Goodwill
-
పాపమైనా, పుణ్యమైనా దక్కేది వాళ్లకే!.. పది మంది క్షేమాన్ని కోరగలిగినపుడే
అది మంచి పని కానీయండి, చెడ్డపని కానీయండి. మంచి పని చేస్తే కీర్తి వస్తుంది. మనిషి వృద్ధిలోకి వస్తాడు. చెడ్డ పని చేస్తే అపకీర్తి వస్తుంది, పాడయిపోతాడు. అయితే ఒక పని జరిగింది అన్నప్పుడు ఆ పని వెనుక నలుగురు ఉంటారంటుంది శాస్త్రం. ఎవరా నలుగురు! చేసేవారు, చేయించేవారు, ప్రేరేపించేవారు, ఆమోదించేవారు. జరిగిన పనికి వచ్చిన ఫలితాన్ని.. వాటి వలన వచ్చే పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు సమానంగా పంచుకుంటారు. ఒక్కోసారి చెడ్డపని జరగకుండా ఆపే ప్రయత్నం కూడా మంచిపనే. మంచి పని జరగకుండా చూడడం తప్పు. చెడ్డ పని జరగకుండా చూడడం ఒప్పు. శాస్త్రం మీద నమ్మకం ఉండాలి. పదిమంది క్షేమాన్ని కోరగలిగిన గుణం ఉండాలి. భవిష్యత్తులో ఆపదలు రాకుండా ఉండాలన్న దీర్ఘదృష్టిని పొంది ఉండాలి. ఇవన్నీ ఉంటే తప్ప చెడ్డపనిని ఆపడం సాధ్యం కాదు. మొదట చేసాడు కనుక. తరువాత లోభాన్ని గెలిచాడు కనుక కర్త గొప్పవాడయ్యాడు. నాకేం అవసరం, నేనెందుకు చేయాలి? అన్న భావనలను దాటడం గొప్ప లక్షణం. అంతమంది చెయ్యకుండా కూర్చున్నారు కదా...నేనే ఎందుకు చేయాలి... అని ఎవరికి వారు అనుకొన్నప్పుడు లోకంలో అందరికీ పనికొచ్చే పనులు ఎలా జరుగుతాయి !!! పదిమందికి పనికొచ్చే ఒక నీటి సౌకర్యం, ఒక బాట సౌకర్యం కల్పించాలి... అన్న సంకల్పం రావడమే గొప్ప. అది నెరవేరాలంటే దానికి ఖర్చు పెట్టాలి. అది అర్ధ రూపాయి కావచ్చు, ఆరుకోట్ల రూపాయలు కావచ్చు. నేనెందుకు చేయాలి అన్న భావన వదిలి ఆ పని చేయడానికి సిద్ధమయ్యాడు అంటే లోభాన్ని గెలిచినట్లే. అందుకని ఆ పని తాలూకు ఫలితంలో నాలుగోవంతు ఆయనకు లభిస్తుంది. తరువాత– చేయించేవాడు. ఆ పనిని ఎవరు చేయగలరో గుర్తించి తాను వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి తాను కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రోత్సహించాడు. ఆ పని జరిగితే కీర్తి నాకు కాకుండా చేసిన వాడికి దక్కుతుందనే అసూయ కొద్దీ చేయకుండా తప్పుకుంటే చేసేవాడికి బలం ఉండదు. అలాకాక తాను కూడా ధైర్యంగా ముందుకడుగు వేసాడు కాబట్టి అసూయను గెలిచాడు. సంకుచితమైన ధోరణిని వదిలి... చేస్తున్న వాడి హితాన్ని, అందరి హితాన్ని కోరాడు కనుక ఆయనకూ నాలుగో వంతు ఫలితం. మూడవవారు– ప్రేరేపించిన వారు. కర్త తటపటాయిస్తూ కాలాన్ని వృథా చేయకుండా, త్వరగా మొదలుపెట్టు అంటూ, దాని అవసరాన్ని గుర్తు చేస్తూ వెంటబడి ప్రేరేపించబట్టి ఆ పని సకాలంలో పూర్తయింది కాబట్టి వీరికి కూడా నాలుగో వంతు ఫలితం దక్కుతుంది. ఆమోదించిన వాడు – యుక్తాయుక్త విచక్షణతో, శాస్త్రీయ దృక్పథంతో ఈ పనిమంచిదే, చెడ్డది మాత్రం కాదు, మంచే జరుగుతుంది, చేయవచ్చు అని అంగీకారం తెలిపితే చేసేవాడికి ఇక ఆ పనిలో మరే సందేహం ఉండదు, కనుక ఆమోదించినవాడికి కూడా నాలుగో వంతు లభిస్తుంది. ఇది తెలిస్తే ఏ పని అయినా ఉత్సాహంగా ముందుకు సాగుతుంది.. నేనేం చేయగలనండీ అని అడుగులు వెనక్కి పడవు. మంచి పనికి ఈ నలుగురు గట్టిగా ఇలా నిలబడాలి, అప్పుడే సమైక్యతతో ఏదయినా సాధించగలం. -
3 నుంచి టీటీడీ ‘శుభప్రదం’పై శిక్షణ
అనంతపురం కల్చరల్ : తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో జూన్ 3 నుంచి 9వ తేదీ వరకు ఎస్వీ జూనియర్ కళాశాలలో ‘శుభప్రదం’ పేరిట చిన్నారులకు ఆధ్యాత్మిక, వైజ్ఞానికి వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు టీటీడీ జిల్లా ధార్మిక ప్రచార మండలి అధ్యక్షుడు శ్రీపాద వేణు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. శిబిరంలో పాల్గొనే చిన్నారులకు ఉచిత వసతి, భోజన సౌకర్యంతో పాటు రానుపోనూ చార్జీలు ఇస్తామన్నారు. ఈనెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. వివరాలకు సెల్ : 9603699919లో సంప్రదించాలన్నారు. -
డబ్ల్యూహెచ్‌వో అంబాసిడర్‌గా అమితాబ్
న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తరఫున గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ నియమితులయ్యారు. ఆగ్నేయాసియా హెపటైటిస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆయన సేవలను వినియోగించుకుంటామని డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయాసియా రీజనల్ డైరెక్టర్ పూనం ఖేత్రాపాల్ సింగ్ తెలిపారు. హెపటైటిస్ వల్ల గర్భస్థ శిశుమరణాలు సంభవిస్తున్నాయని, వీటిపై అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు అమితాబ్ సహకారం తీసుకుంటామన్నారు. అమితాబ్ సహకారంతో 2030 కల్లా హెపటైటిస్ ప్రభావాన్ని తగ్గించడానికి డబ్ల్యూహెచ్‌వో కృషి చేస్తుందన్నారు. హెపటైటిస్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని అమితాబ్ బచ్చన్ తెలిపారు. తనలా ఎవరూ ఈ వ్యాధితో బాధపడకూడదని ఆకాంక్షించారు. డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం 9 కోట్ల మంది దీర్ఘకాలిక లివర్ వ్యాధులతో బాధపడుతున్నారు. -
గుడ్‌విల్... రూ.3 కోట్లు
ఎక్సైజ్‌శాఖలో మామూళ్ల వ్యవహారంపై అవినీతి నిరోధకశాఖ కొరడా ఝులిపించిన సమయంలో అన్నీ సంచలనాలే. వ్యాపారులే కాదు.. అధికారులు సైతం కేసుల పాలయ్యారు. అయినా, ఈ భయం కొన్నాళ్లే కనిపించింది. ఈ ఏడాది కొత్తగా ఏర్పా టైన మద్యంషాపులపై అప్పుడే పడిపోతున్నారు. ఆబ్కారీశాఖలోని విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు జిల్లావ్యాప్తంగా ఏర్పాటైన కొత్త దుకాణాలనుంచి గుడ్‌విల్ రూపంలో జిల్లా ఎక్సైజ్ అధికారులు కనీసం రూ.3కోట్లు వసూలు చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నెలనెలా ఇచ్చే మామూళ్లకు తోడు, ‘గుడ్‌విల్ ’ కింద ఒక్కో షాపునుంచి సగటున రూ.లక్ష డిమాండ్ చేస్తుండడంతో దుకాణదారులు గుడ్లు తేలేస్తున్నారు. జిల్లాలో మొదటివిడతలో 255 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా ఖరారు చేశారు. ఆ తర్వాత మరో 12 షాపులనూ ఓకే చేశారు. మొత్తంగా ఇప్పుడు 267 మద్యం దుకాణాలు నడుస్తున్నాయి. నెలరోజులపాటు ఓపిక పట్టిన ఎక్సైజ్ అధికారులు ఇక, తమ ప్రతాపం మొదలుపెట్టారు. ప్రతిషాపునకు కనీసం రూ.లక్ష గుడ్‌విల్‌గా ఇవ్వాలని షరతు పెట్టారు. ప్రతిషాపు నుంచి రూ.లక్ష వ సూలు చేస్తే ఆ మొత్తమే రూ.2.67కోట్లు అవుతోంది. వ్యాపారం ఎక్కువగా సాగే దుకాణాలు, ఒక మండలంలో కేవలం రెండు షాపు లు మాత్రమే ఉంటే వారి బిజినెస్ ఎక్కువగా సాగుతుంది కాబట్టి అలాంటి షాప్‌కు లక్ష కంటే ఎక్కువే డిమాండ్ చేస్తున్నారు. అంతా కలిపి గుడ్‌విల్ కింద రూ.3కోట్ల వసూలుకు స్కెచ్ వేశారని సమాచారం. ఇదీ... లెక్క! ప్రతీ షాప్ కొత్తగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి వ్యాపారులు, డిపార్టుమెంటు మధ్య మంచి సంబంధాలు ఉండాలి కాబట్టి, గుడ్‌విల్ ఇవ్వాలన్నది ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారుల కండీషన్.నెల నెలా ప్రతీ దుకాణం నుంచి ఇవ్వాల్సిన మామూలు దీనికి అదనం. షాపు ఉన్న ఏరియా, జరిగే వ్యాపారాన్ని బట్టి రూ.6వేల నుంచి రూ.15వేలు ఒక్కో సర్కిల్ పరిధిలో ఇవ్వాలి. ఇది రమారమి ఒక్కో షాప్‌కు ఇది ఏటా రూ.1.50లక్షలు అవుతోంది.ఇంతే మొత్తంలో పోలీసులకు ముట్టజెప్పాల్సి ఉంటోంది. అంటే మరో రూ.1.50లక్షలు. వెరసి ఏడాదిలో ఒక దుకాణం నుంచి రూ.3లక్షలు మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. మద్యం వ్యాపారులు విక్రయాల్లో పాటించాల్సిన నిబంధనలను అక్కడక్కడా అమలు చేయరు. దీంతో ఒక షాప్‌పై కేసు రాస్తే రూ.లక్ష ఫైన్‌తో పాటు, 15రోజులు దుకాణం బంద్ పెట్టాలి. దీంతో ఇదంతా ఎందుకు, ముందే గుడ్‌విల్, మామూళ్లు ఇచ్చేసుకుంటే, ఎక్సైజ్ అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేస్తారన్న ఆశ వ్యాపారులది.ుంచి ఆదాయం ఉంటే స్టేషన్లలో పోస్టింగ్ కోసం కొందరు ఎక్సైజ్ సీఐలు లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఒక్క నల్లగొండ ఎస్హెచ్ఓ కింద ఏకంగా 56 మద్యం దుకాణాలు ఉన్నాయి. అంటే, ఇక్కడ పనిచేసే వారికి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఇక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది మధ్య పర్సెంటీజీల పంపకాల్లో తేడాలో వచ్చి ఘర్షణ పడినట్లు చెబుతున్నారు. మద్యం దుకాణాల లెసైన్సులను ఖరారు చేసి, ఫైల్క్లియర్ చేసేది తామే కాబట్టి ఎస్సైలకు గుడ్‌విల్ అమౌంట్ ఎందుకు పంచాలి..? అంతా మాకే కావాలని కొందరు సీఐలు పేచీ పెడుతున్నట్లు సమాచారం. మొత్తంగా తెలుస్తోందేమంటే, జిల్లా ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారులు, మరికొందరు ఉద్యోగులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు.