Gokulam
-
పిఠాపురంలో గుట్టుచప్పడు కాకుండా జనసేన ‘గోకులం’ డ్రామా
పిఠాపురం: గోకులం గ్రాండ్ హోటల్లో ఏం జరిగింది?. అక్కడి నుంచి డబ్బుల బ్యాగులు ఎక్కడికి వెళ్లాయి? పిఠాపురంలో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్. జనసేన నేతలు బస చేసిన హోటల్ నుంచి భారీ మొత్తంలో డబ్బును సేఫ్‌గా ఎలా తరలించారో ఇక్కడి ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో శనివారం రాత్రి సినీ ఫక్కీలో జరిగిన సీన్లో అసలు కథ ఏంటంటే.. ఇక్కడ ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద ఎవ్వరూ ఆపకుండానే ఓ కారు వచ్చి ఆగింది.రోడ్డుకు అడ్డంగా పెట్టి ట్రాఫిక్ స్తంభించేలా చేశాడు ఆ కారు డ్రైవర్. ట్రాఫిక్ ఆగిపోవడంతో చెక్‌పోస్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై, వాహనాలను క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇదే సమయంలో అడ్డంగా పెట్టిన కారులో నుంచి కనిపిస్తున్న పెద్ద అట్టపెట్టెలపై తనిఖీ సిబ్బంది దృష్టి పడింది. అనుమానం వచ్చి సోదా చేయగా.. అందులో 17 అట్టపెట్టెల్లో జనసేన గుర్తుతో ఉన్న గాజు గ్లాసులు కనిపించాయి. వెంటనే వాటిని స్వా«దీనం చేసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది తెలిసి మీడియా అంతా అటు దృష్టి పెట్టింది. పోలీసులు కారును, గాజు గ్లాసులను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. పక్కదోవ పట్టించేలా పక్కా వ్యూహం తనిఖీ అధికారులు, పోలీసులు కారులోని గాజు గ్లాసులకు ఎటువంటి బిల్లులూ లేకపోవడంతో స్వా«దీనం చేసుకుంటున్న సమయంలో ముందస్తు పథకం ప్రకారం.. కారును తనిఖీ చేస్తున్న ప్రదేశానికి కొందరు జనసేన నేతలు వచ్చి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. సరిగ్గా అదే సమయంలో అక్కడకు కిలోమీటర్ దూరంలో ఉన్న గోకులం హోటల్లో ప్రత్యేక బృందాలు తనిఖీ చేపట్టాయి. అక్కడ క్లీన్ చిట్ ఇచ్చేంత వరకూ జనసేన నేతలు వాగ్వాదం కొనసాగించారు.అధికారులు కారులో గ్లాసులు స్వా«దీనం చేసుకున్నప్పుడు ఎటువంటి బిల్లులూ లేవని చెప్పిన జనసేన నేతలు.. హోటల్లో తనిఖీలు పూర్తి కాగానే ఆ గ్లాసులకు బిల్లులు తీసుకువచ్చి పోలీసులకు చూపించడం పక్కా ప్లాన్ ప్రకారమే చేశారని అర్థమవుతోంది. సినీ నటులు, సహాయ నటులు ఉన్న జనసేనకు ఇలాంటి సీన్లు క్రియేట్ చేయడం పెద్ద పనేమీ కాదని, భవిష్యత్‌లో ఇలాంటివి ఇంకెన్ని చూడాలో అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అసలేం జరిగిందంటే.. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో గోకులం గ్రాండ్ అనే హోటల్‌ను నెల క్రితం జనసేన అగ్ర నేతలు అద్దెకు తీసుకుని ఇక్కడి నుంచి నియోజకవర్గం పార్టీ ఎన్నికల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అయితే భారీ నగదు ఉంది అనే సమాచారంతో స్పెషల్ పార్టీ ఎన్నికల తనిఖీ అధికారులు శనివారం రాత్రి హఠాత్తుగా ఈ హోటల్ వద్దకు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు అధికారులు తనిఖీలు చేసి అక్కడ ఏమీ లేవని తేల్చేశారు. జనసేన నేతలకు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. ఈ హోటల్‌పై ఎన్నికల అధికారులు దాడులకు వస్తున్నారనే సమాచారం జనసేన అగ్ర నేతలకు ముందే తెలిసింది.వెంటనే కారు డ్రామాకు ప్లాన్ చేశారు. చెక్‌పోస్టు వద్దకు పంపి ట్రాఫిక్‌ను ఆపి హైడ్రామా క్రియేట్ చేశారు. దీంతో మీడియా ఫోకస్ అటు మళ్లింది. ఈలోపు భారీ మొత్తంలో ఉన్న డబ్బును బ్యాగుల్లో నింపి కిటీకీల్లో నుంచి కిందకు పడేసి అక్కడి నుంచి వాటిని తరలించారని విశ్వసనీయంగా తెలిసింది. స్థానికులు, మీడియా, పోలీసుల దృష్టి ట్రాఫిక్‌కు అడ్డంగా పెట్టిన కారుపైకి మళ్లించి.. డబ్బును రహస్య ప్రాంతానికి మళ్లించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
తొలి ముఖ చిత్రం
చిన్నప్పుడు ఇష్టంగా వాడిన వస్తువులు, దిగిన ఫొటోలు వంటివన్నీ అపురూపంగా దాచుకుంటాం. పెద్దయ్యాక చూసుకుని మురిసిపోతాం. ఇప్పుడు రష్మికా మందన్నా ఒక ఫొటోను బయటపెట్టి, తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇదిగో ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి ఉంది కదా. ఈ ఫొటోనే రష్మిక షేర్ చేశారు. ఒక పత్రిక కవర్‌పేజీ మీద ఉన్న చిన్నారి రష్మిక చాలా ముద్దుగా ఉంది కదూ. 2001లో ప్రింట్ అయిన తమిళ పత్రిక ‘గోకులం’ ముఖచిత్రం కోసమే రష్మిక ఇలా రెండు చేతులకు వాచీలు పెట్టుకుని పోజిచ్చారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ అలానే రెండు చేతులకు వాచీలు పెట్టుకుని సరదాగా ఫొటో దిగారు. ‘‘నా ఫస్ట్ కవర్ పేజీ ఇది. అప్పుడు జరిగిన ఫొటోషూట్ నాకింకా గుర్తుంది. మా అమ్మగారు ఆ పత్రికను భద్రంగా దాచారు. ఇప్పటికీ నా గురించి ఏ పత్రికలో వచ్చినా దాస్తుంటారు. ఇవాళ నటిగా మీ (ప్రేక్షకులు) ప్రేమను దక్కించుకోవడానికే ఇంతదాకా వచ్చానా? అనిపిస్తోంది. నా ఈ ఎదుగుదలకు కారణం నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు. అలాగే నేను వర్క్ చేసిన, చేస్తున్నవారు కూడా ఓ కారణం. ఒక మైల్స్టోన్ చేరుకునే క్రమంలో చేసిన యుద్ధాలు... సారీ.. ఎక్కువ చెబుతున్నాను కదూ’’ అని పేర్కొన్నారు రష్మికా. -
గోకులం.. అంతా కలకలం
సాక్షి, ఆమదాలవలస రూరల్: వ్యవసాయరంగానికి పెద్దపీట అంటూనే ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను దగా చేస్తున్నారు. పథకాలు, రాయితీలు, సబ్సీడీలు ఇవిగో అంటూ ఒక చేత్తో చూపించి మరో చేత్తో లాగేసుకుంటూ పథకం ప్రకారం పక్కాగా మోసం చేస్తున్నారు. ఇటీవల పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో కొత్తగా అమలు చేసిన గోకులం పథకమే దీనికి చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 90 శాతం రాయితీతో మొదట ఊరించిన టీడీపీ సర్కారు ఉన్న ఫలంగా రాయితీపై కొర్రీలు వేయడంతో చివరికి పథకాన్ని అటకెక్కించారు. ఈ పథకం గురించి పశుసంవర్థకశాఖలో పనిచేస్తున్న సిబ్బంది కూడా గోకులం గురించి రైతులు తగిన ప్రచారం చేయకపోవడంతో షెడ్లు నిర్మించి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ పథకం గురించి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన టెక్నికల్ మోనటరింగ్, ఎంపీడీఏలు కేవలం కార్యాలయానికే పరిమితం కావడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. బిల్లులు మంజూరుకాకపోయినా సరే నిర్మాణాలు చేపట్టాలని రైతుల నుంచి ఒత్తిడి తీసుకురావడంతో నిర్మించిన రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఊరించిన సర్కార్ .. పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో సామాజిక గోకులాలు, మినీ గోకులాల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తామని చంద్రబాబు సర్కార్ రైతులను ఊరించింది. నాలున్నరేళ్లగా రైతులకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని అమలు చేయకుండా మభ్యపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం చివరకు గోకులం అనే పథకం అమలుకు శ్రీకారం చుట్టడంతో రైతులు ఎగబడ్డారు. ఉపా«ధి హామీ పథకానికి అనుసంధానంతో గోకులం(పశు వసతి గృహం) నిర్మించనున్న లబ్ధిదారులు తమ వాటా కింద 10 శాతం భరిస్తే మిగతా 90 శాతం రాయితీ రూపంలో ఇస్తామని నమ్మబలికారు. పథకం బాగానే ఉందంటూ చాలా మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. గోకులాల కేటాయింపులు ఇలా గోకులాల పథకం ప్రవేశపెట్టినప్పుడు మూడు పథకాలు అమల్లో ఉండేది. రెండు పశువులకు గాను షెడ్డు నిర్మాణానికి రైతు వాటా రూ.10 వేలు, ప్రభుత్వం నుంచి రూ. 90 వేలు కేటాయించారు. నాలుగు పశువులకు షెడ్డు నిర్మాణానికి రైతు వాటా రూ.15 వేలు, ప్రభుత్వం వాటా రూ.1.35 లక్షలు, ఆరు పశువులకు షెడ్డు నిర్మిస్తే రైతు వాటా రూ.18 వేలు, ప్రభుత్వం వాటా రూ. 1.68 లక్షలు అంటూ చెప్పడంతో రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. నిర్మించినవి ఇవే.. ఆమదాలవలస మండలంలో 426 మంది రైతులు గోకులానికి దరఖాస్తులు చేసుకోగా అందులో ప్రస్తుతానికి 40 షెడ్లు పూర్తిగా నిర్మాణాలు జరిపారు. గొర్రెల కాపరులు కూడా 30 షెడ్లు నిర్మించారు. ఇందులో 180 షెడ్లు నిర్మాణ దశలో ఉండగా 176 షెడ్లు పునాదుల దశలో ఉన్నాయి. బూర్జ మండలంలో కేవలం 69 షెడ్లు మాత్రమే పనులు జరుగుతున్నవి. అయితే గోకుల లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఒక్క రూపాయి బిల్లు కూడా మంజూరు కాలేదు. బిల్లు రాలేదు గోకులం పథకం పేరుతో గొర్రెల నివాసానికి షెడ్డు నిర్మిస్తున్నాను. గోతులు తీసి పునాదులు కూడా వేశాను. ఇప్పటి వరకు పైసా బిల్లులు కూడా మంజూరు కాలేదు. పునాదుల కోసం అప్పులు చేసి నిర్మాణాలు చేపట్టాను. బిల్లులు మంజూరు కాకపోతే తీవ్రంగా నష్టపోతాను. –తాన్ని ఎర్రయ్య, లబ్ధిదారుడు, బొబ్బిలిపేట, ఆమదాలవలస మండలం పథకం మంజూరు కాలేదు గోకులం పథకం ద్వారా పశువుల షెడ్డు నిర్మించడానికి డీడీ తీశాను. పథకానికి అర్హత ఉన్నా ఇంతవరకు మంజూరు చేయలేదు. డీడీ తీసుకుని కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారే తప్ప నిర్మాణానికి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. డీడీ తీసుకుని నష్టపోవడం తప్ప ఉపయోగం లేదు. – గేదెల లక్ష్మణరావు, దూసి, ఆమదాలవలస మండలం బడ్జెట్ విడుదల కాలేదు గోకులం పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు మంజూరు కావడం లేదన్న మాట వాస్తవమే. బిల్లులు నివేదికను జిల్లా అధికారులకు అందజేశాం. బడ్జెట్ విడుదల కానందున బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. బిల్లులు రాకున్నా పనులు నిలుపుదల చేయవద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. అందుకే పనులు వేగవంతం చేస్తున్నాం. –ఆర్.ఆనందరావు, పశుసంవర్థకశాఖ ఏడీ, ఆమదాలవలస -
‘గోకులం’.. కలకలం!
ఊరించి ఉసూరుమనిపించడంలో టీడీపీ సర్కారు పండిపోయింది. ఏ హామీ ఇచ్చినా.. ఏ పథకం ప్రారంభించినా.. చెప్పేది ఒకటి.. ఆచరణలో అమలు చేసేవిధానం మరొకటి. చివరకు లబ్ధిదారులకు తలనొప్పి. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న గోకులం పథకంలో రైతుల పరిస్థితి కూడా ‘ఎరక్కపోయి వచ్చాము ఇరుక్కుపోయాము’ అన్నట్లు తయారైంది. రోజుకో ఉత్తర్వుతో నిబంధనల వాత పెడుతుండటంతో పశుపోషకులు ‘పథకం మాకొద్దు బాబోయ్’ అంటున్నారు. సాక్షి, మచిలీపట్నం : పాడి పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘గోకులం’ పథకం ప్రభుత్వ విధానాలతో పాడి రైతులను ఇబ్బందుల్లోకి నెడుతోంది. రోజుకో నిబంధన తెరపైకి తీసుకువస్తుండటంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. గోకులం షెడ్డు నిర్మాణానికి చెల్లించే 90 శాతం సబ్సిడీని తాజాగా 70 శాతానికి కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే లబ్ధిదారుడి వాటాగా గతంలో రైతు రూ.10 వేలు చెల్లిస్తే.. ప్రస్తుతం రూ.30 వేలు చెల్లించాల్సి వస్తోంది. జిల్లాలో ఇదీ పరిస్థితి పశు పోషణను ప్రోత్సహించి, పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం జిల్లాలో మినీ గోకులాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులో అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. జిల్లా వ్యాప్తంగా 6,000 దరఖాస్తులు అందాయి. అందులో 3,785 దరఖాస్తులకు పంచాయతీ అధికారుల నుంచి ఆమోద ముద్ర పడింది. అందులో 3004 నిర్మాణాలకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. ప్రస్తుతం 2934 పనులు పురోగతిలోఉన్నట్లు అధికారిక లెక్కలు స్పష్టీకరిస్తున్నాయి. తొలి ఉత్తర్వు ఇలా.. ఈ ఏడాది ఆగస్టు 7న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు మినీ గోకులంపై మార్గదర్శకాలను జారీ చేశారు. అరసెంటు పట్టా కలిగి సొంత స్థలంతో పాటు రెండు పశువులు ఉంటే యూనిట్ విలువ రూ.లక్షగా ఖరారు చేయగా అందులో రూ.90 వేలు రాయితీ ఇస్తారు. రైతు తన వాటా రూ.10 వేలు చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు పశువులు ఉంటే సెంటు భూమి కావాలి. యూనిట్ ధర రూ.1.50 లక్షలు. ప్రభుత్వం రూ.1.35 లక్షలు ఇస్తుంది. లబ్ధిదారు రూ.15 వేలు భరించాలి. ఆరు పశువులున్న వారికి ఒకటిన్నర సెంటు స్థలం ఉండాలి. పాక నిర్మించుకుంటే రూ.1.80 లక్షలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం రూ.1.65 లక్షలు ఇస్తే పశుపోషకులు రూ.18 వేలు చెల్లిస్తే సరిపోతుంది. రెండో ఉత్తర్వు మినీ గోకులాల నిర్మాణాలకు సబ్సిడీతో పాటు యూనిట్ ధరను కూడా ప్రభుత్వం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు సైతం జారీ చేసింది. గతంలో రెండు పశువులున్న గోకులానికి రూ.లక్ష ఉండగా, ప్రస్తుతం రూ.90 వేలు, నాలుగు పశువులున్న యూనిట్ ధరను రూ.1.50 లక్షల నుంచి రూ.1.40 లక్షలకు, ఆరు పశువులున్న యూనిట్ ధరను రూ.1.80 లక్షల నుంచి రూ.1.70 లక్షలకు తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మూడు విభాగాల్లో ఎంపికైన లబ్ధిదారుల్లో చాలామంది ముందస్తుగా 10 శాతం డీడీలు చెల్లించారు. కొన్నిచోట్ల గుంతలు, మరికొన్ని చోట్ల పిల్లర్లు, ఇంకొన్ని రేకుల దశలో ఉన్నాయి. వీటికి 90 శాతం సబ్సిడీ వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఒక వేళ ముందస్తుగా మంజూరైన, పనులు చేపట్టినా బిల్లుల ప్రతిపాదనలు పంపకుండా జాప్యం జరిగుంటే వీరంతా 30 శాతం తన వాటా కింద చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై స్పష్టత లేక రైతుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే 10 శాతం కట్టారు.. మరో 20 శాతం చెల్లించాలని అధికారులు కబురు పంపుతున్నారు. ఇది మరింత అలజడికి గురి చేస్తోంది. సామాజిక గోకులాలదీ అదే తీరు సామాజిక గోకులాల యూనిట్ ధరను రూ.21 లక్షల నుంచి రూ.13 లక్షలకు కుదించారు. ఇందులో రూ.11.70 లక్షలు ఉపాది నిధులు, రూ.1.30 లక్షలు పశుసంవర్ధక శాఖ నిధులు కేటాయిస్తారని తెలిపారు. రైతుల పెదవి విరుపు ఆర్భాటంగా ప్రారంభించిన పథకంలో సబ్సిడీ తగ్గించడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. దరఖాస్తుకు ముందు ఊరించి.. అనంతరం సబ్సిడీని 70 శాతానికి తగ్గించడంతో తాము తీవ్రంగా నష్టపోతాయని రైతులు అంటున్నారు. నిర్మాణాలకు 10 శాతం మొత్తం భరిస్తే చాలని ప్రభుత్వం గతంలో జీవో ఇవ్వడంతో పాడి రైతులు జిల్లా వ్యాప్తంగా లక్ష్యానికి మించి దరఖాస్తు చేశారు. జిల్లాలో మూడు వేల మినీ గోకులాల నిర్మాణాలు లక్ష్యం కాగా సుమారు ఏడు వేల దరఖాస్తులు అందినట్లు సమాచారం. అయితే సబ్సిడీ తగ్గించడంతో రైతులు దరఖాస్తులను వెనక్కు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. -
‘గోకులం’ గోవిందా..!
సాక్షి, అమరావతి: గోకులాలు నిర్మించుకునే రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తామని ఊరూరా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ పశు సంవర్థకశాఖ అకస్మాత్తుగా ప్లేట్ తిప్పేసింది. తూచ్...90 కాదు 70 శాతం రాయితీనే ఇస్తామని కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు బిత్తరపోతున్నారు. రాయితీ అధికంగా వస్తుందనే ఆశతో అప్పు చేసి మరీ గోకులాల నిర్మాణాలు ప్రారంభించిన రైతులు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నిధుల కొరత వెన్నాడుతోందంటూ పది రోజుల క్రితం చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు రాయితీ కూడా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల వ్యవధిలో దెబ్బ మీద దెబ్బ తగలడంతో ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఉపయోగపడే పథకాలకు రాయితీలు తగ్గించిన ప్రభుత్వం మరోవైపు వారు ఆసక్తి చూపని పథకాలకు రాయితీలు పెంచుతోంది. ఇతర రాష్ట్రాల్లో పాడిపశువులు కొనుగోలు చేసే రైతులకు రవాణా ఖర్చులు కూడా ఇస్తామని ఇటీవల ప్రకటించింది. గతంలో రైతులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పాడిపశువులను ఎంపిక చేసుకుని, వాటిని తరలించడానికి అయ్యే ఖర్చును తామే భరించేవారు. అయితే ఇటీవల ఆ రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. కానీ ఈ పథకంపై రైతులు ఆసక్తి చూపడంలేదు. ఇతర రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులు ఇక్కడి పరిస్థితులకు భిన్నంగా ఉండటంతో దూడలు చనిపోవడం లేదా పాల దిగుబడి తగ్గిపోవడం జరుగుతోంది. ఈ రెండు కారణాల వల్ల రైతులు ఇతర రాష్ట్రాల్లోని పాడి పశువుల కొనుగోలు పథకం పట్ల ఆసక్తి చూపడం లేదు. అయితే ఈ పథకం అమలుతో పశు సంవర్థకశాఖ అధికారులు, వైద్యులకు మామూళ్లు అధికంగా వస్తుండటంతో ఆ పథకం కొనసాగింపునకు రవాణా ఖర్చులు భరించే విధంగా నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వినపడుతోంది. దరఖాస్తులు పెరగడంతో చేతులేత్తేసిన ప్రభుత్వం రెండు పశువుల షెడ్లకు రూ.లక్ష, నాలుగు పశువుల షెడ్‌కు రూ.1.50 లక్షలు, ఆరు పశువుల షెడ్‌కు రూ.1.90 లక్షలు విడుదల చేస్తున్నట్టు అధికారులు రైతులకు చెప్పారు. రెండు పశువులకు షెడ్ నిర్మించుకునే రైతులు రూ.10 వేలు సమకూర్చుకుంటే షెడ్ నిర్మించుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో 2 వేల మంది రైతులు తమ నిర్మాణాలను ప్రారంభించి సగం వరకు పూర్తి చేశారు. మిగిలిన నిర్మాణానికి డబ్బులు లేకపోవడంతో పార్ట్బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఉపాధిహామీ పథకం నిధులను కూడా ఈ పథకానికి వినియోగిస్తున్న నేపధ్యంలో నిబంధనల ప్రకారం పరికరాల కొనుగోలుకు అధికంగా నిధులు ఖర్చు చేయడంతో రైతుల నిర్మాణాలకు నిధులు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం 20 పశువులను ఒకేచోట పెంచేందుకు చేపట్టే పెద్ద గోకులాలకు రాయితీని తగ్గించింది. ఒక్కో జిల్లాకు 38 గోకులాలు నిర్మించాలని నిర్ణయించింది. అయితే అన్ని జిల్లాల్లో గోకులాలు, మినీ గోకులాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం చేతులెత్తేసింది. మొదట్లో ప్రకటించిన విధంగా 90 శాతం రాయితీ కాకుండా 70 శాతం రాయితీనే ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. పెద్ద గోకులాల నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం కింద రూ.18.50 లక్షలు, మిగిలిన రూ.2.50 లక్షలు పశుసంవర్థక శాఖ భరిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తగ్గిన రాయితీ ప్రకారం పెద్ద గోకులాల యూనిట్ విలువ రూ.20.50 లక్షల నుంచి రూ.13. లక్షలకు తగ్గిపోయింది. ఒక్కో యూనిట్‌కు రూ.7.50 లక్షల రాయితీ తగ్గిపోవడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. ఇచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవద్దని, తాము ఇప్పట్లో వాటిని నిర్మించలేమని కొందరు రైతులు చెప్పడం ప్రారంభించారు. ఇదే విధంగా మినీ గోకులాల్లోనూ ఇదే పరిస్ధితి... రూ.లక్ష విలువైన యూనిట్‌కు రూ.30 వేలు రైతులు భరించాల్సి రావడంతో ఆ మొత్తాన్ని భరించలేక తమకు ఆ పథకం వద్దని చెబుతున్నారు. ఇదీ గోకుల పథకం రాష్ట్రంలో పాడి రైతులకు చేయూత నిచ్చేందుకు ఎనిమిది వేల షెడ్ల (మినీ గోకులాలు) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు, నాలుగు, ఆరు పాడి పశువులు కలిగిన రైతులు ఈ షెడ్ల నిర్మాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, పాడి పశువుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ 8 వేల షెడ్లను నిర్ణీతకాల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాల వారీగా అధికారులకు లక్ష్యాలను నిర్ణయించింది. అధికారులు గ్రామాల్లో పర్యటించి 90 శాతం రాయితీ ఇస్తున్న గోకుల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రచారం చేశారు. -
గోకులాల్లో గోసంపద
అన్నదాతకు పాడి పశువుల పెంపకం భారంగా మారింది. పశు పోషణ, వసతి రైతులకు శిరోభారం కావడంతో చాలా మంది వాటిని విక్రయించి రైతువారీ పనులు చేసుకుంటున్నారు. ఒకప్పుడు పాడి పశువులతో కలకలలాడే గ్రామాల్లో నేడు అవి లేక వెలవెలబోతున్నాయి. ఈ క్రమంలో పాడి పశువులను అభివృద్ధి చేసి పాల దిగుబడిని పెంచేడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. వివరాల్లోకి వెళ్తే... పార్వతీపురం: పశు సంవర్ధక శాఖ ద్వారా ఊరూరా గోకులాలను ఏర్పాటు చేసి అందులో పాడి పశువులకు ఆశ్రయం కల్పించి వాటి రక్షణతో పాటు పాల దిగుబడిని పెంచే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రణాళికలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాకు తొలి విడతగా 25 యూనిట్లు మంజూరు... జిల్లాకు తొలి విడతగా 25 గోకులం యూనిట్లు మంజూరయ్యాయి. ఇందు కోసం పశు సంవర్ధక శాఖ అధికారులు గ్రామాల వారిగా యూనిట్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపించే రైతుల వివరాలను నమోదు చేసుకున్నారు. 25 యూనిట్లు మంజూరు చేసినప్పటికీ పశుసంవర్ధక శాఖ అధికారులు మాత్రం మండలానికి మూడు యూనిట్లు చొప్పున మంజూరు చేయడానికి గ్రామాలను ఎంపిక చేశారు. ఎంపిక చేసిన గ్రామాల్లో ఏ గ్రామంలో అయినా ఈ యూనిట్ మంజూరు చేయడానికి అనుకూలమైన వసతులు లేకుంటే అక్కడ నుంచి వేరొక గ్రామానికి తరలించే అవకాశం ఉంటుంది. దీని దృష్ట్యా ముందస్తుగా మూడు గ్రామాలు చొప్పున ఎంపిక చేశారు. ఇలా పార్వతీపురం ఐటీడీఏ ఉప ప్రణాళికా ప్రాంతంలోని పార్వతీపురం మండలంలో 4 గ్రామాలు, కొమరాడలో–3, గరుగుబిల్లి–3, కురుపాం–3, జియ్యమ్మవలసలో–3, గుమ్మలక్ష్మీపురంలో –3, మక్కువ–3, సాలూరు–3 గ్రామాలు చొప్పున ఎంపిక చేశారు. ఒక్కో యూనిట్‌కు రూ.21 లక్షలు.. ఒక్కో గోకులం నిర్మాణానికి రూ.21లక్షలు మంజూరు చేస్తారు. ఇందులో ఉపాధి హామీ పథకం ద్వారా రూ.18.50లక్షలు, పశు సంవర్ధక శాఖ నుంచి రూ.2.50లక్షలు మంజూరు చేస్తారు. ఈ యూనిట్‌ను నిర్వహించడానికి ఆయా గ్రామాలకు చెందిన పాడి రైతులతో పాటు మరికొందరితో ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీని విలేజ్ ఆర్గనైజేషన్ కమిటీ అంటారు. కమిటిటీలో పాడి పశువులు ఉన్న ముగ్గురు రైతులు, ఒక పశువైద్యాధికారి, గ్రామ కార్యదర్శి ఉంటారు. వీరు ఈ గోకులం యూనిట్‌ను నిర్వహిస్తారు. ఈ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కొన్ని నిబంధనలు విధించారు. తప్పనిసరిగా ఆయా గ్రామాలకు రహదారి సౌకర్యం, నీటి వసతి, విద్యుత్ సదుపాయం కలిగి ఉండడంతో పాటు మహిళా గ్రూపులకు చెందిన కుటుంబంలో ఉన్న రైతులు అర్హులు. అంతే కాకుండా పశువైద్య కేంద్రానికి అందుబాటులో ఉన్న గ్రామాల్లో మాత్రమే ఈ గోకులం యూనిట్లను మంజూరు చేస్తారు. గోకులం యూనిట్ల నిర్మాణం కోసం ఆయా గ్రామాల్లో ప్రభుత్వానికి చెందిన 25 సెంట్లు భూమిని కేటాయించాల్సి ఉంటుంది. గోకులాల ఉపయోగం... ప్రస్తుతం గ్రామాల్లో పశువులు ఇంటికి ఒకటో లేక రెండో ఉంటాయి. వాటి కోసం ఇంటి ముందు లేక వెనక భాగంలో పశువుల శాలను నిర్మించాలి. రోజూ శాలను శుభ్రపరచాలి. వాటిని మేతకు తోలుకు పోవాలి. పాడి పశువులకు దాణా పెట్టాలి. జబ్బు చేస్తే వైద్యుని వద్దకు తోలుకుపోవాలి. ఇలా ఎవరికి వారే ఈ పనులు చేసుకోవాలి. ఇది రైతులకు కష్టతరమైన పని. కాబట్టి రైతులందరి పాడి పశువులను ఒకే చోటకు చేర్చి వాటికి మేత, తాగునీరు, వైద్య పరీక్షలు చేయడం, అవసరమైన మందులు వేయడం వంటి సౌకర్యాలున్నా గోకులంలో లభ్యమయ్యే విధంగా ప్రణాళికలు తయారు చేశారు. ఒక గ్రామానికి చెందిన 20 మంది రైతులకు చెందిన పాడి పశువులను ఈ గోకులంలో చేర్చి వాటిని సంరక్షిస్తారు. ఇక్కడ పశువులకు అవసరమైన సైలేజ్ గడ్డి, దాణామృతం వంటి మేతను రాయితీపై ప్రభుత్వం అందిస్తుంది. పశువులకు జబ్బు చస్తే కమిటిలో ఉన్న వైద్యులకు సమాచారం ఇవ్వగానే వెంటనే వైద్యాధికారి వచ్చి పశువులకు అవసరమైన వైద్య పరీక్షలు చేసి మందులు ఇస్తారు. పాడి రైతులకు వరం గోకులాలు అందుబాటులోకి వస్తే పాడి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 25 గోకులాలు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. ఒక్కో యూనిట్‌కు రూ.21లక్షలు మంజూరు కానుంది. ఒక గ్రామంలో ఉన్న 20 మంది పాడి రైతులను గుర్తించి వారి పాడి పశువులను ఈ గోకులాల్లో చేర్పించి ఒకే చోట అన్ని రకాల సేవలు అందించడం జరుగుతుంది. పశువులు ఊరిలో విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉండదు. తాగునీరు, మేత ఒకే చోట లభిస్తాయి. గోకులాలు అందుబాటులోకి వస్తే జిల్లా వ్యాప్తంగా ఉన్న పాడి రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.–యండ సింహాచలం, పశుసంవర్ధక శాఖ, జాయింట్ డైరెక్టర్ -
ఇది సూడాన్ గోకులం..
దక్షిణ సూడాన్.. నైలు నదీతీరం.. తెలవారింది.. ముండరీ తెగ నిద్రలేచింది.. పళ్లు తోముకున్నారు..తర్వాత గోమూత్రాన్ని నెత్తిన పోసుకున్నారు!! యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయనే కాదు. ఆవు అమ్మలాంటిది, తమను ఎలాంటి ఆపదనుంచైనా రక్షిస్తుందన్నది వారి నమ్మకం. నేరుగా పొదుగు నుంచి పాలు తాగారు.. ఢంకా మోగించారు.. పశువులను మేతకు తీసుకెళ్లే సమయమైంది అనడానికి సంకేతంగా.. ఇది సూడాన్ గోకులం.. ఆవుతోనే వీరికి రోజు మొదలవుతుంది. ఆవుతోనే ముగుస్తుంది. గోవులు.. ముండరీ తెగ బలం, గర్వం, ఆస్తి, ఆత్మాభిమానం. పశువులను వీరు తమ కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. గోమూత్రంతో స్నానం చేస్తారు. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంతోపాటు వారి జుత్తు కూడా ఎర్రగా మారి ఎంతో అందంగా ఉంటుందట. అంతేకాదు పిడకలను కాల్చి, పొడి చేసి, టాల్కం పౌడర్లా ఒళ్లంతా రాసుకుంటారు. పశువులకూ రాస్తారు. యాంటీసెప్టిక్‌గా ఉండటంతోపాటు దోమల కాటు నుంచీ రక్షణ కల్పిస్తుందట. అటు ఎండల నుంచి కూడా కాపాడుతుందట. ముండరీ తెగ ప్రజల జీవితాలు శతాబ్దాలుగా పశువులతో పెనవేసుకుపోయాయి. ఇక్కడి పశువులు ఎంతో బలంగా ఉంటాయి. వీటిని దొంగిలించుకుపోవడానికి దాడులూ జరుగుతుంటాయి. వీటిని కాపాడుకోవడానికి వారు తమ ప్రాణాలను సైతం పణంగా పెడతారు. ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా పశువులను అమ్మరు. ఎందుకంటే.. వీరికి ఆవు అమ్మ.. ఆవే అన్నీనూ..