gouthami puthra shathakarni
-
వినోద పన్ను మినహాయింపు లబ్ధి ఎవరికి?
సాక్షి, హైదరాబాద్: కొన్ని సినిమాలకు ప్రభుత్వం ఇచ్చే వినోద పన్ను మినహాయింపు లబ్ధిని సినీ ప్రేక్షకులు కాకుండా ఆ చిత్రాల నిర్మాతలు పొందుతుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రేక్షకుల కోసం ఇచ్చే పన్ను మినహాయింపులను నిర్మాతలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించింది. వినోద పన్ను లబ్ధి ప్రేక్షకులకు చెందాలా? లేక సదరు సినిమా నిర్మాతకు చెందాలా? అన్న విషయంపై స్పష్టతనివ్వాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 16కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయ మూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రానికి ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు వినోదపన్ను మినహాయింపునివ్వడాన్ని సవాలు చేస్తూ న్యాయవాది ఆదర్శ్‌కుమార్ 2017లో దాఖలు చేసిన పిల్ బుధవారం ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. వినోదపన్ను మినహాయింపును సినీ ప్రేక్షకులకు ఇస్తారని, దీంతో టికెట్ ధర తగ్గే అవకాశం ఉంటుందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. -
సాహో జీపీఎస్కే : ఎన్టీఆర్
నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి(జీపీఎస్కే) హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాపై టాలీవుడ్ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా గౌతమిపుత్రశాతకర్ణి సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. 'ఇది ఒక తెలుగు వాడి విజయం . తెలుగు జాతి గర్వించ దగ్గ చిత్రం. చరిత్ర మరచిన తెలుగు చక్రవర్తికి నీరాజనం' అని జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. సినిమా చూసిన అనంతరం సాహో నందమూరి బాలక్రిష్ణ, సాహో క్రిష్, సాహో గౌతమిపుత్ర శాతకర్ణి టీమ్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. Just finished watching #GPSK all I can say Saho #NBK Saho @DirKrish and Saho to the whole team of #GPSK pic.twitter.com/gFsp8tMj86 — tarakaram n (@tarak9999) 15 January 2017 ఇది ఒక తెలుగు వాడి విజయం . తెలుగు జాతి గర్వించదగ్గ చిత్రం. చరిత్ర మరచిన తెలుగు చక్రవర్తి కి నీరాజనం — tarakaram n (@tarak9999) 15 January 2017