Gova team
-
గోవా శుభారంభం
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ముంబై: స్వప్నిల్ అస్నోడ్కర్ (59 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ సూపర్ లీగ్‌లో సౌత్‌జోన్ చాంపియన్ గోవా జట్టు శుభారంభం చేసింది. రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో గోవా 8 వికెట్ల తేడాతో హర్యానాపై విజయం సాధించింది. మొదట హర్యానా 20 ఓవర్లలో 9 వికెట్లకు 116 పరుగులు చేసింది. జోగిందర్ శర్మ (29), రాహుల్ దలాల్ (25) రాణించారు. గడేకర్, గౌరేష్, గార్డ్ తలా రెండు వికెట్లు తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గోవా 18 ఓవర్లలో 2 వికెట్లకు 117 పరుగులు చేసింది. డోంగ్రే (29) ఫర్వాలేదనిపించాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో జార్ఖండ్‌ను ఓడించింది. ముంబైలో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌ల్లో బరోడా 7 వికెట్ల తేడాతో బెంగాల్‌పై; కేరళ 14 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపొందాయి. మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా తలపడుతున్న ఈ టోర్నీలో అగ్రస్థానంలో నిలిచిన టీమ్‌లు ఈనెల 14న జరిగే ఫైనల్లో పోటీపడతాయి. గ్రూప్ ‘ఎ’లో హర్యానా, గోవా, జార్ఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్; గ్రూప్ ‘బి’లో ఢిల్లీ, కేరళ, బెంగాల్, బరోడా, రాజస్థాన్ జట్లు ఉన్నాయి. -
గోవా చేతిలో ఆంధ్ర చిత్తు
పోర్వోరిమ్: రంజీ ట్రోఫీ సీజన్‌ను ఆంధ్ర జట్టు పరాజయంతో ముగించింది. బుధవారం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో గోవా 8 వికెట్ల తేడాతో ఆంధ్రను చిత్తు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 32/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే ఆలౌటైంది. ఎం. శ్రీరామ్ 34, శివకుమార్ 26 నాటౌట్, సుధాకర్ 24 పరుగులు చేశారు. గోవా బౌలర్లలో గడేకర్ 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, జకాతి, అమిత్ యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 42 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గోవా 15 ఓవర్లలో 2 వికెట్లకు 43 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 2013-14 సీజన్లో ఆడిన 8 మ్యాచుల్లో ఆంధ్ర ఒకటి మ్యాచ్‌లో విజయం సాధించగా, రెండింటిలో ఓడింది. మిగతా 5 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. త్రిపురపై గెలిచిన ఆంధ్ర జమ్మూ కాశ్మీర్, గోవా చేతుల్లో ఓడింది. ఈ ఏడాది క్వార్టర్ ఫైనల్ చేరుకోలేకపోయిన జట్టు, వచ్చే సీజన్లో కూడా గ్రూప్ ‘సి’లోనే ఆడాల్సి ఉంటుంది. పంజాబ్, బెంగాల్ గెలుపు చెన్నై: చివరి వరకు ఆసక్తికరంగా సాగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బెంగాల్ 4 పరుగుల తేడాతో తమిళనాడును ఓడించింది. 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ రెండో రోజు ముగిసే సరికి 102/1తో పటిష్టంగా కనిపించిన తమిళనాడు బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. స్పిన్నర్ సౌరాశిష్ లాహిరి (7/62) చెలరేగడంతో తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైంది. ధన్బాద్లో జార్ఖండ్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్, 173 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.