god blessings
-
ఓ చెంచాడు అయినా లేకపోతే...
కష్టం వచ్చినప్పుడు భగవంతుడు మన పక్షాన లేడు.. అనుకుంటాం. దేముడు చల్లగా చూసాడు–అని సుఖం కలిగినప్పుడు అనుకుంటుంటాం. కానీ భగవంతుడికి ఏ పక్షపాతమూ లేదు, ఆయన ఎవరిపక్షాన ఉండడు. ‘‘దృషద్విచిత్రతల్పయో ర్భుజంగమౌక్తికస్రజో/ ర్గరిష్ఠరత్న లోష్టయోః సహృద్విపక్ష పక్షయో:/ తృణారవింద చక్షుషోః ప్రజామహీ మహేంద్రయోః / సమప్రవత్తికః కదా సదాశివం భజామ్యహమ్.’’ కటిక నేలనుంచీ, హంసతూలికా తల్పం వరకూ, మహారాజు నుండి సామాన్యుడి వరకు, మిత్రపక్షం అనీ, శత్రుపక్షం అనీ తేడా లేకుండా అన్నిటినీ సమాన దృష్టితో చూసే ఆ సదాశివుడికి నమస్కారం.. అంటాం. వివేకానందుడు చెప్పినట్టు – ఈ ప్రపంచమంతా నీ పూజా మందిరంగా చూసే శక్తి రావాలి. భగవంతుడిని ఏమార్చి ఆయనను మన పక్షానికి తీసుకురావడం ఎప్పటికీ సాధ్యమయ్యేది కాదు. ఆయన ప్రీతి పొందేది మన నడవడికనుబట్టే. మన నడవడి ధర్మాన్ని ఆశ్రయించి ఉండాలి. మనం సముద్రమంత ప్రయత్నం చేయవచ్చుగాక, కానీ ఓ చెంచాడంత భగవదనుగ్రహం ఉండకపోతే కార్యాలు సఫలీకృతం కావు. ‘ఆచార్య ప్రభవో ధర్మః. ధర్మం అనేది కేవలం పుస్తకాలలో చదువుకుంటేనో, అన్నీ నాకు తెలుసనుకుంటేనో అన్వయం కాదు. నీవు ఎంత అనుష్ఠించావో అదే ధర్మం. ధర్మాత్ముడు.. అనిపించుకోవాలంటే నీ నడవడిక మొత్తం ధర్మబద్ధంగా ఉండాలి. ఆచరించినది ధర్మం. ఆచరించనిది ఎప్పటికీ ధర్మం కాదు. అమెరికాకు అధ్యక్షులుగా చేసినవారిలో చిరస్మరణీయుడైన అబ్రహాం లింకన్ ఒక మాటన్నారు...‘‘దేముడు నీ పక్షాన ఉన్నాడా అని ఆలోచించడం కాదు, దేముడి మార్గంలో నీవు ఉన్నావా !’’ అని చూసుకొమ్మన్నారు. ఆయన బాల్యంనుంచీ అలానే బతికారు. నిరుపేద. చిన్నతనంలో ఒక దుకాణంలో పనిచేస్తుండేవాడు.. ఒక వినియోగదారుడి దగ్గర తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువ సొమ్ము తీసుకున్నారు. ఆ తరువాత లెక్కలు చూసుకుంటుంటే తెలిసింది. దుకాణం మూసేసి అర్థరాత్రి వినియోగదారుడి ఇల్లు వెతుక్కుంటూ పోయి తాను ఎక్కువగా తీసుకొన్న మొత్తాన్ని ఇచ్చేసి మరీ వచ్చాడు. అదీ అనుష్ఠానం లో ధర్మం అంటే... ఈ పరిణతి ఆయన ఎంతసేపు పూజ చేసాడు, ఎంత సేపు ప్రార్థన చేసాడు.. అన్న దానినిబట్టి రాలేదు... చిన్నతనం నుంచి అదే నిబద్ధతతో బతకబట్టి వచ్చింది. మీకు ధర్మంపట్ల అనురక్తి ఉండి ఆచరించినదేదో అదే ధర్మం. అదే సదాచారం. ధర్మంపట్ల అనురక్తి లేకుండా స్వప్రయోజనం చూసుకుంటే అది దురాచారం. ఎక్కడ సదాచారం ఉన్నదో అక్కడ భగవదనుగ్రహం ఉండి తీరుతుంది. ఎక్కడ సదాచారం లేదో అక్కడ దేముని కృప ఎలా సాధ్యం! నీకు ఆకలేస్తే నువ్వే తినాలి. నీకు నిద్రవస్తే నీవే నిద్రపోవాలి. అలాగే నీ నడవడికలో దోషాలను నీవే దిద్దుకోవాలి. సదాచారం పెరుగుతూ ఉండాలి, దురాచారం తగ్గుతూ పోవాలి. ధర్మం చెప్పేది కూడా... నీవు నన్ను కాపాడు.. నేను నీ పక్షాన ఉండి నిన్ను కాపాడతా...అనే. -
గురువాణి–1: నిన్ను వెలిగించే దీపం... నవ్వు
‘‘నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్/ దివ్వెలు, కొన్ని నవ్వులెటు తేలవు, కొన్ని విషప్రయుక్తముల్,/పువ్వులవోలె ప్రేమరసమున్ వెలిగ్రక్కు/ విశుద్ధమైన లే/నవ్వులు– సర్వదుఃఖ శమనంబులు, వ్యాథులకున్ మహౌషథుల్’’ మహాకవి గుర్రం జాషువా గారి పద్యం ఇది. ఆయన తేటతెలుగులో అనేక రచనలు చేసారు. ఆయన రచనల్లో అంతర్లీనంగా కులమతాలనే సంకుచిత తత్త్వాన్ని ప్రశ్నించారు. అభ్యుదయ భావాలు కలవారు. ఆయన రచనలు చదువుతుంటే ప్రతిదీ మనకు కళ్లముందు కనిపిస్తుంటుంది. ప్రాతఃస్మరణీయులు. ఆయన కవిత్వం చాలా ఇష్టం. నవ్వవు జంతువుల్...సమస్త ప్రాణికోటిలో ఏ జంతువూ నవ్వదు. మనుష్యులు మాత్రమే నవ్వుతారు. నవరసాలు కళ్ళల్లోంచి ఒలికించినట్లే–మన మానసిక స్థితిని, భావోద్వేగాలను మనం మాటల్లో చెప్పకపోయినా మన నవ్వు చెప్పేస్తుంది. ఎవరయినా ముఖం మాడ్చుకుని దిగాలుగా ఉంటున్నారనుకోండి, ఎవ్వరూ దగ్గరకు వెళ్ళరు, పలకరించరు కూడా. ప్రశాంతం గా, సంతోషంగా ఉన్నవాడి చుట్టూ ఎప్పుడూ పదిమంది ఉంటుంటారు. అసలు నవ్వకుండా బతుకుతున్న వాడి బతుకుకన్నా బరువయినా బతుకు మరొకటి ఉండదు. హాయిగా నవ్వడం, అరమరికలు లేకుండా పకపకా నవ్వడం, సంతోషంగా నవ్వడం, అదీ ఇతరులు బాధపడకుండా నవ్వడం ... ఆ నవ్వు దైవానుగ్రహం. ఎవ్వరిదగ్గరికయినా ఉపకారం ఆశించి వెళ్ళితే వెంటనే వారి ముఖకవళికలు మారిపోతాయి. విచిత్రమైన నవ్వు కనిపిస్తుంది. అడిగిన సహాయం చేస్తారో తెలియదు, చేయరో తెలియదు. అలాటి వారిలో కొన్ని నవ్వులు ఎటూ తేలవు. కొంతమంది నవ్వితే ఓ వారం రోజులు అన్నం సయించదు. మనల్ని అంత క్షోభ పెట్టేటట్లు, బాధపెట్టేటట్లు విషపు నవ్వులు నవ్వుతారు. కొంతమంది ఇతరులు బాధపడితే నవ్వుతారు. బాధితుడిని తన బాధకన్నా ఎదుటివాడి నవ్వు మరింత బాధిస్తుంటుంది. ఎదుటివాడు కష్టంలో ఉన్నట్లు తెలిసి కూడా పిచ్చినవ్వులు నవ్వుతుంటారు కొందరు. ఎవరయినా ఏదయినా సాధిస్తే .. నీ బతుక్కి ఇదెలా సాధ్యం... అన్నట్లు వెకిలినవ్వులు నవ్వుతుంటారు. పువ్వులవోలె ప్రేమరసము వెలిగ్రక్కు విశుద్ధములైన లేనవ్వులు సర్వదుఃఖశమనంబులు... వికసించిన పువ్వులను చూస్తుంటే... మెత్తటి, అతి సున్నితమైన రేకులు, కళ్ళకింపైన రంగులు, మధ్యలో కేసరం, పుప్పొడి, మకరందం, వాటి చుట్టూ తిరిగే తుమ్మెదలు ...మనల్ని కొంచెం సేపు మరిపిస్తుంది, మురిపిస్తుంది... ఇదే అనుభూతి పసిపిల్లల నవ్వుల్లో మనకు కనిపిస్తుంటుంది. ప్రేమగా నవ్వే నవ్వుల్లో కూడా ఈ భావన ఉంటుంది. అవి నిష్కల్మషాలు కాబట్టి వాటి శక్తి ఎక్కువ. మనం ఎంతటి బాధలో ఉన్నా ఆ నవ్వులు మనకు ఉపశమనం కలుగచేస్తాయి. మందుల్లా పనిచేస్తాయి. నవ్వు రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. విషపు నవ్వు గుండెల్ని చీలిస్తే, ప్రేమగా నవ్వే ఓ చిర్నవ్వు హృదయాలను పరవశింపచేస్తుంది. చిన్న చిరునవ్వు ఎంత గొప్పదో చెప్పడానికి మూకశంకరులు అమ్మవారి మీద వంద శ్లోకాలుచేస్తూ మందస్మిత శతకం రాసారు. మన విలువను పెంచేది, తెలియని వారికి పరిచయం చేసేది, మనల్ని ప్రపంచానికి దగ్గర చేసేది.. ఓ చిర్నవ్వు...అదెప్పుడూ మన ముఖాన్ని వెలిగిస్తూనే ఉంటుంది, మన వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేస్తూనే ఉంటుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
దేవుడి ఆశీర్వాదంతో నాకు కరోనా: ట్రంప్
వాషింగ్టన్: దేవుడి ఆశీర్వాద బలంతోనే తనకు కరోనా సోకిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కరోనా సోకి చికిత్స తీసుకోవడం వల్ల ప్రజలకు ఉచితంగా ఎలాంటి చికిత్స అందివ్వాలో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నామన్నారు. వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రి నుంచి రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ అయిన ట్రంప్ బుధవారం ఒక వీడియోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌తో 15న మియామిలో జరగనున్న రెండో బిగ్ డిబేట్లో తాను పాల్గొననని ట్రంప్ స్పష్టం చేశారు. -
కరోనా దేవుడిచ్చిన వరం : ట్రంప్
వాషింగ్టన్: కరోనా మహమ్మారిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన శైలిలో వింత వ్యాఖ్యలు చేశారు. కరోనా మామూలు ఫ్లూ లాంటిదే అంటూ ప్రకటించి వివాదాన్ని రేపిన ట్రంప్ తాజాగా మరో వివాదాన్ని రాజేశారు. తనకు కరోనా సోకడం దేవుడిచ్చిన వరమంటూ అభివర్ణించారు. కోవిడ్-19 పాజిటివ్ రావడంతో మిలిటరీ ఆసుపత్రిలో చికిత్స అనంతరం తిరిగి కోలుకున్న తర్వాత ఒక వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా కరోనా తనకు "దేవుని ఆశీర్వాదం" అని భావిస్తున్నానన్నారు. అందువల్లే దాన్ని నయం చేసే శక్తిమంతమైన డ్రగ్స్ గురించి తనకు తెలిసిందని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రెజెనెరాన్ ఫార్మాస్యూటికల్స్ మందులను ఉపయోగించడం వల్ల అది ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తన అనుభవంలోకి వచ్చిందన్నారు. (వైట్‌హౌస్‌కి కరోనా కాటు..) తనకు చికిత్స అందించిన వైద్యులపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. అమెరికా పౌరులకు కూడా ఇదే స్థాయిలో ఉచితంగా చికిత్స అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు కరోనా విస్తరణపై డ్రాగన్ దేశంపై ఇప్పటికే పలుమార్లు మండిపడిన ట్రంప్ మరోసారి తన దాడిని ఎక్కు పెట్టారు. ప్రపంచానికి చైనా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. చైనా చేసిన వైరస్‌కు అమెరికన్లు డబ్బులు చెల్లించాల్సిన పనిలేదంటూ విరుచుకుపడ్డారు. కాగ కరోనా మహమ్మారికి తీవ్రంగా ప్రభావితమైన దేశంగా అమెరికా నిలుస్తోంది. కరోనా విలయం కారణంగా ఇప్పటికే రెండు లక్షల పదివేలకుపైగా అమెరికన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరోవైపు రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బిజీ అయిపోతున్నారు. A MESSAGE FROM THE PRESIDENT! pic.twitter.com/uhLIcknAjT — Donald J. Trump (@realDonaldTrump) October 7, 2020 -
లాల్‌దర్వాజాలో రియో స్టార్
చాంద్రాయణగుట్ట: లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆశీస్సులతోనే పతకాన్ని సాధించగలిగానని ఒలింపిక్స్ రజత పతక విజేత పి.వి.సింధు అన్నారు. లాల్‌దర్వాజా మహంకాళి అమ్మవారిని శనివారం ఉదయం 7.30 గంటలకు ఆమె కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు బ్యాండ్ మేళాల నడుమ ప్రత్యేక స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...ఒలింపిక్స్‌కు ముందు తాను అమ్మవారిని దర్శించుకొని పతకం రావాలని వేడుకున్నానని చెప్పారు. ఇకపై ప్రతి బోనాల జాతరలోనూ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తానన్నారు. దక్షిణ మండల డీసీపీ వి.సత్యనారాయణ ఆమెకు పూలబొకే అందజేసి పాతబస్తీలో త్వరలో నిర్వహించే 5కే రన్‌కు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. పలువురు చిన్నారులు ఆమెకు పూలబొకేలు అందజేసి కరచాలనం చేయడానికి పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో సింధు తల్లిదండ్రులు రమణ, విజయ, ఆలయ కమిటీ చైర్మన్ సి.రాజ్‌కుమార్ యాదవ్, ప్రతినిధులు కె.వెంకటేశ్, మహేశ్ గౌడ్, మాణిక్ ప్రభు గౌడ్, యు.సదానంద్ గౌడ్, పోసాని సదానంద్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.