేవునూరు, ముప్పారం గ్రామాల్లో కలెక్టర్, జేసీ పర్యటన టెక్స్టైల్ పార్కుకు స్థల పరిశీలన ధర్మసాగర్ : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మండలంలోని దేవునూరు, ముప్పారం శివారు అటవీ భూములను బుధవారం కలెక్టర్ జి.కిషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా సుమారు మూడు కిలోమీటర్లమేర కాలిన నడకన అడవిలో జేసీ పౌసుమిబసు, ఇతర రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నడస్తూ భూములను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దేవునూరు, ముప్పారం శివారులో సుమారు 1500 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఈ భూములతోపాటు జిల్లాలోని జాగారం, తాటికొండ, జనగాం, తాటికొండ తదితర ప్రాంతాల్లో కూడా భూములను పరిశీలించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. భూముల సమగ్ర సర్వే అనంతరం పారిశ్రామికశాఖ వారు కూడా భూములను పరిశీలించి టెక్స్టైల్ పార్క్‌కు అనువైన స్థలాన్ని ఎంపిక చేస్తారని కలెక్టర్ వివరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధు, ఎమ్మార్వో రవిచంద్రారెడ్డి, డీఎఫ్ఓ గంగారెడ్డి, డీడీఎఫ్ఓ ఆంజనేయులు, జెడ్పీటీసీ సభ్యుడు కీర్తి వెంకటేశ్వర్లు, పీఏసీఎస్ చైర్మన్ వీరన్న, దేవునూరు, ముప్పారం సర్పంచ్‌లు రాజేంద్ర, వెంకట్రాజం, ఎంపీటీసీ విజయ్‌కుమార్ పాల్గొన్నారు. రాంపూర్ టూ.. ధర్మారం రోడ్డు సర్వే.. గీసుకొండ : సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆర్అండ్ బీ అధికారులు కదిలారు. వరంగల్ నగరంలో ప్రధాన రహదారిగా ఉన్న రాంపూర్ నుంచి గీసుకొండ మండలం ధర్మారం కోటగండి వరకు 30 కిలోమీటర్ల ప్రధాన రహదారిని సర్వే చేసే పనులను బుధవారం ప్రారంభించారు. ఈ రహదారిని 150 అడుగులకు నిర్మించాలని సీఎం రెండు రోజుల క్రితం జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా అధికారులను ఆదేశించారు. దీంతో సర్వే పనులను మొదలుపెట్టారు. అలాగే మండలంలోని వరంగల్-నర్సంపేట రహదారి కోటగండి వద్దకు వచ్చే ఔటర్ రింగ్‌రోడ్డు వంచనగిరి చెరువు కట్టమీదుగా కోట వెంకటాపురం, బొల్లికుంట మీదుగా ఖమ్మం రోడ్డుకు చేరేలా డిజైన్ రూపొందించారు. ఈ ఔటర్‌రింగ్ రోడ్డుకు అనుసంధానంగా నగరం నుంచి కోటగండి వరకు 150 అడుగుల రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు రూపొందించారు. -
డిసెంబర్ 27 నుంచి కాకతీయ ఉత్సవాలు
హన్మకొండ అర్బన్ (వరంగల్): వచ్చే నెల 27, 28, 29వ తేదీల్లో కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చిందని వరంగల్ జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. కాకతీయ ఉత్సవాలపై హన్మకొండ లోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం ఆయన ముందస్తు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ కాకతీయ సామ్రాజ్యం విస్తరించి ఉన్న తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్షిం చేందుకు ప్రభుత్వం శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.మధ్యాహ్నం 12గంట లకు ప్రారంభమయ్యే సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు కేవీ.రమణాచారి, పాపారావు, టూరిజం, కల్చరల్ సెక్రటరీ బీపీ.ఆచార్య, సమా చార శాఖ కమిషనర్ చంద్రవదన్, శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్‌రావు ఇతర ఉన్నతాధి కారులు హాజరుకానున్నట్లు వివరించారు. వరంగల్ జిల్లాలోని రామప్ప, గణపురం, ఖిలా వరం గల్, వేయిస్తంభాల ఆలయంతోపాటు నల్లగొండ జిల్లా పొనగల్లు, ఖమ్మం జిల్లా పెర్టు, మెదక్ జిల్లా కోలచలను, హైదరాబాద్‌లోని లలిత కళాతోరణం, కరీంనగర్‌లోని ఎలగందుల పోర్టు, రంగారెడ్డిలోని అనంతగిరి, ఆదిలాబాద్‌లోని గాంధారికోట, మహబూబ్‌నగర్‌లోని అలం పూర్, నిజామాబాద్‌లోని డిచ్పల్లి ప్రదేశాల్లో నిర్వహించాలని ప్రతిపాదనలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. -
రుణ మాఫీకి అడుగులు
ప్రక్రియ ప్రారంభించిన యంత్రాంగం మాఫీ కానున్న రుణాలు రూ.1656 కోట్లు లబ్ధిపొందనున్న 3.19 లక్షల మంది రైతులు ఈ నెల 26లోపు అర్హుల ముసాయిదా జాబితా 27 నుంచి 29 వరకు అభ్యంతరాల స్వీకరణ 30న తుది జాబితా వెల్లడి ఒక కుటుంబానికి వడ్డీతో కలిపి గరిష్టంగా లక్ష రూపాయలు మాఫీ మార్గదర్శకాలను వివరించిన కలెక్టర్ కిషన్ సాక్షిప్రతినిధి, వరంగల్ : ప్రాథమిక అంచనాల ప్రకారం.. పంట రుణాల మాఫీకి అర్హత పొందే రైతులు జిల్లాలో 3.19 లక్షలు ఉన్నట్లు కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. రూ.1656 కోట్ల పంట రుణాలు మాఫీ అయ్యే అవకాశం ఉందని చెప్పారు. మొత్తం రుణాల్లో రూ.1396 కోట్లు పంట రుణాలుగా.. రూ.260 కోట్లు బంగారు ఆభరణాలపై పంట రుణాలు ఉన్నాయని తెలిపారు. తుది జాబితా వచ్చాక దీంట్లో మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. పంట రుణాల మాఫీపై రాష్ట్ర ఉన్నతాధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. తర్వాత బ్యాంకర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులతో జిల్లా కలెక్టర్ జి.కిషన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం రుణమాఫీపై విలేకరుల సమావేశం నిర్వహించారు. పంట రుణాల మాఫీ ప్రక్రియను ఈ నెల 31తో ముగించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో వ్యవసాయ రుణ మాఫీకి అర్హులైన వారి జాబితాను ఈ నెల 30లోగా పూర్తి చేయనున్నామని, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్గదర్శకాలకు అనుగుణంగా రుణ మాఫీ ప్రక్రియ చేపడుతున్నట్లు తెలిపారు. 2014 మార్చి 31 వరకు రైతులు తీసుకున్న లక్ష రూపాయలలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 వరకు వడ్డీతో కలిపి ఒక కుటుంబానికి గరిష్టంగా లక్ష రూపాయలు మాఫీ చేయనున్నట్లు తెలిపారు. 2014 మార్చి 31 వరకే ప్రభుత్వం వడ్డీని పరిగణనలోకి తీసుకుంటుందని చెప్పారు. ఈ ఏడాది మార్చి 31 తర్వాత రుణాలు చెల్లిస్తే.. వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. రుణమాఫీ అర్హత పొందేందుకు ఏం చేయాలనే విషయంపై రైతులు సంబంధిత బ్యాంకు శాఖలను సంప్రదించాలని సూచించారు. పంట రుణాల మాఫీ ప్రక్రియకు ఏ, బీ, సీ, డీ నమూనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఫార్మాట్-ఏలో భాగంగా మార్చి 31, 2014 వరకు స్పల్పకాలిక పంట రుణాలు పొందిన రైతుల వివరాలను గ్రామాల వారీగా సేకరిస్తారు. ఫార్మాట్-బీలో గ్రామాల వారీగా 2014, మార్చి 31 వరకు బంగారు ఆభరణాలపై రైతులు తీసుకున్న స్పల్పకాలిక పంట రుణాల వివరాలను గ్రామాల వారీగా సేకరిస్తారు. ఫార్మాట్-సీలో భాగంగా.. ఏ, బీ ఫార్మాట్లతో వచ్చిన జాబితా ఆధారంగా ఒక్కొక్క కుటుంబానికి రూ.లక్ష రుణ పరిమితి విధిస్తూ మరో జాబితా రూపొందిస్తారు. ఏ, బీ, సీ ఫార్మాట్లను ప్రతి బ్యాంకు ఆధికారి ఈ నెల 23లోగా సిద్ధం చేయాలి. ఫార్మాట్-డీలో భాగంగా.. ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకులలో పంట రుణాలు తీసుకున్న రైతుల జాబితాను రూపొందిస్తారు. ఈ జాబితాను ఈ నెల 24 నుంచి 26 వరకు మండల స్థాయి బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించి దీన్ని పూర్తి చేస్తారు. ఈ సమావేశాలకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ప్రత్యేక పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. ఫార్మాట్-ఈలో భాగంగా.. సీ, డీ జాబితాలను పరిశీలించి గ్రామాల వారీగా పంట రుణాల మాఫీకి అర్హులైన రైతుల జాబితాను రూపొందిస్తారు. బ్యాంకుల శాఖల, పంచాయతీ కార్యాలయాల ముందు వీటిని ప్రదర్శిస్తారు. ఈ నెల 27 నుంచి 29 వరకు జాబితాలపై వచ్చే అభ్యంతరాలను స్వీకరిస్తారు. రుణమాఫీకి అర్హులైన రైతుల తుదిజాబితాను రూపొందించి రికార్డు చేస్తారు. పంట రుణాల మాఫీ కోసం ఈ జాబితాలను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితికి పంపిస్తారు. జిల్లా అధికారులతో సమావేశం... జిల్లాలో పంట రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి 3.20 లక్షల బ్యాంకు అకౌంట్లు ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. మండలాల వారీగా నిర్వహించే సమావేశాలకు బ్యాంకుల తరఫున కన్వీనర్లను నియమించాలని జిల్లా లీడ్ బ్యాంకు అధికారిని ఆదేశించారు. మండలానికి ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నోడల్ అధికారిగా నియమిస్తామని ప్రకటించారు. ఒక కుటుంబానికి చెందిన రైతు.. వివిధ బ్యాంకులలో పంట రుణం పొందితే అలాంటి వారిని ఈ సమావేశాల్లో గుర్తించాలని సూచించారు. రైతులకు సంబంధించి రుణ అర్హత కార్డులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఇతర రెవెన్యూ రికార్డులను పరిశీలించాలని ఆర్డీవోలను ఆదేశించారు. 2010 సెప్టెంబరు 10 నుంచి 2014 మే వరకు ప్రకృతి విపత్తులతో జిల్లాలో పంట నష్టపోయిన 1.55 లక్షల మంది రైతులకు రూ.53,45 కోట్ల పెట్టుబడి రాయితీని ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. 61,012 హెక్టారలో జరిగిన పంట నష్టాలకు సంబంధించిన ఈ మొత్తాలను అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయనున్నట్లు ఆయన వివరించారు. -
సామాన్య రైతు ముంగిట్లో సూక్ష్మ సేద్యం
పథ కం అమలులో పలు మార్పులు నేటి నుంచి 14 తేదీ వరకు ఎంపీపీ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ హన్మకొండ సిటీ : సూక్ష్మ సేద్యం పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలనే ఉద్ధేశంతో తెలంగాణ రాష్ట్ర సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టు(టీఎస్ ఎంఐపీ) విభాగం పలు మార్పు లు చేసింది. ఇప్పటి వరకు మైక్రో కంపెనీలు దరఖాస్తులు తీసుకునేవి. రైతులు నేరుగా ఎంఐపీ కార్యాలయాల్లో అందిం చే వారు. ఈ పద్ధతిలో మార్పు చేసి మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించడం ద్వారా సామా న్య, పేద రైతులు పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కలెక్టర్ జి.కిషన్, టీఎస్ ఎంఐపీ అధికారులు నూతన పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు ఎంపీడీఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఆగస్టు 1 నుంచి 14వ తేదీ వరకు సూక్ష్మ సేద్యం పథకం దరఖాస్తులను ఎంపీపీ కార్యాలయాల్లో స్వీకరిస్తారు. ఇందుకుగాను ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తారు. సూక్ష్మ సేద్యం పథకం కింద 2014-15 సంవత్సరానికి జిల్లాలో 5370 హెక్టార్లలో బిందు, తుపంర్ల సేద్యం చేపట్టాలని టీఎస్ ఎంఐపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 4500 హెక్టార్లలో డ్రిప్(బిందు), 870 హెక్టార్లలో స్ప్రింక్లర్(తుంపర్లు) పరికరాలు ఇవ్వాలని ప్రణాళిక రూపొందిం చిం ది. రైతులు పొందిన పరికరాలు బిగించింది లేనిది ఉద్యానవన, వ్యవసాయ శాఖల అధికారులకు(మండల కోఆర్డినేటింగ్ ఆఫీసర్లు) అప్పగించారు. ఇవీ నిబంధనలు సాగు భూమి, నీటి వసతి, విద్యుత్ సౌకర్యం కలిగి ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. ఒక సారి లబ్ధి పొందిన రైతులు పది సంవత్సరాల వరకు తిరిగి రాయితీ పొందేందు కు అర్హులు కారు. పండ్లు, కూరగాయలు, పత్తి, మిర్చి, మొక్కజొన్న, పుసుపు, వేరుశనగ, మల్బరీ తోటలు పెంచే రైతులు పథకాన్ని వినియోగించుకోవచ్చు. బిందు, తుంపర్ల పరికరాలు పొందేందుకు జిల్లాలో 20 కంపెనీలను గుర్తించా రు. రైతు తనకు నచ్చిన ఏవేని మూడు కంపెనీల పేర్లు ప్రాధాన్యతాక్రమంలో దరఖాస్తులో తెలపాల్సి ఉంటుంది. బయోటెక్నాలజీస్, బంగారు ఇరిగేషన్, ఈపీసీ, ఫినోలెక్స్, గోదావరి, హరిత, జైన్, జాన్‌డీర్, కోటారి, క్రితి, కుమార్, నాగార్జున, నంది ఇరిగేషన్, నంది ప్లాస్టిక్, నెటాఫిమ్, సింజెంట, రుంగ్టా, హార్వెల్, పారిక్జిట్, ప్రీమియర్ కంపెనీలు డ్రిప్, స్ప్రంక్లర్ పరికారాలను అందించనున్నాయి. రాయితీ వివరాలు ఈ పథకం కింద ప్రభుత్వం రైతులకు రూ.లక్షకు మించకుండా రాయితీ అందిస్తుంది. బిందు సేద్యానికి ఐదు ఎకరాలలోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం, సన్న చిన్నకారు రైతులకు 90శాతం, ఐదు నుంచి పది ఎకారల రైతుకు 75శాతం, పది ఎకరాల పైన భూమి కలిగిన రైతులకు 60శాతం రాయితీ ఇస్తుంది. పరికరాల విలువ రూ.లక్ష దాటిన రైతులకు 12.5 ఎకరాల వరకు 40 శాతం రాయితీ లభిస్తుంది. తుంపర్లకు హెక్టార్‌కు యూనిట్ విలువ రూ.19,600 చొప్పున అన్ని వర్గాల రైతులకు 50 శాతం రాయితీ కింద ఇస్తున్నారు. రైతులు దరఖాస్తుతోపాటు తహసీల్దార్, ఉప తహసీల్దార్ ధ్రువీకరించిన భూమి యాజమాన్యం హక్కుపత్రం లేదా మీసేవ ద్వారా పొందిన ఫారం-1బి, వీఆర్ఓ ధ్రువీకరించిన సర్వే నంబర్ కలిగిన నక్ష, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు, గుర్తింపు కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్, కుల ధ్రువీకరణ పత్రం, విద్యుత్ కనెక్షన్ న ంబర్ ప్రతులు జతపరచాల్సి ఉంటుంది. ముందుగా వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఎంపీపీ కార్యాలయంలో స్వీకరించిన దరఖాస్తులను టీఎస్ ఎంఐపీ కార్యాలయంలో సీనియారిటీ ప్రకారం జాబితా తయారు చేస్తాం. ఆ జాబితాను మండలాల వారీగా విభజించి పరిశీలన అనంతరం ఆయా గ్రామాలకు పంపిస్తాం. పంచాయతీ కార్యదర్శి కన్వీనర్‌గా గ్రామసభ నిర్వహించి జాబితాకు సభ ఆమోదం తీసుకోవాలి. తుది జాబితా కలెక్టర్ ఆమోదం పొందిన తరువాత రైతులకు పరికరాలు మంజూరు చేయబడతాయి. ముందు గా దరఖాస్తు చేసుకున్న రైతులకు ముందు మంజూరు చేస్తాం. ఇందుకుగాను దరఖాస్తుల స్వీకరణ సమయం, తేదీని ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చే స్తారు. -సునీత, టీఎస్ ఎంఐపీ పీడీ