'తీవ్రవాదులను తయారు చేస్తున్నారు'
పనాజీ: మదర్సాల్లో నేర్పేది తీవ్రవాద విద్య అంటూ యూపీకి చెందిన బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఆ పార్టీ మైనారిటీ నాయకులు మౌనం పాటించడాన్ని గోవా ఉర్దూ అకాడమి ఉన్నతాధికారి ఉర్ఫాన్ ముల్లా తప్పుబట్టారు. ముక్తార్ అబ్బాస్ నఖ్వి, నజ్మా హెప్తుల్లా ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. తమ ఎంపీలు వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండా నియంత్రించాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీపై ఉందని అన్నారు. మదర్సాల్లో ఖురాన్ పఠనంతో పాటు దేశం గురించి కూడా బోధిస్తున్నామని తెలిపారు.
మదర్సాల్లో చదువునే వారిని తీవ్రవాదులు, జిహాదీలుగా తయారు చేస్తున్నారని సాక్షి మహారాజ్ ఆరోపించారు. జాతీయవాదంతో సంబంధంలేని మదర్సాలకు ప్రభుత్వం సాయం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.