Global Economic Outlook
-
అమెరికా సుంకాలు ప్రపంచానికే ప్రమాదం
అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచాలనే నిర్ణయం వల్ల ప్రపంచ వృద్ధి ప్రభావం చెందుతుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదిక ప్రకారం, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్య భాగస్వాములు తమ సొంత టారిఫ్‌లను పెంచుతూ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇప్పటికే మందకొడిగా 2.7%గా ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2025లో 0.3 శాతం పడిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.ఇతర దేశాలు అనుసరిస్తే ప్రమాదంఅమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన వివరాల ప్రకారం.. ప్రపంచ దిగుమతులపై 10 శాతం సుంకం, కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనా వస్తువులపై 60 శాతం సుంకాన్ని విధించబోతున్నట్లు సమాచారం. ప్రపంచ స్థూల ఆర్థిక నమూనా ప్రకారం ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రపంచ వృద్ధి 0.3 శాతం తగ్గిపోనుంది. ఇతర దేశాలు కూడా ఇదే పంథాను అనుసరిస్తే మరింత ప్రమాదం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.కుంటుపడనున్న వృద్ధిరేటుఅభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు 2000 సంవత్సరం తర్వాత అత్యంత బలహీనమైన దీర్ఘకాలిక వృద్ధి సమస్యను ఎదుర్కొంటున్నాయని నివేదిక ఎత్తిచూపింది. అధిక రుణ భారాలు, బలహీనమైన పెట్టుబడులు, ఉత్పాదకతలో తగ్గుతున్న వృద్ధి, పెరుగుతున్న వాతావరణ మార్పుల ఖర్చుల కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2025-26 ఏడాదికిగాను వృద్ధి రేటు 4%గా ఉంటుందని అంచనా.ఇదీ చదవండి: భారత్‌లో టాప్ 5 బ్రాండ్ లిస్ట్‌లోకి యాపిల్వచ్చే 25 ఏళ్లు మరిన్ని సవాళ్లుపెట్టుబడులను ప్రోత్సహించడానికి, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి వివిధ దేశాలు మెరుగైన సంస్కరణలను అవలంబించాలని ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్ ఇందర్మిత్ గిల్ నొక్కి చెప్పారు. గత 25 సంవత్సరాలతో పోలిస్తే వచ్చే 25 ఏళ్లు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు కఠినమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. వీటిని తగ్గించుకునేందుకు క్రియాశీల చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ సైతం ప్రపంచ వాణిజ్యంలో పెరుగుతున్న అనిశ్చితుల గురించి హెచ్చరించింది. -
ప్రపంచాన్ని శాసిస్తున్న రంగాలు.. వాటి ఆదాయాలు
ఒకప్పుడు వేలు, లక్షల్లో పెట్టుబడిపెట్టి ప్రారంభించిన కంపెనీలు ప్రపంచంలోనే అత్యున్నత సంస్థలుగా ఎదిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందుతోంది. నిత్యం టెక్నాలజీలో వస్తోన్న మార్పులు, వివిధ దేశాల్లోని ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, యువతలో పెంపొందుతున్న నైపుణ్యాలు, కొత్త ఆవిష్కరణలు..వంటి ఎన్నో కారణాల వల్ల గ్లోబల్ ఎకానమీ దూసుకుపోతోంది. వివిధ రంగాలు వృద్ధిపథంలోకి వెళుతున్నాయి. దాంతో ఆయా రంగాల వార్షిక ఆదాయం క్రమంగా హెచ్చవుతోంది. అందులో ప్రపంచాన్ని శాసిస్తున్న కొన్ని రంగాల గురించి తెలుసుకుందాం.ఇంటర్నెట్ అండ్ డిజిటల్ అడ్వర్టైజింగ్వార్షిక ఆదాయం: రూ.377 లక్షల కోట్లు.ఇంటర్నెట్, ఇ-కామర్స్, క్లౌడ్ సేవలు, డిజిటల్ ప్రకటనలు..వంటి సర్వీసులతో ఈ ఆదాయం సమకూరుతోంది. ఈ రంగంలో గూగుల్(ఆల్ఫాబెట్), ఫేస్బుక్(మెటా), అమెజాన్ వంటి కంపెనీలు సేవలందిస్తున్నాయి.ఈ-కామర్స్వార్షిక ఆదాయం: రూ.419 లక్షల కోట్లు.అమెజాన్, అలిబాబా, ఈబే, ఫ్లిప్‌కార్ట్..వంటి కంపెనీలు ఈ రంగంలో సేవలందిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత లాభదాయకమైన రంగాలలో ఇది ఒకటి.ఆటోమొబైల్వార్షిక ఆదాయం: రూ.226 లక్షల కోట్లు.కార్ల తయారీ, విడిభాగాల తయారీ, సర్వీసు విభాగాల్లో ఈ రంగం వృద్ధి చెందుతోంది. టయోటా, ఫోక్స్‌వ్యాగన్, టాటా, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీసుజుకీ..వంటి కంపెనీలు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి.ఫార్మాస్యూటికల్స్ అండ్ మోడ్రన్ మెడిసిన్వార్షిక ఆదాయం: రూ.117 లక్షల కోట్లు.ఔషధ పరిశ్రమ, మందులు, వ్యాక్సిన్లు, వైద్య పరికరాల అభివృద్ధి, విక్రయాలు ఈ రంగాన్ని వృద్ధిబాటలు వేస్తున్నాయి. దేశీయంగా హైదరాబాద్ వంటి నగరాలు ఫార్మా తయారీకి ప్రధాన వనరుగా మారుతున్నాయి.స్మార్ట్ఫోన్లు, మొబైల్ టెక్నాలజీవార్షిక ఆదాయం: రూ.125 లక్షల కోట్లు.ప్రస్తుతం దాదాపు అందరివద్ద స్మార్ట్పోన్లున్నాయి. 3జీ టెక్నాలజీ వచ్చినపుడు అందుకు తగిన ఫోన్లు వాడారు. 4జీ ప్రారంభంలో తిరిగి ఆ టెక్నాలజీకి అనువైన ఫోన్లు వినియోగించారు. ఇప్పుడు 5జీ ఫోన్లవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ రంగంలో యాపిల్, సామ్సంగ్, మోటోరోలా..వంటి కంపెనీలు సర్వీసులిస్తున్నాయి.విద్యుత్వార్షిక ఆదాయం: రూ.251 లక్షల కోట్లు.పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతున్న కొద్దీ విద్యుత్ అవసరాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో కరెంట్‌కు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. సంప్రదాయంగా దీని ఉత్పత్తికి బొగ్గు వాడుతున్నారు. కానీ వాతావరణ కాలుష్యం వల్ల క్రమంగా బొగ్గు వినియోగాన్ని తగ్గిస్తున్నారు. దీనిస్థానే పునరుత్పాదక శక్తిని ప్రోత్సహిస్తున్నారు.క్లౌడ్ కంప్యూటింగ్వార్షిక ఆదాయం: రూ.33 లక్షల కోట్లు.టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ క్లౌడ్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. అందుకోసం కంపెనీలు నిత్యం వాటి కౌడ్ సర్వీసులను అప్డేట్ చేస్తూంటాయి. ఈ రంగంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ అజూర్, గూగుల్ క్లౌడ్..వంటివి సేవలందిస్తున్నాయి.టెలికమ్యూనికేషన్స్వార్షిక ఆదాయం: రూ.142 లక్షల కోట్లు.మొబైల్ నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్రాడ్‌బ్యాండ్ మౌలిక సదుపాయాలు ఈ రంగం పరిధిలోకి వస్తాయి. టెలికమ్యూనికేషన్ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తోంది.పర్సనల్ కంప్యూటింగ్వార్షిక ఆదాయం: రూ.41 లక్షల కోట్లు.ఇంట్లో ఉపయోగించే కంపూటర్లు, వాటి సర్వీసులు, ల్యాప్‌టాప్‌లు, అనుబంధ సాఫ్ట్వేర్ విక్రయాలు పర్సనల్ కంప్యూటింగ్ మార్కెట్ కిందకు వస్తాయి. ఈ రంగంలో యాపిల్, మైక్రోసాఫ్ట్, లెనోవో, హెచ్‌పీ..వంటి కంపెనీలు దూసుకుపోతున్నాయి.సోషల్ మీడియా ప్లాట్ఫామ్లువార్షిక ఆదాయం: రూ.12 లక్షల కోట్లు.ఈ రంగంలో పేస్బుక్(మెటా), ట్విటర్, టిక్‌టాక్..వంటి కంపెనీలు సర్వీసులు అందిస్తున్నాయి. ఈ ప్లాట్ఫామ్ల్లో ప్రకటనలు, డేటా మానిటైజేషన్ ద్వారా ఆదాయం వస్తోంది.ఇదీ చదవండి: ఏడాదిలోనే రూ.2 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యంస్ట్రీమింగ్ సేవలువార్షిక ఆదాయం: రూ.8.3 లక్షల కోట్లు.ఈ విభాగంలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్, స్పాటిఫై, ఆహా, అమెజాన్, జియో సినిమా వంటి స్ట్రీమింగ్ కంపెనీలు సర్వీసులు అందిస్తున్నాయి. సబ్స్క్రిప్షన్లు, ప్రకటనల ద్వారా ఇవి ఆదాయం పొందుతున్నాయి. -
వృద్ధి అంచనాలను తగ్గించిన ఫిచ్
న్యూఢిల్లీ: ఫిచ్ రేటింగ్స్ సంస్థ వచ్చే ఆర్థిక సంవత్సరం భారత ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ 8% వృద్ధిని సాధిస్తుందని డిసెంబర్లో ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఈ అంచనాలను తాజాగా 7.7%కి తగ్గించింది. అయితే, వృద్ధి విషయంలో ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంటుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 7.5% వృద్ధి సాధిస్తుందన్న అంచనాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఫిచ్ తన తాజా గ్లోబల్ ఎకనామిక్ అవుట్‌లుక్(జీఈఓ)లో పేర్కొంది. ద్రవ్యలోటు కట్టడికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నందున ఆర్బీఐ కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించే అవకాశాలున్నాయని పేర్కొంది. -
వచ్చే ఏడాది 8% వృద్ధి: ఫిచ్
భారత జీడీపీపై అంచనాలు 7.8% ఉండొచ్చంటున్న హెచ్ఎస్బీసీ ముంబై: భారత ఆర్థిక వృద్ధి అంచనాల పట్ల వివిధ అంతర్జాతీయ సంస్థలు ఆశావహంగా ఉన్నాయి. భారత జీడీపీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 8 శాతంగానూ, 2016-17లో 8.3 శాతంగానూ ఉంటుందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ అంచనా వేస్తోంది. బ్రిక్స్ దేశాల్లో భారత్ మాత్రమే వేగవంతమైన వృద్ధిని సాధిస్తుందని ‘గ్లోబల్ ఎకనామిక్ అవుట్‌లుక్’ నివేదికలో ఫిచ్ పేర్కొంది. జీడీపీ గణనకు ఆధార సంవత్సరాన్ని 2004-05కు బదులుగా కేంద్ర గణాంక సంస్థ (సీఎస్ఓ) 2011-12కు మార్చిన విషయం తెలిసిందే. వృద్ధి వేగవంతంగా ఉండే అవకాశాలున్నప్పటికీ, బ్యాంక్‌ల మొండి బకాయిలు పెరుగుతున్నాయని, కంపెనీల ఆర్థిక పరిస్థితులు బాగా లేవని, పెట్టుబడుల స్థాయిలు కనిష్ట స్థాయిలో ఉన్నాయని ఫిచ్ ఆందోళన వెలిబుచ్చింది. ప్రభుత్వం తీసుకుంటున్న సంస్థాగత సంస్కరణలు, ద్రవ్య, పరపతి విధానాల్లో ఉదారత్వం భారత వృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని అభిప్రాయపడింది. కాలం కలసివస్తోంది: హెచ్ఎస్బీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.4 శాతం వృద్ధిని సాధిస్తుందని హెచ్ఎస్బీసీ అంచనా వేసింది. భారత్‌కు కాలం కలసివస్తోందని హెచ్ఎస్బీసీ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రంజుల్ భండారి వ్యాఖ్యానించారు. సంస్కరణల జోరు, స్తంభించిన ప్రాజెక్టులను పునఃప్రారంభించడం, పెట్టుబడుల జోరు పెంచడం, ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపు.. ఈ అంశాలన్నీ భారత వృద్ధికి చోదక శక్తులుగా పనిచేస్తాయన్నారు.