Global Actor
-
దీపికాకు గ్లోబల్ అవార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్
బాలీవుడ్లో అందంతోపాటు అభినయం ఉన్న నటి దీపికా పదుకొనే. రణ్వీర్ సింగ్‌తో పెళ్లి తర్వాత కూడా క్రేజీ ఆఫర్లు అందుకుంటూ కెరీర్లో దూసుకుపోతోంది. ‘రామ్‌లీలా’, ‘బాజీరావ్ మస్తానీ’, `పద్మావత్` వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ బ్యూటీ తాజాగా అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ‘ది గ్లోబల్ అచీవర్స్ అవార్డు 2021’ ని దక్కించుకుంది. ఈ అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, చదువు, టూరిజం వంటి వివిధ రంగాల్లో ఈ ఏడాది 3000 వేలపైగా నామినేషన్లు వచ్చాయి. నటనకు సంబంధించి ఉత్తమ నటిగా దీపికా అవార్డు సాధించింది. ఈ అవార్డుకు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, బిజినెస్మెన్ జెఫ్ బెజోస్, క్రీడాకారుడు క్రీస్టీనో రోనాల్డో లాంటి హేమహేమీలతో కలిసి ఎంపికయ్యింది. కాగా ఇండియా నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఇండియన్ దీపికే కావడం విశేషం. అయితే ఈ భామ ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో కలిసి ‘ఫైటర్’, అమితాబ్‌తో కలిసి ‘ది ఇంటర్న్’, తన భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి ‘83’, మరి కొన్నిహాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. చదవండి: ‘గాంధీ’ అంత్యక్రియల సీన్‌కి 4 లక్షల మంది భారతీయులు: హాలీవుడ్ నటుడు -
విశ్వనటుడికి జీవిత సాఫల్య అవార్డు
విశ్వనటుడు కమలహాసన్ అవార్డులకే అలంకారం అనడంలో అతిశయోక్తి కాదేమో. ఇప్పటికే పద్మశ్రీ వంటి జాతీయ అవార్డుతో పాటు పలు విశిష్ట అవార్డులు ఆయన్ని వరించాయి. తాజాగా జీవిత సాఫల్య తమిళర్ అవార్డు పురస్కారం కమలహసన్ కోసం ఎదురు చూస్తోంది. ఆరేళ్లుగా నార్వే చిత్రోత్సవాలు నిర్వహిస్తూ తమిళ కళాకారులతో పాటు, తమిళేతర చిత్ర కళాకారులకు తమిళర్ విరుదు పేరుతో అవార్డులను అందిస్తున్నారు. ఏడో నార్వే తమిళ చిత్రోత్సవ కార్యక్రమం మార్చి 28 నుంచి ఏప్రిల్ ఒకటవ తేదీ వరకూ నార్వేలో నిర్వహించనున్నారు. ఈ చిత్రోత్సవాల్లో పోటీకి నామినేషన్ల గడువు ఈ నెల 15తో ముగియనుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ నెల 25న అవార్డులకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రోత్సవాల్లో తమిళనాడులో నిర్మించిన చిత్రాలతో పాటు తమిళేతర దేశాల్లో రూపొందించిన తమిళ చిత్రాలకు అవార్డులను అందించనున్నట్లు వెల్లడించారు. పూర్తి చిత్రాలతో పాటు లఘు చిత్రాలు, డాక్యుమెంట్ చిత్రాలు, మ్యూజిక్ ఆల్బమ్స్ కేటగిరీల్లో అవార్డు పోటీలు ఉంటాయన్నారు. నార్వే ప్రభుత్వ అంగీకారంతో ఈ చిత్రోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ ఒకటో తేదీన విశ్వనటుడు కమలహాసన్‌ను జీవిత సాఫల్య తమిళర్ బిరుదుతో సత్కరించనున్నట్లు వెల్లడించారు. అలాగే నటుడు ప్రకాశ్‌రాజ్‌కు కలైశిఖరం అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. -
పుకార్లు పట్టించుకోను!
‘బాహుబలి’ తెచ్చిన కొత్త ఊపుతో మిల్కీబ్యూటీ తమన్నా ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నారు. ఈ ఏడాది రానున్న సినిమాలపై బోలెడంత ఆశాభావంతో కనిపిస్తున్నారు. నాగార్జున కీలకపాత్ర ధరిస్తుంటే, కార్తీ సరసన తమన్నా నటిస్తున్న ‘ఊపిరి’ ఈ వేసవికే రానుంది. ‘‘ ‘ఊపిరి’లో నాకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. డబ్బింగ్ చెప్పడం బోలెడంత పెద్ద పని. ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నా’’ అని తమన్నా అన్నారు. ఒకప్పుడు కార్తీతో తమన్నాను జత కట్టి, పుకార్లు వచ్చాయి. మళ్ళీ కార్తీతో జతకట్టడం గురించి అడిగితే, ‘‘పనికిమాలిన పుకార్లు పట్టించుకోను’’ అంటూ, కార్తీతో నటించడం సరదాగా ఉందన్నారు. పది నిమిషాల్లో ఫిక్స్! 2005లో ‘శ్రీ’ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసిన తమన్నా సరిగ్గా పదేళ్ళ కెరీర్ పూర్తయిన వేళ ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ త్రిభాషా చిత్రంలో ప్రభుదేవా పక్కన నటిస్తున్నారు. ‘‘డ్యాన్స్‌లో నేను ఎంతోకాలంగా ఆరాధించే ప్రభుదేవా పక్కన నటించడం, డ్యాన్స్ చేయనుండడం ఉద్విగ్నంగా ఉంది. దర్శకుడు ఎల్. విజయ్ (నటి అమలాపాల్ భర్త) ఈ చిత్రకథ చెప్పడం మొదలుపెట్టిన 10 నిమిషాల కల్లా ఈ సినిమా తప్పకుండా చేయాలని ఫిక్స్ అయిపోయా’’ అని తమన్నా వివరించారు. ఇటీవలే ముంబయ్‌లో షూటింగ్ మొదలైన ఈ సినిమా అందరూ అనుకుంటున్నట్లు ‘హార్రర్’ కాదనీ, ఒక్క క్షణం కూడా నిస్సత్తువగా అనిపించని ‘ఫన్ థ్రిల్లర్’ అనీ ఈ సుందరీమణి చెప్పుకొచ్చారు. ‘గ్లోబల్ యాక్టర్’ అనిపించుకోవాలని... ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమల్లో పనిచేసిన తమన్నా ‘‘ఇవాళ ప్రపంచమే కుగ్రామమైపోయిన వేళ గిరి గీసుకొని ఉండదలుచుకోలేదు. భాష, ప్రాంతం, వయస్సుకు కట్టుబడని గ్లోబల్ యాక్టర్ అనిపించుకోవాలనుంది’’ అని మనసులో మాట బయట పెట్టారు. ‘బాహుబలి’కి ముందు కెరీర్లో కొద్దిగా జోరు తగ్గిన ఈ పంజాబీ అమ్మాయి ‘‘నేను నటించిన సినిమాలు ఆడినా, ఆడకపోయినా, భవిష్యత్తు మీద దృష్టి పెట్టి ముందుకు సాగడం మీదే నా ఆలోచన’’ అని అన్నారు. వైఫల్యాలు వచ్చినా నిరాశతో కుంగిపోకుండా, తదుపరి పని మీద దృష్టి పెట్టాలన్న అమ్మడి సూత్రం నిత్యజీవితంలోనూ అందరికీ పనికొచ్చేదే!