ఆటో, ట్రాక్టర్ ఢీ : ఇద్దరికి గాయాలు
గుణానపురం(కొమరాడ), న్యూస్‌లైన్ : మండలంలోని గుణానపురం సమీపంలో శనివారం ఆటో, ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. జంఝావతి నుంచి గుణానపురానికి నీటి క్యాన్ల లోడుతో వెళ్తున్న ఆటో, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ మలుపు వద్ద ఢీకొన్నాయి. దీంతో ఆటో నడుపుతున్న కోల అనిల్, జి.త్రినాథ్లకు గాయాలయ్యాయి. ఆటో ముందుభాగం నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను స్థానికులు పార్వతీపురం పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం రిఫర్ చేశారు.