బంగార నిల్వల వివరాలివ్వండి:ఆర్ బీఐ
తిరువేండ్రం: రూపాయి పతనాన్ని అడ్డుకోవడానికి ఆర్ బీఐ తన చర్యలను ముమ్మరం చేస్తోంది. గతంలో బంగారంపై పన్ను శాతాన్ని పెంచి బంగారు కొనుగోళ్లకు కొంత వరకూ అడ్డుకట్టవేయ కల్గిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా బంగార నిల్వలపై ఆరాలు తీస్తోంది. దేవస్థానాల్లో ఏ మేరకు నిల్వలున్నాయన్నవివరాలను సేకరిస్తూ తమ కార్యచరణను ముమ్మరం చేసింది. ఈ మేరకు కేరళ రాష్ట్రంలోని గురవాయర్ దేవస్థానం బోర్డుకు ఓ లేఖను రాసింది. గురువాయర్ ఆలయంలో ఎంత వరకూ బంగారం ఉందన్న వివరాలను తమకు తెలియజేయాలని ఓ లేఖను సంధించింది.
దేవస్థాన బంగార నిల్వలపై వివరాలను తమకు అందజేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరిన విషయాన్ని ఆ దేవస్థాన బోర్డు ఉన్నతాధికారి ఐఎన్ఎస్ కు వెల్లడించారు. ఈ అంశంపై దేవస్థాన కమిటీ మాత్రమే తుది నిర్ణయం తీసుకుంటుందని, అందుచేత ఆ లేఖను కమిటీకి అందజేశామన్నారు.