gorakpur
-
యోగిపై పోటీ చేస్తున్నా.. అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను!
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీలు మారిన నేతలతో పలు నియోజకవర్గాల్లో మరింత హోరాహోరీగా పోటీ జరగనుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న విషయం తెలిసిందే. గోరఖ్‌పూర్ పార్లమెంట్ స్థానం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచిన.. ఆయన ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని తొలిసారి ఇక్కడే నుంచే పరీక్షించుకోనున్నారు. తాజాగా అదే నియోజకవర్గం నుంచి యోగిపై పోటీకి బరిలోకి దిగుతున్నట్లు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ గురువారం ప్రకటించారు. చంద్రశేఖర్ ఆజాద్ గతంలో సీఎం యోగిపై పోటీ చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ తరపున గోరఖ్‌పూర్ సదర్ స్థానంలో పోటీచేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘నేను గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం వల్ల జైల్లో ఉన్న ఏకైక రాజకీయ నేతను. ప్రస్తుత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రిని అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వను. ఎందుకంటే ఆయనపై నేను పోటీ చేస్తున్నాను. యోగిపై వ్యతిరేకంగా గోరఖ్‌పూర్‌లో పోటీకి దిగుతున్నా’ అని చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు. 1989 నుంచి గోరఖ్‌పూర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ(అలియన్స్లో ఒక్కసారి) గెలుస్తూ వస్తోంది. అయితే సీట్ల కేటాయింపు సర్దుబాటు కాకపోవడంతో తమ పార్టీ సమాజ్‌వాదీ పార్టీతో జట్టుకట్టడంలేదని ఇటీవల చంద్రశేఖర్ ఆజాద్ ప్రకటించారు. ఎస్పీ తమకు 25 సీట్లు కేటాయిస్తామని చెప్పి మోసం చేసిందని ఆరోపణలు కూడా చేశారు ఆజాద్. 2017లో దళితులకు, అగ్రకులాల మధ్య చోటుచేసుకున్న అల్లర్ల ఘటనతో భీమ్ ఆర్మీ వెలుగులోకి వచ్చింది. అల్లర్ల కారణంగా చంద్రశేఖర్ ఆజాద్ జైలుకు వెళ్లి.. 2018లో బెయిల్‌పై బయటకు వచ్చారు. 2019లో భీమ్ ఆర్మీ తరపున చంద్రశేఖర్ ఆజాద్ వారణాసి పార్లమెంట్ స్థానంలో నరేంద్ర మోదీపై పోటీ చేసిన విషయం తెలిసిందే. -
అతను కాస్తా.. ఆవిడగా మారడమే...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రైల్వే ఉన్నతాధికారులకు వింత అనుభవం ఎదురైంది. నివాసం మారినప్పుడు, మరేదైనా కారణాలతో కార్యాలయ రికార్డుల్లో మార్పులు చేయాలని మాత్రమే తెలిసిన వాళ్లకు.. తాజాగా జెండర్ మార్చాలని విజ్ఞప్తి వచ్చింది. అతను కాస్తా.. ఆవిడగా మారడమే దీనికి కారణం. వివరాలు.. రాజేష్ పాండే (35) తండ్రి రైల్వే ఉద్యోగి. తండ్రి 2003లో చనిపోవడంతో కారుణ్య నియామకం కింద రాజేష్ రైల్వేలో ఉద్యోగం పొందాడు. రైల్వే వర్క్ షాప్‌లో గ్రేడ్-1 టెక్నీషియన్‌గా చేరాడు. నలుగురు అక్కాచెల్లెళ్లకు ఒక్కడే సోదరుడైన రాజేష్‌కు చిన్నప్పటి నుంచి స్త్రీగా ఉండటమే ఇష్టం. దాంతో 2017లో రాజేష్ లింగమార్పిడి చేయించుకుని, సోనియా పాండేగా పేరు మార్చుకోవడం జరిగింది. అందరూ సోనియా అని పిలుస్తున్నా.. ఆఫీస్ రికార్డుల్లో మాత్రం ఇంకా రాజేష్ పాండే అనే ఉంది. దీంతో రికార్డుల్లో జెండర్ పేరు మార్చాలని గోరఖ్‌పూర్‌లోని ఈశాన్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్‌ను రాజేష్ అలియాస్ సోనియా కలిసింది. ఆ దరఖాస్తును హుండ్లీలోని రైల్వే బ్రాంచ్‌కు పంపించారు. రికార్డుల్లో పేరు, లింగం మార్చాలని కోరతూ దరఖాస్తు రావడం ఇదే మొదటిసారి అని వారు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. లింగ మార్పిడి చేసుకోవడానికి ముందే రాజేష్‌కు స్థానికంగా ఉండే ఓ యువతితో పెళ్లైంది. కానీ, అసలు విషయం బయటపడటంతో విడాకులు తప్పలేదు. భార్యకు తన శరీర స్వభావం గురించి చెప్పి విడాకులు తీసుకున్నానని, లింగ మార్పిడి అనంతరం అమ్మాయిగా జీవించడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది సోనియా పాండే. -
నేడే పీఎం–కిసాన్ నిధుల బదిలీ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం–కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని 10.30 నుంచి 11 గంటల వరకు పీఎం–కిసాన్ ముఖ్య ఉద్దేశాన్ని, 11 నుంచి 11.30 వరకు మన్ కీ బాత్ కార్యక్రమం, 11.30 నుంచి 12.30 వరకు పథకం ప్రారంభం, ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాలుంటాయని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాల్లోని గ్రామాల నుంచి కొందరు రైతులకు రూ.2 వేల చొప్పున పెట్టుబడి సాయం అందనుంది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా తెలిపారు. పీఎం–కిసాన్ వెబ్సైట్లో మొత్తం 17 లక్షలకు పైగా అర్హులైన రైతుల బ్యాంకు వివరాలు, ఆధార్ నెంబర్లను ఆప్‌లోడ్ చేశారు. మిగతా వివరాలను త్వరలోనే అప్లోడ్ చేయనున్నారు. ఇందులో కొందరు రైతులకు ఆదివారం పెట్టుబడి సాయం జమ కానుంది. ఇప్పటికే 5 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు నిధుల విడుదలకు సంబంధించి టోకెన్లు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొన్నాయి. విడతల వారీగా రైతులందరికీ పెట్టుబడి జమ అవుతుందని తెలిపారు. దీనిపై రాష్ట్ర వ్యవసాయశాఖ అన్ని జిల్లాల వ్యవసాయాధికారులతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ప్రతి సహాయ వ్యవసాయాధికారులు డివిజన్ స్థాయిలో జిల్లా, ఇతర ప్రజాప్రతినిధుల సమన్వయంతో లబ్ధిదారుల సమక్షంలో ప్రారంభించాలని, లబ్ధిపొందే రైతులను ఎక్కువ సంఖ్యలో ఆహ్వానించాలని ఆదేశాలు జారీచేశారు. -
గోరఖ్‌పూర్ ఘటన: బెయిల్ పిటిషన్ తిరస్కరణ
లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోరఖ్‌పూర్ 63 మంది చిన్నారుల మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న డాక్టర్ పూర్ణిమా శుక్లా బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. గోరఖ్‌పూర్‌లో గత ఏడాది ఆగస్ట్‌లో బీఆర్డీ మెడికల్ కాలేజీలో ఆక్సిజన్ కొరత కారణంగా 63 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అలహాబాద్ హైకోర్టు తొమ్మిది మందిపై అభియోగాలు మోపింది. వారిలో డాక్టర్ కఫీల్ ఖాన్‌కు ఇటివల అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. బీఆర్డీ మెడికల్ కాలేజీలో హోమియోపతి విభాగానికి చెందిన పూర్ణిమా శుక్లా మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ రాజీవ్ మిశ్రా భార్య. ముందస్తు విడుదల కోరుతూ పూర్ణిమా శుక్లా దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి యశ్వంత్ వర్మ విచారించారు. ప్రస్తుతం కేసు కీలక దశలో ఉందని, ఈ సమయంలో వారికి బెయిల్ మంజూరు చేస్తే విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని, అందుకే పిటిషన్ తిరస్కరిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. -
చేదు ఫలితాలు: బీజేపీ ఓడినవే ఎక్కువ
న్యూఢిల్లీ: సాధారణ ఎన్నికల్లో అసాధారణ ఫలితాలతో 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆపై జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం అధికంగా ఓటములను చవిచూస్తోంది. 2014 నుంచి ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా 23 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా కేవలం నాలుగింటినే బీజేపీ కైవసం చేసుకుంది. కాగా, కాంగెస్ పార్టీ 5 స్థానాల్ని గెలుచుకొని ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కంటే మెరుగ్గా ఉంది. తృణముల్ కాంగ్రెస్ నాలుగు స్థానాలు గెలిచి తన సత్తా చాటింది. మోదీ హవాలో.. మరో రెండు విజయాలు ఈ 23 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ సిట్టింగ్ స్థానాలు 10. ప్రధాని నరేంద్ర మోదీ హవా కొనసాగిన 2014లో రెండు స్థానాల్లో, 2016లో మరో రెండు సీట్లను మాత్రమే గెలుచుకున్న బీజేపీ.. మిగతా ఆరింటిని కోల్పోయింది. అయితే 2014లో ఉప ఎన్నికలు జరిగిన 5 లోక్‌సభ స్థానాలను ఆయా పార్టీలు తిరిగి చేజిక్కించుకోవడం గమనార్హం. 2016లో ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ పరవాలేదనిపించింది. లక్ష్మీపూర్ (అసోం), శాదోల్ (మధ్యప్రదేశ్) లోక్‌సభ స్థానాలను తిరిగి నిలబెట్టుకుంది. కంచుకోటలో కలవరం.. గత ఏడాది బీజేపీకి ఏమాత్రం కలిసిరాలేదు. పంజాబ్‌లోని అమృత్సర్, గుడాస్పూర్ లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పరాజయం పాలైంది. కాంగ్రెస్ అమృత్సర్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. అయితే వరసగా 4 సార్లు గుడాస్పూర్లో గెలుపు బావుటా ఎగరేసిన బీజేపీ ఆ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం. కేరళలోని మలప్పురం, జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ స్థానాల్లోనూ బీజేపీకి పరాభవం తప్పలేదు. ముఖ్యమంత్రి స్థానంలోనూ అపజయమే.. 2018లో బీజేపీ పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. రాజస్థాన్‌లోని అజ్మీర్, అల్వార్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండింటీనీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అంతకు ముందు ఆ రెండు స్థానాలు బీజేపీవే. పశ్చిమ బెంగాల్‌లోని ఉలుబెరియా స్థానంలో ఓటమి పాలైన బీజేపీ.. బిహార్‌లోనూ అదే పంథా కొనసాగించింది. బీజేపీకి అఖండ విజయాన్ని అందించి కేంద్రంలో అధికారంలో నిలిపిన ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఫూల్పూర్ స్థానాలను సైతం బీజేపీ కాపాడుకోలేక పోయింది. విశేషమేమంటే.. ఆ రెండూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యలు రాజీనామా చేసిన స్థానాలు కావడం. గతేడాది సీఎం, డిప్యూటీ సీఎంలుగా వీరు యూపీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగం కావడంతో ఆ స్థానాలు ఖాళీ అయ్యాయి. తాజాగా గోరఖ్‌పూర్, ఫూల్పూర్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే. యోగి ఆదిత్యనాథ్ వరసగా 5 సార్లు విజయభేరి మోగించిన తన కంచుకోట గోర్‌ఖ్‌పూర్‌లో బీజేపీ ఓటమి పాలవడం ఈ పార్టీకి మింగుడు పడడం లేదు. -
నేడు ఆలస్యంగా గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్: సికింద్రాబాద్–గోరఖ్‌పూర్ (12590) ఎక్స్‌ప్రెస్ నేడు (శుక్రవారం) ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీనియర్ పీఆర్వో షకీల్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఉదయం 7.20కి బయలుదేరాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల మూడు గంటలు ఆలస్యంగా ఉదయం 10.20కి బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు.