సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ
ముంబై: స్వప్నిల్ అస్నోడ్కర్ (59 బంతుల్లో 70 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో సయ్యద్ ముస్తాక్ అలీ టి20 ట్రోఫీ సూపర్ లీగ్‌లో సౌత్‌జోన్ చాంపియన్ గోవా జట్టు శుభారంభం చేసింది. రాజ్‌కోట్‌లో మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో గోవా 8 వికెట్ల తేడాతో హర్యానాపై విజయం సాధించింది. మొదట హర్యానా 20 ఓవర్లలో 9 వికెట్లకు 116 పరుగులు చేసింది. జోగిందర్ శర్మ (29), రాహుల్ దలాల్ (25) రాణించారు. గడేకర్, గౌరేష్, గార్డ్ తలా రెండు వికెట్లు తీశారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గోవా 18 ఓవర్లలో 2 వికెట్లకు 117 పరుగులు చేసింది. డోంగ్రే (29) ఫర్వాలేదనిపించాడు. మరో మ్యాచ్‌లో గుజరాత్ 6 వికెట్ల తేడాతో జార్ఖండ్‌ను ఓడించింది. ముంబైలో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌ల్లో బరోడా 7 వికెట్ల తేడాతో బెంగాల్‌పై; కేరళ 14 పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపొందాయి. మొత్తం 10 జట్లు రెండు గ్రూప్‌లుగా తలపడుతున్న ఈ టోర్నీలో అగ్రస్థానంలో నిలిచిన టీమ్‌లు ఈనెల 14న జరిగే ఫైనల్లో పోటీపడతాయి. గ్రూప్ ‘ఎ’లో హర్యానా, గోవా, జార్ఖండ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్; గ్రూప్ ‘బి’లో ఢిల్లీ, కేరళ, బెంగాల్, బరోడా, రాజస్థాన్ జట్లు ఉన్నాయి.
గోవా శుభారంభం
Published Wed, Apr 9 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 5:45 AM
Advertisement