ప్రకాశం: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీతో మంతనాలు చేయడం అవసరమా? అని అద్దంకి మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. రాష్ట్రం తగలబడుతున్న సమయంలో చంద్రబాబు మోడీతో మంతనాలు జరపడాన్ని ఆయన తప్పుబట్టారు. బాబుకు రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని చెప్పడానికి ఇదే నిదర్శమని ఆయన విమర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన గొట్టిపాటి..ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే.. సీమాంధ్ర ఎడారిగా మారుతుందన్నారు.చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను పక్కకు నెట్టారని ఆయన తెలిపారు.
ఒకవేళ విభజన జరిగితే ప్రకాశం జిల్లాకు చుక్క సాగర్ కు నీరు రావడం కూడా కష్టంగా మారుతుందని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఎగువ, దిగువ ప్రాంత రైతులు కొట్టుకు చావాల్సిందేనని రవి కుమార్ తెలిపారు.