సాక్షి, చెన్నై: ఈలం తమిళ కుటుంబానికి చెందిన వర్ధమాన మహిళా దర్శకురాలు బహిని దేవరాజాకు గ్లోబల్ అవార్డులు దక్కాయి. ఈ విషయంపై ఆన్‌లైన్ వేదికగా మంగళవారం బహిని దేవరాజా మాట్లాడుతూ.. మానసిక ఆరోగ్యం, తల్లిదండ్రులు, సమాజంలో మహిళలకు ఎదురయ్యే పరిణామాలు, తీర్పులు తదితర అంశాల్ని ఇతివృత్తాంతంగా తీసుకుని ఆస్ట్రేలియా వేదికగా 'కన్నీలే ఇరుపతెన్నా..?' అన్న చిత్రాన్ని రూపొందించినట్లు వివరించారు.
మెల్‌బోర్న్‌లోని భారతీయ సంతతికి చెందినవారితో ఈ చిత్రాన్ని చిత్రీకరించడంతో, నటించినవారందరికీ గ్లోబల్ అవార్డులు దక్కినట్లు తెలిపారు. ప్యారిస్ ఇంటర్నేషనల్ ఫిలిం అవార్డు, లండన్ ఐఎంఎఫ్ ఫెస్టివల్, క్రిమ్సన్ హారిజోన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, ఇండో- ఫ్రెంచ్ ఫెస్టివల్, రామేశ్వరం ఫిలిం ఫెస్టివల్, మద్రాసు ఇండిపెండెంట్ ఫిలిం ఫెస్టివల్ తదితర అవార్డులు లభించినట్లు వివరించారు.
చదవండి: నయన్ పెళ్లి జీవితంపై ప్రముఖ జ్యోతిష్యుడు ఏమన్నారంటే..
Comments
Please login to add a commentAdd a comment