goats market
-
అడవిలో రాళ్లమేకలు..!
సాక్షి, కొత్తగూడ: ఫారెస్ట్ అధికారుల అండతో అభయారణ్యంలో రాళ్ల మేకల దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. వైల్డ్ లైఫ్ సాంచరీలోకి ఎలాంటి సాదు జంతువులను తీసుకు వెళ్లద్దనే నిబంధనలు ఉన్నా అవేమీ పట్టకుండా రాళ్ల మేకల వ్యాపారులు డేరాలు వేసుకుని తమ దందా కొనసాగిస్తున్నారు. మహబూబాబాద్, ములుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న అభయారణ్యంలో పలు చోట్ల రాళ్ల మేకల క్యాంపులు ఏర్పాటు చేశా రు. ములుగు మహబూబాబాద్ జిల్లా సరిహద్దు ఓటాయి చౌకిబోడు గుట్టలు, కొత్తగూడ, గూడూరు మండలాల సరిహద్దు నేలవంచ గుట్టలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దు పాండవ గుట్టలు, గంగరాం మండలం పందెం సమీపంలోని గుట్టలతో పాటు మరి కొన్ని చోట్ల రాళ్ల మేకల క్యాంపులు ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాపారులు ముందుగానే ఫారెస్ట్ అధికారులతో కలసి మామూళ్లు ముట్టజెప్పి క్యాంపులు ఏర్పాటు చేసుకుంటారు. ఉన్నతాధికారులు రాలేని ఎతైన ప్రదేశాల్లో క్యాంపులు ఏర్పాటు చేసుకోవాలని అధికారులే సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అధికారుల అండదండలతో రాళ్ల మేకల వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. మేకల్లో రాళ్లు ఏంటి..? మేకల్లో రాళ్లు ఏంటి అనుకుంటున్నారా.. అభయారణ్యంలో లభించే కొన్ని రకాల చెట్ల ఆకుల రసానికి మేకలు తినే తుమ్మ గింజలు రసాయణ ముద్దలా తయారు అవుతాయి. వీటినే రాళ్లు అని పిలుస్తారు. ఏడాది లోపు మేక పిల్లలను కొనుగోలు చేసి అటవీ ప్రాంతానికి తరలిస్తారు. పొద్దున్నే తుమ్మకాయ, ఉప్పు తినిపిస్తారు. అనంతరం కొడిశె, పంచోతకపు ఆకులు(రెండు రకాల చెట్లు కూడా విషపూరితమైనవి)మాత్రమే తినే విధంగా ఒత్తిడి చేస్తారు. తిన్న తరువాత 8గంటల పాటు నీరు తాగకుండా ఆ మేకలను చూస్తారు. దీంతో ఆకుల రసాయనాలకు తుమ్మగింజలు క్రమ క్ర మంగా మెత్తబడి రసం ముద్దలా తయారు అవుతాయి. అలా తయారైన రాళ్లు విసర్జించకుండా మందులతో తగు జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ తంతు మొత్తం 3నెలలు పడుతుంది. దసరా సమయం రాగానే రాళ్ల మేకలను కోసి మాంసం విక్రయించుకుని రాళ్లు తీసుకుంటారు. రాళ్లు తులాని(10 గ్రాముల)కు క్వాలిటీని బట్టి వెయ్యి నుంచి 10వేల ధర పలుకుతోంది. ఒక్కో మేకలో 5 నుంచి 10 తులాల రాళ్లు వస్తుంటాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తుం డటంతో రాళ్ల మేకలు పెంచడానికి పోటీ పడుతున్నారు. ఈ రాళ్లను ఏం చేస్తారు, ఎవరు కొనుగోలు చేస్తారు, ఎక్కడికి తీసుకెళ్తారనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. అంతా రహస్యంగానే జరుగుతుంది. కొత్త పుంతలు.. ఇంత కష్టపడి మేకలను సాకినా చివరి నిమిషంలో మేక విసర్జించి నష్టపోయే సంఘటనలు ఉ న్నాయి. దీంతో వ్యాపారులు కృత్రిమ రాళ్ల త యారీకి కొత్త పుంతలు తొక్కుతున్నారు. ముందుగా తుమ్మ గింజలను ఒక ప్లాస్టిక్ వైర్‌కు పూసలాగా గుచ్చుతారు. దాన్ని మెళికలుగా చేస్తారు. మేకలకు ఆపరేషన్ చేసి వాటి జీర్ణాశయంలో ఉంచుతారు. దీంతో మేక వాటిని విసర్జించడం సాధ్యం కాదు. ఇలా ఆపరేషన్ చేసిన మేకలకు విష పూరిత ఆకులు తినిపిస్తారు. ఇలా తయారు చేసిన రాళ్లు సహజ సిద్ధంగా తయారైన వాటి అంత ధర రాకపోయినా మంచి లాభాలే ఘడిస్తున్నట్లు తెలుస్తోంది. రాళ్ల కోసం ఆపరేషన్ చేసిన మేకల పొట్ట భాగం కుళ్లి పోయి మరణించే దశకు చేరుకుంటాయి. ఇలాంటి వాటిని రహస్యంగా కోసి మాంసం విక్రయిస్తున్నట్లు తెలు స్తోంది. రాళ్ల మేకల వ్యాపారుల స్వార్ధం కోసం మూగ జీవాలను హింసించడంతో పాటు విష పూరితమైన మాంసాన్ని విక్రయించడం వల్ల ప్ర జలకు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు. కొందరి స్వార్ధ ప్ర యోజనాలకు అధికారులు అండగా నిలవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
నవీపేట మేకల సంతలో కోట్లల్లో క్రయవిక్రయాలు
నవీపేట(బోధన్): మండల కేంద్రంలో శనివారం జరిగిన వారాంతపు మేకల సంతలో క్రయవిక్రయాలు భారీగా జరిగాయి. రూ.కోటిన్నరకు పైగా లావాదేవీలు జరిగినట్లు సమాచారం. జిల్లాకేంద్రంలో ఆదివారం జరుగనున్న ఊర పండగ సంబరాలతో పాటు వన భోజనాల సందడితో మేకల సంతలో క్రయవిక్రయాలు జోరందుకున్నాయి. ఊర పండగకు ఆనవాయితీగా అమ్మవారికి మేకలను బలిఇవ్వడంతో అమ్మవారి భక్తులు మేకల కొనుగోళ్లు జరిపారు. గ్రామాలలో వన(విందు) భోజనాలకు మాంసాహారాన్ని భుజించడంతో మేకలకు మరింత గిరాకీ పెరిగింది. నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్, కామారెడ్డి సరిహద్దు జిల్లాల నుంచి వచ్చిన కొనుగోలుదారులు అధిక ధరలు చూసి వాపోయారు. మనుపటికంటే అధిక ధరలకు విక్రయించడంతో విస్తుపోయారు. అవసరం నిమిత్తం కొనుగోలు చేయక తప్పలేదు. సీజన్‌ను గమనించిన మహారాష్ట్రలోని ధర్మాబాద్, పర్బణి, ముత్ఖేడ్, జాల్నాలతో పాటు కర్ణాటక సరిహద్దు ప్రాంతాలలోని వ్యాపారులు ఒకరోజు ముందుగానే నవీపేటకు వచ్చి విక్రయాలు జరిపారు. -
మాంసాహార విక్రయాలపై నియంత్రణేదీ..?
సాక్షి, ఆలేరు : ఆలేరులో మాంసాహర విక్రయాలపై అధికారుల నియంత్రణ కొరవడింది. గ్రామ పంచాయతీ, పశువైధ్యాధికారుల అనుమతి లేకుండానే మేకలు, గొర్రెలను వధిస్తున్నారు. మూగ జీవాలను కోసే ముందు సంబంధిత అధికారులు ఆమోద ముద్ర వేయాలి. ఆరోగ్యం ఉందని సర్టిఫై చేసిన తరువాతనే వధించాల్సి ఉంటుంది. అలాగే మాంసం కోసే వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి. కానీ ఇవేమీ పట్టడం లేదు. ఆరోగ్యంగా లేని మేకలను, గొర్రెలను ఇండ్ల వద్ద వధిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మటన్‌ధర ప్రస్తుతం కేజీకి 550 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. కొందరు పొట్టేలు మాంసానికి బదులు మేక, గొర్రె మాంసాన్ని అంటగడుతున్నారని పలువురు వాపోతున్నారు. నిబంధనలు గాలికి.. మటన్ షాపులు రహదారి పక్కన మురికి కాల్వ పక్కన విక్రయిస్తున్నారు. మాంసం పై దుమ్ము ధూళి, ఈగలు వాలుతున్నాయి. మాంసాన్ని అమ్మే షాపులు పరిశుభ్రంగా ఉండాలి. నిల్వ చేసిన మాంసాన్ని అమ్మకూడదు. ఆహార పదార్థాలు..ప్రధానంగా మాంసాన్ని విక్రయించే షాపులకు అనుమతి ఉండాలి. మేకలను, గొర్రెలను వధించినప్పుడు వెలువడే వ్యర్థాలను నిర్ధేశిత ప్రాంతాలకు తరలించాలి. ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.. మాంసాన్ని ఫ్రిజ్‌లో ఉంచకుండా కొన్ని గంటల పాటు వేలాడదీస్తే వ్యాధి కారక క్రిములు చేరుతాయి. ఈ మాంసాన్ని తింటే అమీబియాసిస్, విరేచనాలు, ఈకొలై వల్ల సంక్రమించే వ్యాధులు సంభవిస్తాయి. ఈగలు ముసిరిన మాంసాన్ని తింటే టైపాయిడ్, గ్యాస్ట్రో, ఎంటరైటిన్ వ్యాధులు వస్తాయి. వీటితో పాటు విరేచనాలు అవుతాయి. అసంపూర్తిగా మడిగెలు.. మటన్ షాపుల నిర్వహణ కోసం ఆలేరు పట్టణంలో సుమారు 15సంవత్సరాల క్రితం మడిగెలు నిర్మించి అసంపూర్తిగా వదిలేశారు. వీటిని ఉపయోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పిల్లర్ల వరకు నిర్మించి వదిలేశారు. ప్రస్తుతం అసంపూర్తి మడిగెల్లో కంపచెట్లు పెరిగి, మూత్రశాలగా మారింది. వీటిని పూర్తి స్థాయిలో నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. -
గొర్రెలకాపరి హత్య
అనంతపురం సెంట్రల్: గొర్రెల విక్రయంలో భేదాభిప్రాయాలు వచ్చి క్షణికావేశంలో కాపరిని వ్యాపారి హత్య చేశాడు. ఈ ఘటన అనంతపురం మార్కెట్‌యార్డులోని గొర్రెల సంతలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. త్రీటౌన్ సీఐ మురళీకృష్ణ, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని హైస్కూల్ కొట్టాలలో నివాసముంటున్న రాగే యల్లప్ప కుమారుడు యల్లప్ప (28) గొర్రెల పెంపకంతో జీవనం సాగించేవాడు. శనివారం పశువుల సంత కావడంతో గొర్రెలను విక్రయించేందుకు అనంతపురం మార్కెట్‌యార్డుకు వచ్చాడు. మొత్తం 22 జీవాలను విక్రయించేందుకు బేరం బెట్టాడు. బుక్కరాయసముద్రం మండలం రోటరీపురం గ్రామానికి చెందిన గొర్రెల వ్యాపారులు మందలోని రెండు గొర్రెలను అడగ్గా.. రూ. 12,500 అని చెప్పాడు. దీంతో రోటరీపురానికి చెందిన సూరప్ప రూ. 10వేలకు అడిగాడు. ‘అంత తక్కువ ధరకు ఎలా ఇస్తాం. దొంగతనం చేసి తెచ్చామనుకుంటున్నారా? అని యల్లప్ప కోపంగా మాట్లాడాడు. తన మామను ఇష్టానుసారం మాట్లాడుతావా అంటూ సూరప్ప బంధువు అయిన నార్పల మండలం కేశేపల్లికి చెందిన వెంకటరమణ గొడవకు దిగాడు. మాటామాటా పెరిగి తోసుకున్నారు. ఇంతలో అక్కడున్న వారంతా సర్దిచెప్పి వారిని విడిపించారు. యార్డులో కలకలం గొడవ జరిగిన గంట సేపటికి యల్లప్ప దగ్గర్లో ఉన్న హోటల్లో నీళ్లు తాగేందుకు వెళ్లాడు. అప్పటికే అక్కడ ఉన్న వెంకటరమణ మళ్లీ గొడవకు దిగాడు. చేతిలో కత్తి (గొర్రెలకు మార్కింగ్ వేసేందుకు ఉపయోగించే కత్తి) తీసుకొని పొడిచాడు. గుండె కిందిభాగంలో పొడవడంతో యల్లప్ప ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అనూహ్యంగా జరిగిన ఈఘటనతో మార్కెట్‌యార్డులో కలకలం రేగింది. వెంటనే స్థానికులు అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే యల్లప్ప మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. యల్లప్పకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉదయం సంతకు వెళ్లిన వ్యక్తి తిరిగిరానిలోకాలకు వెళతాడని ఊహించని ఆ కుటుంబసభ్యులు బోరున విలపించారు. త్రీటౌన్‌పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం. -
మేకల సంతలో ఉద్రిక్తత
తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపలి్లలోని మేకల సంత వివాదం కొలిక్కి రాలేదు. సోమవారం వేకువజామున సంత వద్ద మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. గొర్రెలు, మేకల వర్తక సంఘం, శ్రీ సాయి వర్తక సంఘ సభ్యులతోపాటు బీజేపీ, టీడీపీ వర్గీయులు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో వివాదం తారస్థాయికి చేరింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సంత ప్రాంతంలో పోలీసులు మోహరించారు. తాడేపల్లిగూడెం, నల్లజర్ల వైపు నుంచి వచ్చే వాహన చోదకులు, ప్రయాణికులను ఎక్కడికక్కడ నిలుపుదల చేసి ఎక్కడికి వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారనే విషయాలను పోలీసులు ఆరా తీశారు. సోమవారం వేకువజామున మేకల కొనుగోలుదారులను మాత్రమే ఆ ప్రాంతానికి అనుమతించారు. మిగిలిన వారిని లోనికి వెళ్లకుండా కట్టడి చేశారు. ఆ ప్రాంతానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు వెళ్లగా, అప్పటికే అక్కడ మాటువేసిన టీడీపీ వర్గీయులు వందలాదిగా సంత వద్దకు చేరుకున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ నున్నా మురళీకృష్ణ ఆధ్వర్యంలో సీఐలు ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి, జి.మధుబాబు, చింతా రాంబాబు, దుర్గాప్రసాద్, ఎస్సైలు ఎం.సూర్యభగవాన్, ఐ.వీర్రాజు, వి.చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం, సిబ్బంది ఇరువర్గాలను నిలువరించారు. వేకువజామున 4 గంటలకు ప్రారంభమైన తోపులాట ఉదయం 8 గంటల వరకూ కొనసాగింది. ఎట్టకేలకు పోలీసులు ఇరువర్గాలను అక్కడ నుంచి బలవంతంగా పంపించివేశారు. కాగా, డీఎల్పీఓ ఆదేశాల మేరకు సంత వద్ద ఆశీలు వసూళ్లను నిలుపుదల చేశారు. -
మేకల సంతలో ఉద్రిక్తత
తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపలి్లలోని మేకల సంత వివాదం కొలిక్కి రాలేదు. సోమవారం వేకువజామున సంత వద్ద మరోసారి ఉద్రిక్తత తలెత్తింది. గొర్రెలు, మేకల వర్తక సంఘం, శ్రీ సాయి వర్తక సంఘ సభ్యులతోపాటు బీజేపీ, టీడీపీ వర్గీయులు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో వివాదం తారస్థాయికి చేరింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సంత ప్రాంతంలో పోలీసులు మోహరించారు. తాడేపల్లిగూడెం, నల్లజర్ల వైపు నుంచి వచ్చే వాహన చోదకులు, ప్రయాణికులను ఎక్కడికక్కడ నిలుపుదల చేసి ఎక్కడికి వెళ్తున్నారు.. ఎందుకు వెళ్తున్నారనే విషయాలను పోలీసులు ఆరా తీశారు. సోమవారం వేకువజామున మేకల కొనుగోలుదారులను మాత్రమే ఆ ప్రాంతానికి అనుమతించారు. మిగిలిన వారిని లోనికి వెళ్లకుండా కట్టడి చేశారు. ఆ ప్రాంతానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు వెళ్లగా, అప్పటికే అక్కడ మాటువేసిన టీడీపీ వర్గీయులు వందలాదిగా సంత వద్దకు చేరుకున్నారు. దీంతో ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ నున్నా మురళీకృష్ణ ఆధ్వర్యంలో సీఐలు ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి, జి.మధుబాబు, చింతా రాంబాబు, దుర్గాప్రసాద్, ఎస్సైలు ఎం.సూర్యభగవాన్, ఐ.వీర్రాజు, వి.చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం, సిబ్బంది ఇరువర్గాలను నిలువరించారు. వేకువజామున 4 గంటలకు ప్రారంభమైన తోపులాట ఉదయం 8 గంటల వరకూ కొనసాగింది. ఎట్టకేలకు పోలీసులు ఇరువర్గాలను అక్కడ నుంచి బలవంతంగా పంపించివేశారు. కాగా, డీఎల్పీఓ ఆదేశాల మేరకు సంత వద్ద ఆశీలు వసూళ్లను నిలుపుదల చేశారు.