Glamour field
-
సమస్యలున్నాయని పారిపోతామా...
‘డాటరాఫ్ అశ్వినీదత్’ అనే ట్యాగ్ నా సినిమా ఇండస్ట్రీ ఎంట్రీకి మంచి బాట అయ్యింది. కానీ, నాదైన ప్రత్యేకతను చాటుకోకపోతే నిలదొక్కుకోవడం కష్టం. అందుకే, నా పని నేను శ్రద్ధగా చేసుకుంటాను. నిర్మాణ రంగంలో ఆడవాళ్లు తక్కువ ఉన్నారన్నది వాస్తవమే. కానీ, గత పదేళ్లతో పోల్చితే ఇప్పుడు మంచి మార్పు వస్తోంది. తెర వెనుక ఉన్న శాఖల్లో చాలామంది ఆడవాళ్లు ఉన్నారు. నేను తీసిన ‘ఎవడే సుబ్రమణ్యం’కి పని చేసిన టెక్నీషియన్స్‌లో నలభై శాతం మంది ఆడవాళ్లే ఉన్నారు. ఆడవాళ్లు కారు డ్రైవ్ చేసినా, స్కూటర్ నడిపినా ‘ఆ... ఏం చేస్తుందిలే’ అనే రోజులు పోయాయి. ఇప్పుడు మగవాళ్లు కూడా ఆడవాళ్లను ఎంకరేజ్ చేస్తున్నారు. అఫ్కోర్స్... మేల్ డామినేషన్ ఉంది. అందుకే, ఆడవాళ్లు కొంచెం ఎగ్రెసివ్‌గా ఉండాలి. నేనంతే! నా పని మీద నాకు పట్టు ఉంది. వృత్తి మీద గౌరవం ఉంది. అందులో సక్సెస్ అవ్వాలంటే స్ట్రాంగ్‌గా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే... నేను కంటిన్యూస్‌గా సినిమాలు నిర్మించడం లేదు కాబట్టి, ‘లేడీ ప్రొడ్యూసర్ కదా... ఇబ్బందిగా ఉందేమో’ అనుకునే అవకాశం ఉంది. నాకెలాంటి ఇబ్బందీ లేదు. మంచి సినిమాలు మాత్రమే తీయాలన్నది నా లక్ష్యం. అందుకే ఈ గ్యాప్. ఇక... మహిళల సమస్యల గురించి చెప్పాలంటే - సినిమా ఇండస్ట్రీ అనే కాదు... కార్పొరేట్ కార్యాలయాల్లో, పాఠశాలల్లో, హాస్పటల్స్‌లో అన్ని చోట్లా ఇబ్బందులుంటాయి. సినిమా అనేది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి, ఇక్కడ ఎక్కువ ఉంటాయనుకుంటారు. కానీ, సమస్యలు ఉన్నాయి కదా అని పారిపోతే ఏమీ సాధించలేం! - స్వప్నాదత్, సినీ నిర్మాత (‘ఓం శాంతి’, ‘బాణం’ చిత్రాల ఫేమ్) -
నో ప్రాబ్లమ్!
గ్లామర్ ఫీల్డ్ అనగానే అందంగా కనిపించేందుకు లెక్కకు మించి జాగ్రత్తలు తీసుకంటారు తారలు. ఇక చిన్నా చితక తేడాలుంటే... వాటికి సర్జరీలని... ఫేషియల్స్ అని... మరేదో అని చేయించేసుకుంటారు. నటీమణులైతే ఈ కేర్ మరీ ఎక్కువగా ఉంటుంది. కానీ... హాలీవుడ్ సుందరి అలీసా మిలనో మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నట్టుంది. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చిన అలీసా... డెలివరీ అనంతరం వచ్చే స్ట్రెచ్ మార్క్స్‌ను కప్పిబుచ్చే ప్రయత్నమేమీ చేయడం లేదు. పైగా... అవంటే తనకెంతో ఇష్టమని తెగేసి చెప్పింది. లేటెస్ట్గా ఈ నలభై రెండేళ్ల అమ్మడు బికినీలో పోజులిచ్చి షాకిచ్చింది. ఓ పక్క సదరు పిక్చర్స్ గ్లోబల్‌గా తెగ పాపులారిటీని తెచ్చేసుకుంటుంటే... మరో వైపు ఆ ‘మార్కులు’ చూసిన సౌందర్యాధకులు ఇదేమిటని ప్రశ్నించారు. వారికిలా జవాబిచ్చిన సెక్సీ తార... అవి తన బ్యూటీ స్పాట్స్ అంటూ మురిపెంగా చెప్పుకొచ్చింది! -
గ్లామర్ ఫీల్డ్ అంటే చిన్నప్పట్నుంచీ క్రేజ్ - ఇషా
సడన్‌గా చూస్తే... ‘మావిచిగురు’ ఫేం రంజితలా అనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు ఇషా. అసలు సిసలైన తెలుగమ్మాయి. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో కె. దామోదరప్రసాద్ నిర్మించిన ‘అంతకు ముందు-ఆ తరువాత’ చిత్రం ద్వారా కథనాయికగా పరిచయం అవుతున్నారీ ముద్దుగుమ్మ. ఈ నెల 23న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు ఈ హైదరాబాదీ భామ. ఫేస్బుక్లో నన్ను చూశారు పుట్టిందీ పెరిగిందీ అంతా హైదరాబాద్‌లోనే. ఎంబీఏ పూర్తి చేశాను. గ్లామర్ ఫీల్డ్ అంటే చిన్నప్పట్నుంచీ క్రేజే. అందుకే చదువు పూర్తవ్వగానే మోడలింగ్‌లోకి వెళ్లా. పలు ప్రముఖ సంస్థలకు సంబంధించిన యాడ్స్‌లో కూడా నటించాను. సినిమాల్లో అవకాశం వస్తే బావుణ్ణు అనుకుంటున్న టైమ్‌లో ఇంద్రగంటి మోహన్కృష్ణగారు నా ఫొటోని ఫేస్బుక్లో చూశారట. వెంటనే ఆడిషన్స్‌కి పిలిపించారు. రెండు వారాలు టెస్ట్ షూట్ చేశారు కూడా. రెండు నెలలు వర్క్‌షాప్ కూడా నిర్వహించారు. తర్వాతే నన్ను ఈ సినిమాకు హీరోయిన్గా సెలక్ట్ చేశారు. అదే నా ఆకాంక్ష మోహన్‌కృష్ణ ఏం చెబితే అది చేశాను. సెట్లో సుమంత్ అశ్విన్ కూడా ఎంతో కోపరేట్ చేశాడు. మధుబాల, రవిబాబు, రోహిణి, రావురమేష్ వంటి సీనియర్ ఆర్టిస్టులతో నటించడం వల్ల వారి నుంచి చాలా నేర్చుకున్నాను. తొలి సినిమాలో నటనకు అవకాశం ఉన్న పాత్ర లభించింది. అందరి సహకారంతో ఎమోషనల్ సీన్స్‌లో రక్తి కట్టించాను. తెలుగమ్మాయిగా మరిన్ని మంచి పాత్రలు చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలనేదే నా ఆకాంక్ష.