Global Award
-
ప్రపంచ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తొలి భారతీయుడు
ఆర్కె స్వామి హన్సా గ్రూపు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీనివాసన్ కె.స్వామి(సుందర్ స్వామి) ప్రపంచ ప్రతిష్టాత్మక ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డును అందుకున్నారు. మలేషియాలోని పెనాంగ్‌లో జరిగిన 45వ ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్‌లో పెనాంగ్ గవర్నర్ తున్ అహ్మద్ ఫుజి అబ్దుల్ రజాక్ చేతులమీదుగా ఈ అవార్డు తీసుకున్నారు. మార్కెటింగ్, ప్రకటనలు, మీడియా పరిశ్రమలో ప్రపంచ స్థాయిలో గణనీయమైన కృషి చేసిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. అయితే ఒక భారతీయుడుకి ఈ అవార్డు దక్కడం ఇదే తొలిసారి. ఇంతకుముందు ఈ అవార్డును అందుకున్న వారిలో షెల్లీ లాజరస్ (ఛైర్మన్ ఎమెరిటస్, ఓగిల్వీ అండ్ మాథర్), పాల్ పోల్మన్ (సీఈఓ, యూనిలీవర్), పాల్ రోస్సీ (ప్రెసిడెంట్, ఎకనామిస్ట్ గ్రూప్), మార్క్ ప్రిచర్డ్ (చీఫ్ బ్రాండ్ ఆఫీసర్, ప్రాక్టర్ & గాంబుల్), ఆండ్రూ రాబర్ట్సన్ (ప్రెసిడెంట్ & సీఈఓ, బీబీడీఓ) ఉన్నారు. అవార్డు అందుకున్న సందర్భంగా శ్రీనివాసన్ స్వామి మాట్లాడుతూ..తనకు ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందుకు సహకరించిన తన సహచరులు, నిపుణులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. చాలా ఏళ్లపాటు ఆయన తండ్రి దివంగత ఆర్కె.స్వామి అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ అవార్డును తన తండ్రికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. శ్రీనివాసన్ కె.స్వామి ఆర్కె స్వామి లిమిటెడ్ కంపెనీ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్(ఏబీసీ) ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన ఏషియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్స్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్స్ (ఐఏఏ), ఐఏఏ ఇండియా చాప్టర్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అసోసియేషన్స్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్, మద్రాస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మద్రాస్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్‌కు అధ్యక్షుడు/ఛైర్మన్‌గా పనిచేశారు. శ్రీనివాసన్ కె.స్వామి అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి జీవనకాల సాఫల్య అవార్డును అందుకున్నారు. ఇటీవలే ఐపీఓలోకి.. ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సర్వీసెస్ సంస్థ ఆర్కే స్వామి లిమిటెడ్ ఇటీవలే ఐపీఓగా మార్కెట్లోకి రావాలని నిర్ణయించింది. దాంతో నిన్నటితో షేర్ల సబ్స్క్రిప్షన్ ప్రక్రియ ముగిసింది. షేరు ధరల శ్రేణిని కంపెనీ రూ.270-288గా నిర్ణయించింది. గరిష్ఠ ధర వద్ద రూ.423.56 కోట్లు సమీకరించనుంది. రూ.173 కోట్లు విలువ చేసే షేర్లను కొత్తగా జారీ చేస్తున్నారు. రూ.250.56 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద అందుబాటులో ఉంచారు. రిటైల్ మదుపర్లు కనీసం రూ.14,400తో 50 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. మార్చి 12న మార్కెట్ లిస్ట్ అవ్వనుంది. ఇదీ చదవండి: ఫార్చూన్ 500 లీడర్లలో మహిళలు అంతంతే .. ప్రముఖ కంపెనీలకు ఆర్కే స్వామి లిమిటెడ్ క్రియేటివ్ మీడియా, డేటా అనలిటిక్స్, మార్కెట్ రీసెర్చ్ వంటి సేవలను అందిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో తమ క్లయింట్లకు దాదాపు 818 ప్రచార కార్యక్రమాలను రూపొందించింది. 2.37 మిలియన్ల ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఈ ఐపీఓకి లీడ్ మేనేజర్లుగా వ్యవహరించాయి. -
మహిళా దర్శకురాలికి గ్లోబల్ అవార్డులు
సాక్షి, చెన్నై: ఈలం తమిళ కుటుంబానికి చెందిన వర్ధమాన మహిళా దర్శకురాలు బహిని దేవరాజాకు గ్లోబల్ అవార్డులు దక్కాయి. ఈ విషయంపై ఆన్లైన్ వేదికగా మంగళవారం బహిని దేవరాజా మాట్లాడుతూ.. మానసిక ఆరోగ్యం, తల్లిదండ్రులు, సమాజంలో మహిళలకు ఎదురయ్యే పరిణామాలు, తీర్పులు తదితర అంశాల్ని ఇతివృత్తాంతంగా తీసుకుని ఆస్ట్రేలియా వేదికగా 'కన్నీలే ఇరుపతెన్నా..?' అన్న చిత్రాన్ని రూపొందించినట్లు వివరించారు. మెల్బోర్న్లోని భారతీయ సంతతికి చెందినవారితో ఈ చిత్రాన్ని చిత్రీకరించడంతో, నటించినవారందరికీ గ్లోబల్ అవార్డులు దక్కినట్లు తెలిపారు. ప్యారిస్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డు, లండన్ ఐఎంఎఫ్ ఫెస్టివల్, క్రిమ్సన్ హారిజోన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, ఇండో- ఫ్రెంచ్ ఫెస్టివల్, రామేశ్వరం ఫిలిం ఫెస్టివల్, మద్రాసు ఇండిపెండెంట్ ఫిలిం ఫెస్టివల్ తదితర అవార్డులు లభించినట్లు వివరించారు. చదవండి: నయన్ పెళ్లి జీవితంపై ప్రముఖ జ్యోతిష్యుడు ఏమన్నారంటే.. ఓటీటీలోకి అడుగుపెట్టిన సిద్ధార్థ్.. -
దీపికాకు గ్లోబల్ అవార్డు.. ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్
బాలీవుడ్లో అందంతోపాటు అభినయం ఉన్న నటి దీపికా పదుకొనే. రణ్వీర్ సింగ్‌తో పెళ్లి తర్వాత కూడా క్రేజీ ఆఫర్లు అందుకుంటూ కెరీర్లో దూసుకుపోతోంది. ‘రామ్‌లీలా’, ‘బాజీరావ్ మస్తానీ’, `పద్మావత్` వంటి చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ బ్యూటీ తాజాగా అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ‘ది గ్లోబల్ అచీవర్స్ అవార్డు 2021’ ని దక్కించుకుంది. ఈ అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, చదువు, టూరిజం వంటి వివిధ రంగాల్లో ఈ ఏడాది 3000 వేలపైగా నామినేషన్లు వచ్చాయి. నటనకు సంబంధించి ఉత్తమ నటిగా దీపికా అవార్డు సాధించింది. ఈ అవార్డుకు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, బిజినెస్మెన్ జెఫ్ బెజోస్, క్రీడాకారుడు క్రీస్టీనో రోనాల్డో లాంటి హేమహేమీలతో కలిసి ఎంపికయ్యింది. కాగా ఇండియా నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఇండియన్ దీపికే కావడం విశేషం. అయితే ఈ భామ ప్రస్తుతం హృతిక్ రోషన్‌తో కలిసి ‘ఫైటర్’, అమితాబ్‌తో కలిసి ‘ది ఇంటర్న్’, తన భర్త రణ్వీర్ సింగ్‌తో కలిసి ‘83’, మరి కొన్నిహాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. చదవండి: ‘గాంధీ’ అంత్యక్రియల సీన్‌కి 4 లక్షల మంది భారతీయులు: హాలీవుడ్ నటుడు -
శేఖర్.. సూపర్
సంగారెడ్డి అర్బన్: సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌తో పాటు, ఐదు ఆవార్డులు సొంతం చేసుకొని పల్పనూరి శేఖర్ ఆదర్శంగా నిలిచారు. జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి కూత వేటు దూరంలో ఉన్న చిమ్నాపూర్‌లో జన్మించిన శేఖర్ 2002లో అంబేడ్కర్ యువజన సంఘం ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా, అనాథలకు అండగా నిలిచారు. దళితుల సమస్యలపై పోరాటాలు చేశారు. వివిధ సంస్థల్లో పని చేస్తూనే బహుజన భీమ్ సోల్జర్ను ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న దివ్యదిశ అనాథ ఆశ్రమంలో చిన్నారులకు నిత్యావసరాలు, దుస్తులు పంపిణీ, 2007లో నెహ్రూ యువ కేంద్రం సిద్దిపేట కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేశారు. «కంది మండలం ధర్మసాగర్ చెరువులో 360 ఎకరాల దళితులు భూములు కబ్జాకు గురైతే వారి భూములు తిరిగి ఇప్పించడంలో కీలక పాత్ర పొషించారు. క్రైస్తవ జేఏసీ తరపున చర్చిల్లో పలు సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా, నిరుపేదలకు నిత్యావసరాలు, దుస్తులు పంపిణీ చేశారు. హత్నూర మండలంలో ఓ పరిశ్రమ యాజమాన్యం ఇద్దరు మూగ దంపతుల భూమిని కబ్జా చేస్తే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేశారు. 2017లో హైటెన్షన్ వైర్ల భూ బాధితులకు నష్ట పరిహారం ఇప్పించడంలో ఆయన కీలక పాత్ర పొషించారు. ఆపదలో ఉన్న వారికి అండగా.. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా తాను స్వయంగా రక్తదానం చేసి మనవత్వాన్ని చాటుకున్నారు. అపదలో ఉన్నవారికి అండగా నిలువడంతో పాటు కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి సేవలు అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులైన్స్ డ్రైవర్లు హైదరాబాద్‌కు తీసుకెళ్లడానికి డబ్బులు అడగటంతో జెడ్పీ చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. ఆసుపత్రుల్లో మృతిచెందిన బాలింతలు, చిన్నారుల పక్షాన న్యాయ పోరాటాలు చేశారు. గౌరవ డాక్టరేట్, ఐదు అవార్డులు సొంతం.. 18 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గానూ, శేఖర్‌ను గుర్తించి జూన్ 20న అంతర్జాతీయ గ్లోబల్ యునివర్శిటీ చాన్స్‌లర్, ప్రొఫెసర్ల చేతుల మీదుగా కర్ణాటక రాష్ట్రం బెంగుళూర్లో డాక్టరేట్‌ను అందకున్నారు. 2007లో నెహ్రూ యువ కేంద్రం సిద్దిపేట తరపున జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారు. 2014లో బెస్ట్ సోషల్ వర్కర్‌గా ఉమ్మడి మెదక్ జిల్లాలో అప్పటి కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 2015లో ప్రొఫెసర్ జయశంకర్ జాతీయ అవార్డును తీసుకున్నారు. 2016లో అంబేడ్కర్ జాతీయ అవార్డును ఢిల్లీలో సొంతం చేసుకున్నారు. సేవలకు గుర్తింపుగా విశిష్ట సేవరత్న అవార్డును 2019లో తిరుపతిలో అందుకున్నారు. -
ఇస్రోకు ప్రియదర్శిని అకాడమీ ‘గ్లోబల్ అవార్డు’
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు ముంబైకి చెందిన ప్రియదర్శిని అకాడమీ ‘గ్లోబల్ అవార్డు’ను ప్రకటించింది. అంతరిక్ష ప్రయోగాలలో వరుస విజయాలు, ఏడాదికి ఐదారు ప్రయోగాలు, అత్యంత అధునాతనమైన సాంకేతికతను అందిస్తున్న కారణంగా ఇస్రోకు ఈ అవార్డు దక్కింది. ముంబైలో జరిగిన అకాడమీ 32వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. గ్లోబల్ అవార్డు సలహా కమిటీ చైర్మన్ డాక్టర్ ఆర్ఏ మషిల్కర్, ప్రియదర్శిని అకాడమీ చైర్మన్ నిరంజన్ హీరానందిని, అకాడమీ ఎమిరిటస్ నానిక్ రూపాని నుంచి అవార్డును అందుకున్నట్టుగా ఇస్రో ప్రకటించింది. 1961లో ప్రారంభమైన ఇస్రో ప్రస్థానం నేడు సొంతంగా ఉపగ్రహాలు, రాకెట్లు తయారు చేసుకోవడమే కాకుండా విదేశాలకు చెందిన ఉపగ్రహాలను ప్రయోగించే స్థాయికి చేరింది.