మున్సిపల్ చైర్మన్‌గా గోపాలబాబు ప్రమాణస్వీకారం
రామచంద్రపురం :
స్థానిక మున్సిపల్ చైర్మ¯ŒSగా ఎస్ఆర్కే గోపాలబాబు శనివారం ప్రమాణస్వీకారం చేశారు. స్థానిక కౌన్సిల్ హాల్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో తొలుత ఆయనను చైర్మ¯ŒSగా టీడీపీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఈ సమావేశానికి ప్రత్యేకాధికారిగా హాజరైన జేసీ ఎస్.సత్యనారాయణ ఈమేరకు ఎన్నిక ధ్రువపత్రాన్ని ఆయనకు అందజేశారు. గోపాలబాబు ఇటీవల జరిగిన 17వవార్డు ఉప ఎన్నికల్లో కౌన్సిలర్‌గా గెలుపొందిన విషయం విదితమే. ఎక్స్అఫీషియో సభ్యునిగా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, కమిషనర్ చిలకమర్తి శ్రీరామశర్మ, మున్సిపల్ మేనేజర్ జి. రాధాకృష్ణ హాజరయ్యారు. మండపేట మున్సిపల్ చైర్మ¯ŒS చుండ్రు శ్రీవరప్రకాశ్ ఈ సందర్భంగా విచ్చేసి గోపాలబాబును అభినందించారు.