భవనాలనూ పచ్చగా మార్చొచ్చు
హైదరాబాద్: కొత్తగా నిర్మించే భవనాలను గ్రీన్ బిల్డింగ్స్‌గా నిర్మించుకోవచ్చనే విషయం మనందరికీ తెలిసిందే. మరి పాత భవనాలనూ గ్రీన్ బిల్డింగ్స్‌గా మార్చుకోవచ్చండోయ్. పాత భవనాలకు కూడా ప్లాటినం, స్వర్ణం, రజతం వంటి రేటింగ్ కూడా ఇస్తారండోయ్. సీఐఐ గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ ఈ విధానాలకు శ్రీకారం చుట్టింది.
చిన్న మార్పులతో సరి..
1. భవన నిర్మాణ మార్పులో నీటి, విద్యుత్ వినియోగాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించాలి.
2. ఇంట్లో త్రీ స్టార్, ఫైవ్ స్టార్ రేటింగ్ ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులను మాత్రమే వినియోగించాలి.
3. భవనాల లోపలికి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా పైకప్పు నిర్మాణంలో చిన్న చిన్న మార్పులు చే యాలి.
4. భవనం లోపల పూర్తిగా సీఎఫ్ఎల్ బల్బులను వాడాలి.
5. భవనాల్లో ఉండే నల్లాల మొదట్లో ఎరోటర్‌ను వినియోగించాలి. దీంతో నీటి వృథా తగ్గటమే కాకుండా నీటిలో ఉండే మలినాలు, చెత్తా చెదారం వంటివి ఎరోటర్‌లో నిలిచిపోతాయి.
6. సాధ్యమైనంత వరకు సోలార్ విద్యుత్‌నే వినియోగించాలి. దీంతో విద్యుత్, నీటి బిల్లుల మోత తప్పుతుంది.
7 {Xన్ బిల్డింగ్ ప్రమాణాలతో పాటు ఆయా భవన ప్రాంతాల్లో ఉన్న జీవవైవిధ్యాన్ని కూడా పరిరక్షించాలి.
8. భవనాల ఆవరణలో లాన్‌ను పెంచకుండా ఎక్కువ మొక్కలను పెంచాలి. ఎందుకంటే లాన్ ఎక్కువ నీటిని తీసుకుంటుంది.
9. వర్షపు నీరు వృథా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాలి.
10. భవన పరిసరాల్లో వేడి తక్కువగా ఉండేలా స్థానిక మొక్కలను పెంచాలి. ఇంట్లో వాడిన నీటిని శుద్ధి చేసి మొక్కలకు పోయాలి.