![Trump Calls Contracting the Coronavirus a Blessing From God - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/9/trum.jpg.webp?itok=x-u17R0d)
వాషింగ్టన్: దేవుడి ఆశీర్వాద బలంతోనే తనకు కరోనా సోకిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కరోనా సోకి చికిత్స తీసుకోవడం వల్ల ప్రజలకు ఉచితంగా ఎలాంటి చికిత్స అందివ్వాలో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నామన్నారు. వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రి నుంచి రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ అయిన ట్రంప్ బుధవారం ఒక వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌తో 15న మియామిలో జరగనున్న రెండో బిగ్ డిబేట్‌లో తాను పాల్గొననని ట్రంప్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment