పోర్వోరిమ్: రంజీ ట్రోఫీ సీజన్‌ను ఆంధ్ర జట్టు పరాజయంతో ముగించింది. బుధవారం మూడు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో గోవా 8 వికెట్ల తేడాతో ఆంధ్రను చిత్తు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 32/3తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌లో 160 పరుగులకే ఆలౌటైంది.
ఎం. శ్రీరామ్ 34, శివకుమార్ 26 నాటౌట్, సుధాకర్ 24 పరుగులు చేశారు. గోవా బౌలర్లలో గడేకర్ 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, జకాతి, అమిత్ యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 42 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గోవా 15 ఓవర్లలో 2 వికెట్లకు 43 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 2013-14 సీజన్‌లో ఆడిన 8 మ్యాచుల్లో ఆంధ్ర ఒకటి మ్యాచ్‌లో విజయం సాధించగా, రెండింటిలో ఓడింది. మిగతా 5 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. త్రిపురపై గెలిచిన ఆంధ్ర జమ్మూ కాశ్మీర్, గోవా చేతుల్లో ఓడింది. ఈ ఏడాది క్వార్టర్ ఫైనల్ చేరుకోలేకపోయిన జట్టు, వచ్చే సీజన్‌లో కూడా గ్రూప్ ‘సి’లోనే ఆడాల్సి ఉంటుంది.
పంజాబ్, బెంగాల్ గెలుపు
చెన్నై: చివరి వరకు ఆసక్తికరంగా సాగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో బెంగాల్ 4 పరుగుల తేడాతో తమిళనాడును ఓడించింది. 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ రెండో రోజు ముగిసే సరికి 102/1తో పటిష్టంగా కనిపించిన తమిళనాడు బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. స్పిన్నర్ సౌరాశిష్ లాహిరి (7/62) చెలరేగడంతో తమిళనాడు రెండో ఇన్నింగ్స్‌లో 180 పరుగులకు ఆలౌటైంది. ధన్‌బాద్‌లో జార్ఖండ్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో పంజాబ్ ఇన్నింగ్స్, 173 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
గోవా చేతిలో ఆంధ్ర చిత్తు
Published Thu, Jan 2 2014 1:15 AM | Last Updated on Sat, Jun 2 2018 5:38 PM
Advertisement