gotti pati ravikumar
-
’ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే’
-
విదేశాల్లో ఉన్నందువల్లే సమీక్షకు గైర్హాజరు
అద్దంకి : తాను విదేశాల్లో ఉన్నందువల్లే ఒంగోలులో గురువారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ జిల్లాస్థాయి సమీక్ష సమావేశానికి హాజరుకాలేకపోయానని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడారు. ‘నేను కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లాను. సమావేశాలు జరిగే విషయం ముందుగా తెలియకపోవడం వల్ల రాలేకపోయానే తప్ప మరే కారణం లేదు. ఆ విషయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియజేశా. నేను సమావేశానికి రాని విషయాన్ని సాకుగా చూపి..ఎందుకు రాలేదు? వేరే పార్టీకి వెళతారా అంటూ కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. అటువంటి అసత్య ప్రచారాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు నమ్మవద్దు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా.. బలమైన ప్రతిపక్షంగా ఉండి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సార థ్యంలో ప్రజల సమస్యలపై పోరాడతాం. మళ్లీ ప్రజల మన్ననలు పొంది వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయం’ అని చెప్పారు. -
మోడీతో చంద్రబాబుకు మంతనాలు అవసరమా?
ప్రకాశం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీతో మంతనాలు చేయడం అవసరమా? అని అద్దంకి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. రాష్ట్రం తగలబడుతున్న సమయంలో చంద్రబాబు మోడీతో మంతనాలు జరపడాన్ని ఆయన తప్పుబట్టారు. బాబుకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పడానికి ఇదే నిదర్శమని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గొట్టిపాటి..ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే.. సీమాంధ్ర ఎడారిగా మారుతుందన్నారు.చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పక్కకు నెట్టారని ఆయన తెలిపారు. ఒకవేళ విభజన జరిగితే ప్రకాశం జిల్లాకు చుక్క సాగర్ కు నీరు రావడం కూడా కష్టంగా మారుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఎగువ, దిగువ ప్రాంత రైతులు కొట్టుకు చావాల్సిందేనని రవి కుమార్ తెలిపారు.