Golaghat
-
మూడేళ్ల బంధం.. ముగ్గురి హత్యలతో విషాదాంతమైన లాక్డౌన్ ప్రేమ..
కరోనా లాక్డౌన్లో చిగురించిన ప్రేమను పెళ్లితో భద్రపరుచుకున్నారు. కానీ వారి సంబరం ముణ్నాళ్ల ముచ్చటగానే మారింది. మూడేళ్ల ప్రేమ బంధం.. ముగ్గురి హత్యలతో షాదాంతంగా ముగిసింది. ట్రిపుల్ మర్డర్ అనంతరం నిందితుడు తొమ్మిది నెలల శిశువును చంకలో ఎత్తుకొని పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. అస్సాంలోని గోలాఘాట్ జిల్లాకు చెందిన మెకానికల్ ఇంజనీర్ అయిన నజీబుర్ రెహ్మాన్(25), 24 ఏళ్ల సంఘమిత్ర ఘోష్‌లు 2020లో ఫేస్బుక్ ద్వారా స్నేహితులయ్యారు. కొన్ని రోజుల్లోనే వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీంతో అదే సంవత్సరం అక్టోబర్‌లో ఇద్దరూ కోల్‌కతాకు పారిపోయారు. తరువాత సంఘమిత్ర తల్లిదండ్రులు ఆమెను తిరిగి ఇంటికి తీసుకువచ్చారు. అయితే ఆమె అప్పటికే కోల్‌కతా కోర్టులో నజీబుర్‌ను వివాహం చేసుకున్న విషయం తల్లిదండ్రులకు చెప్పింది. తర్వాతి ఏడాది సంఘమిత్ర తల్లిదండ్రులు సంజీవ్ ఘోష్, జును ఘోష్ సొంత కుమార్తెపైనే దొంగతనం కేసు పెట్టడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి నెల రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. బెయిల్ రావడంతో తిరిగి ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి చేరింది. చదవండి: హైదరాబాద్‌లో మరో హిట్ అండ్ రన్ కేసు జనవరి 2022లో సంఘమిత్ర, నజీబుర్ మళ్లీ ఇంట్లో నుంచి పరారయ్యారు. అయిదు నెలలపాటు ఇద్దరూ చెన్నైలో నివాసం ఉన్నారు. తరువాత ఆ జంట ఆగస్టులో గోలాఘాట్‌కు తిరిగి వచ్చేసరికి సంఘమిత్ర గర్భవతిగా ఉంది. వీరిద్దరూ నజీబుర్ ఇంటిలో జీవించడం ప్రారంభించారు. గత నవంబర్‌లో ఈ జంటకు ఓ కుమారుడు జన్మించాడు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ నాలుగు నెలల తర్వాత సంఘమిత్ర తన కొడుకుతో ఈ ఏడాది మార్చిలో తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది. నజీబుర్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో నజీబుర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. 28 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, నజీబుర్ తన కొడుకును కలిసేందుకు ప్రయత్నించగా.. సంఘమిత్ర కుటుంబం అందుకు ఒప్పుకోలేదు. అనంతరంఏప్రిల్ 29న సంఘమిత్ర, ఆమె కుటుంబ సభ్యులు నజీబుర్‌పై దాడి చేశారని ఆరోపిస్తూ అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో నజీబుర్ తన భార్య సంఘమిత్ర, ఆమె తల్లిదండ్రులను కొడవలితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తన తొమ్మిది నెలల కొడుకును చేతిలో ఎత్తుకొని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిందితులపై హత్యా తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని అస్సాం పోలీసు చీఫ్ జీపీ సింగ్ తెలిపారు. ఈ దారుణ హత్యపై రాష్ట్ర సీఐడీ బృందం విచారణ చేపట్టింది. ఫోరెన్సిక్ బృందాలను కూడా రప్పించామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
విషపూరిత మద్యం: 80కి చేరిన మృతులు
డిస్పూర్ : అస్సాంలో విషపూరిత మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 80కి చేరింది. మృతుల్లో గోలాఘాట్‌కు చెందిన వారే 39 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరే కాక మరో 300 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వేడుకలో భాగంగా తేయాకు తోటల్లో పనిచేసే కూలీలు ఈ కలుషిత మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం గోలాఘాట్‌లోని సల్మారా టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న కూలీలు రాత్రి వేడుక చేసుకున్నారు. దానిలో భాగంగా సంజు ఒరాంగ్ అనే కూలి మద్యం తీసుకొచ్చారు. ఆ మద్యం సేవించిన కాసేపటికే ఇద్దరు మహిళలు కుప్పకూలారు. దాంతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషపూరిత మద్యం తీసుకోవడం వల్లే వారు మరణించినట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం ఉదయం మరో 13 మంది ఇదే విధంగా ప్రాణాలు కోల్పోయారు. శనివారం నాటికి మృతుల సంఖ్య 84కు చేరుకుంది. ఈ ఘటనలో మద్యం అమ్మిన వ్యక్తి సంజు ఒరాంగ్, అతడి తల్లికూడా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. తేయాకు తోటల్లో పనిచేసే వారికి వారానికోసారి కూలీలు ఇస్తుంటారు. ఈ క్రమంలో వారికి గురువారం కూలీలు అందాయి. దాంతో పెద్ద ఎత్తున కూలీలు అక్కడకు చేరుకుని వేడుకలు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. తేయాకు తోటల్లో పనిచేసే కూలీలు వేడుకలో భాగంగా ఈ కలుషిత మద్యం సేవించడం వల్లనే ఘటన జరిగినట్లు స్థానిక పోలీస్ అధికారి పుష్‌రాజ్ సింగ్ తెలిపారు. రసాయనాలు కలిగిన క్యాన్‌లో మద్యం తీసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా కల్తీ మద్యం కారణంగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో 97 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. -
అస్సాంలో పోలీసు కాల్పులు
ముగ్గురి మృతి, 20 మందికి గాయాలు అస్సాం-నాగాలాండ్ సరిహద్దులో కొనసాగుతున్న నిరసనలు గోలాఘాట్: అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలో తొమ్మిది మంది హత్యకు నిరసనగా కొనసాగుతున్న వరుస ప్రదర్శనలు బుధవారం రక్తసిక్తమయ్యాయి. నిరసనకారులు పట్టణంలోని డిప్యూటీ పోలీసు కమిషనర్ కార్యాలయంతో పాటు ఓ పోలీసు స్టేషన్‌కు నిప్పుపెట్టేందుకు ప్రయత్నించడం, ఓ ఆసుపత్రిపై దాడికి యత్నించడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ముగ్గురు మరణించగా, 20 మందికిపైగా గాయపడ్డారు. గోలాఘాట్ జిల్లాలోని ఉరియమ్‌ఘాట్‌లో ఆగస్టు 12న కొందరు దుండగులు కొంత మందిని కాల్చిచంపడం, వారు పొరుగునున్న నాగాలాండ్‌కు చెందినవారని భావిస్తుండటంతో అస్సాంలో నిరసన జ్వాలలు కొనసాగుతున్నాయి. రాన్గజన్ ప్రాంతంలో మంగళవారం స్థానికులను పోలీసులు ఇళ్ల నుంచి బయటికి లాక్కొచ్చి మరీ చితక్కొట్టిన ఉదంతాన్ని నిరసిస్తూ బుధవారం ఎరెంగపడ చరైలీ ప్రాంతంలో ఆందోళనలు చేపట్టారు. డీసీపీ కార్యాలయం, పోలీసు స్టేషన్ వద్ద గుమిగూడిన వెయ్యిమందికిపైగా ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు తొలుత బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అల్లరిమూక రాళ్లు విసరడంతోపాటు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కాల్పులు ప్రారంభించారు. నిరసనకారులు కుషాల్ కన్వర్ ఆస్పత్రిపై దాడికి పూనుకోవడంతో పాటు రాళ్లు రువ్వి పౌరులనూ గాయపర్చారని స్థానిక ఎస్పీ శిలాదిత్య చేటియా పేర్కొన్నారు. తాజా ఘటనల నేపథ్యంలో అస్సాంలోని నాగాలాండ్ సరిహ ద్దు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించి, సైన్యాన్ని మోహరించారు. కాగా, నిరసనకారులపై కాల్పుల ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జితో జ్యుడీషియల్ దర్యాప్తునకు ఆదేశించారు. మరోవైపు అస్సాం-నాగాలాండ్ సరిహద్దులో హింసపై ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు కేంద్ర హోం శాఖ నివేదికను సమర్పించింది. గొగోయ్, నాగాలాండ్ సీఎం టీఆర్ జిలియాంగ్లతో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడి వివాదాన్ని త్వరగా సద్దుమణిగేలా చేయాలని సూచించారు. ఇదీ అల్లర్ల నేపథ్యం: అస్సాం-నాగాలాండ్ సరిహద్దు వివాదం 50 ఏళ్ల క్రితం.. నాగాలాండ్ రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచీ కొనసాగుతోంది. ప్రతిసారీ మీరంటే మీరే దురాక్రమణలకు దిగుతున్నారంటూ ఇరురాష్ట్రాల వారూ ఆరోపించుకుంటూ వస్తున్నారు. ఈ సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వం వహించినా.. సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యలో తాజాగా అస్సాంలోని ఏడు సరిహద్దు గ్రామాల్లో ఇటీవల 15 మంది హత్యకు గురయ్యారు.