సాహో జీపీఎస్‌కే : ఎన్టీఆర్‌ | ntr praises gouthami puthra shathakarni | Sakshi
Sakshi News home page

సాహో జీపీఎస్‌కే : ఎన్టీఆర్‌

Published Mon, Jan 16 2017 10:35 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

సాహో జీపీఎస్‌కే : ఎన్టీఆర్‌ - Sakshi

సాహో జీపీఎస్‌కే : ఎన్టీఆర్‌

నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి(జీపీఎస్‌కే) హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది.  ఈ సినిమాపై టాలీవుడ్‌ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.  తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌ కూడా గౌతమిపుత్రశాతకర్ణి సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు.

'ఇది ఒక తెలుగు వాడి విజయం . తెలుగు జాతి గర్వించ దగ్గ చిత్రం. చరిత్ర మరచిన తెలుగు చక్రవర్తికి నీరాజనం' అని జూనియర్ ఎన్టీఆర్‌ తన ట్విట్టర్‌ అకౌంట్‌లో పేర్కొన్నారు. సినిమా చూసిన అనంతరం సాహో నందమూరి బాలక్రిష్ణ, సాహో క్రిష్‌, సాహో గౌతమిపుత్ర శాతకర్ణి టీమ్‌ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement