Gopalganj district
-
మతగురువు దారుణ హత్య.. పోలీసులపై గ్రామస్థుల ఆగ్రహం
పాట్నా: బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ఆరు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మతగురువు స్థానికంగా శవమై కనిపించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల వైఫల్యంపై స్థానిక యువత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసు వాహనానికి నిప్పంటించారు. మనోజ్ కుమార్ దనపుర్ గ్రామంలోని శివ దేవాలయంలో మతగురువుగా పనిచేస్తున్నారు. టెంపుల్‌కి పూజ కోసం వెళ్లిన మనోజ్ కుమార్.. గత ఆరు రోజులగా కనిపించకుండా పోయారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ మనోజ్ కుమార్‌ను కనిపెట్టలేకపోయారు. చివరికి మనోజ్ కుమార్ స్థానిక పొదల్లో శవమైన కనిపించారు. ఆయన శరీరం నుంచి కళ్లను పెరికివేశారు. జననాంగాలను కోసేశారు దుండగులు. ఈ వార్త తెలవడంతో స్థానిక గ్రామస్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. దర్యాప్తు చేపట్టిన పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనిపించిన పోలీసులపై రాళ్లు రువ్వారు. హైవేపై నిలిపి ఉంచిన పోలీసు వాహనానికి నిప్పంటించారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని జిల్లా పోలీసు అధికారి ప్రాంజల్ తెలిపారు. అయితే.. మనోజ్ కుమార్ సోదరుడు అశోక్ కుమార్ షా స్థానికంగా బీజేపీ డివిజినల్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. బయటకు వెళ్లిన మనోజ్ కుమార్ ఇంటికి వస్తాడనే నమ్మకం ఉండిందని భావించినట్లు మరో సోదరుడు సురేష్ షా తెలిపారు. మనోజ్‌ను ఎందుకు చంపారో? తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపడతామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు -
జైల్లో ఆకస్మిక తనిఖీలు.. మొబైల్ ఫోన్ మింగేసిన ఖైదీ..
పాట్నా: బిహార్ గోపాల్‌గంజ్ జిల్లా జైల్లో ఓ ఖైదీ మొబైల్ ఫోన్ మింగేశాడు. అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో ఫోన్ విషయం బయటపడుతుందని భయపడి దాన్ని అమాంతం నోట్లో వేసుకున్నాడు. హమ్మయ్య ఇక ఎవరూ కనిపెట్టలేరని ఊపిరిపీల్చుకున్నాడు. శనివారం ఈ ఘటన జరిగింది. అయితే ఆదివారం ఇతనికి అసలు సమస్య మొదలైంది. భరించలేని కడుపునొప్పి వచ్చింది. దీంతో అధికారులకు అసలు విషయం చెప్పేశాడు. తన పొట్టలో మొబైల్ ఉందని, తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. దీంతో అధికారులు వెంటనే అతడ్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎక్స్-రే తీయగా అతని కడుపులో ఫోన్ ఉన్నట్లు తేలింది. దాన్ని బయటకు తీసేందుకు వేరే ఆస్పత్రికి తీసుకెళ్లమని వైద్యులు సూచించారు. అనంతరం ఖైదీని పాట్నా మెడికల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మొబైల్ ఫోన్ మింగేసిన ఈ ఖైదీ పేరు ఖైసర్ అలీ. 2020 జనవరి 17న డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. మూడేళ్లుగా జైల్లోనే ఉంటున్నాడు. అయితే ఖైదీ వద్దకు మొబైల్ ఫోన్ ఎలా చేరిందని ప్రశ్నలు వెళ్లువెత్తుతున్నాయి. జైలు అధికారుల పాత్ర కూడా ఉండి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బిహార్ జైళ్లలో ఖైదీల వల్ల మొబైల్ ఫోన్లు బయటపడటం సాధారణమైపోయింది. 2021 మార్చి నుంచి ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో 35 సెల్ఫోన్లు ఖైదీల వద్ద లభ్యమయ్యాయి. భారత్‌లోని జైళ్లలో మొబైల్ ఫోన్స్ వినియోగంపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. అయినా కొందరు ఖైదీలు వీటిని ఉపయోగిస్తున్నారు. చదవండి: దివ్యాంగ వృద్ధుడికి డ్రోన్ ద్వారా పెన్షన్ -
భోజనం చేస్తున్న పిల్లలను ఈడ్చుకెళ్లారు
పాట్నా: రోజులు మారుతున్నా కొందరి మనస్తత్వాలు అలాగే ఉండిపోతున్నాయి. కంటికి కనిపించని అనవసర భావోద్వేగాలను నమ్ముకుని కళ్లముందు ఉన్న మనుషులకు దూరంగా ఉంటున్నారు.. దూరం పెడుతున్నారు.. ఛీదరించుకుంటున్నారు. తమ బిడ్డలకు ఓ వితంతువు మధ్యాహ్న భోజనం వండిపెట్టడమేమిటని బిహార్ లోని ఓ గ్రామానికి చెందిన ప్రజలు ఊగిపోయారు. ఆగ్రహంగా పాఠశాలలోకి ప్రవేశించి ఆ వంట చేసిన మహిళను హెచ్చరించి భోజనం చేస్తున్న తమ పిల్లలను ఈడ్చుకెళ్లారు. గోపాల్ ఘంజ్ జిల్లాలోని కళ్యాణ్ పూర్ అనే గ్రామంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. అందులో మధ్యాహ్న భోజనం సునితఆ కున్వార్ అనే ఓ మహిళ వండుతోంది. అయితే, గతంలోనే ఆమెపై కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తితో ఉండటం, ఆమె ప్రవర్తన మంచిదికాదని ఫిర్యాదులు చేయడంతో ఓసారి విధుల నుంచి తొలగించి బబితా దేవీ అనే మహిళను నియమించారు. అయితే, ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన మేజిస్ట్రేట్ కోర్టు తిరిగి సునీతనే ఆ విధుల్లో ఉంచాలని ఆదేశించడంతో స్కూల్ తిరిగి సునీతకు వంట బాధ్యతలు అప్పగించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన గ్రామస్తులు వచ్చి తమ పిల్లలు భోజనం చేస్తుండగా వారిని ఈడ్చుకెళ్లడమే కాకుండా.. గేట్ కు తాళం వేశారు. ఆమెను తొలగించే వరకు స్కూల్ తెరవడానికి ఒప్పుకోబోమని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ విషయాన్ని పై అధికారులు పరిశీలిస్తున్నారు.