ఎల్ఎండీలో పెరుగుతున్న నీటిమట్టం
తిమ్మాపూర్ : ఎస్సారెస్పీ నుంచి నీళ్లు విడుదల చేసిన నీరు రెండు రోజులుగా ఎల్ఎండీలో చేరుతోంది. దీంతో సోమవారం ఎల్ఎండీలో ఒక టీఎంసీ నీటిమట్టం పెరిగినట్లు ఈఈ శ్రీనివాస్ తెలిపారు. ఎల్ఎండీలో రెండు రోజుల క్రితం 2.3టీఎంసీల నీరుండగా.. ప్రస్తుతం 3.2 టీఎంసీలకు చేరింది. కాకతీయ, వరద కాల్వల ద్వారా 4వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. రెండు రోజుల్లో మరో టీఎంసీ నీటిమట్టం పెరుగనుంది.